Japan 5 Days Collections: కార్తికి దెబ్బ మీద దెబ్బ.. 5 రోజుల్లో ఇంతేనా.. అన్ని కోట్ల నష్టాల దిశగా!
పేరుకు తమిళ హీరోనే అయినా సౌత్ ఇండియా మొత్తంలో క్రేజ్‌ను, మార్కెట్‌ను ఏర్పరచుకున్న హీరో కార్తి. విలక్షణమైన నటనతో పాటు విభిన్నమైన సినిమాలు చేస్తూ సత్తా చాటుతోన్న అతడు.. వరుసగా హిట్లను ఖాతాలో వేసుకుంటున్నాడు. ఈ జోష్‌లోనే ఇప్పుడు 'జపాన్' అనే ప్రయోగాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ మూవీకి టాక్‌తో పాటు రెస్పాన్స్ కూడా ఆశించిన విధంగా రాలేదు. ఫలితంగా ఇది బాక్సాఫీస్ ముందు నత్తనడకన సాగుతోంది. మరి కార్తి 'జపాన్' మూవీ 5 రోజుల వసూళ్లను మీరే చూడండి!
జపాన్‌గా కార్తి కొత్త ప్రయోగం:తమిళ స్టార్ కార్తి హీరోగా నటించిన ప్రయోగాత్మక చిత్రమే 'జపాన్'. రాజు మురుగణ్ తెరకెక్కించిన ఈ క్రేజీ సినిమాను డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్‌ఆర్ ప్రకాష్ బాబు, ఎస్‌ఆర్ ప్రభు సంయుక్తంగా నిర్మించారు. ఇందులో అను ఇమాన్యూయేల్ హీరోయిన్‌గా నటించగా.. సునీల్ కీలక పాత్రను పోషించాడు. ఈ క్రేజీ సినిమాకు జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని సమకూర్చాడు.

జపాన్ మూవీ బిజినెస్ ఇలా:ఫుల్ లెంగ్త్ కామెడీ జోనర్‌లో రూపొందిన 'జపాన్' మూవీ ఆరంభంలోనే మంచి హైప్ క్రియేట్ చేసుకుంది. ఫలితంగా ఈ సినిమా రైట్స్‌కు భారీ స్థాయిలో డిమాండ్ ఏర్పడింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో రూ. 6 కోట్లు, తమిళంతో సహా మిగిలిన అన్ని ప్రాంతాలూ కలిపి రూ. 34 కోట్లు బిజినెస్ అయింది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ రూ. 40 కోట్లు థియేట్రికల్ బిజినెస్ చేసింది.
5వ రోజు తెలుగు వసూళ్లు:కార్తి హీరోగా డార్క్ కామెడీతో రూపొందిన 'జపాన్' మూవీ ఎన్నో అంచనాలతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చాలా గ్రాండ్‌గా రిలీజ్ అయింది. కానీ, దీనికి ఆరంభంలోనే నెగెటివ్ టాక్ రావడంతో స్పందన పెద్దగా రావట్లేదు. ముఖ్యంగా హాలీడే ఉన్నా సత్తా చాటలేదు. తర్వాత కూడా డౌన్ అవుతోంది. ఈ క్రమంలోనే 5వ రోజు రూ. 21 లక్షలు షేర్‌ను మాత్రమే వసూలు చేసింది.

5 రోజులకూ కలిపి ఎంత?:కార్తి నటించిన 'జపాన్' మూవీకి తెలుగులో నిరాశ పరుస్తూనే ఉంటోంది. ఫస్డ్ డే దారుణమైన ఓపెనింగ్స్ సాధించిన ఈ చిత్రం.. సెలవు రోజుల్లోనూ కూడా డల్ అయింది. ఫలితంగా దీనికి చాలా తక్కువ వసూళ్లు వచ్చాయి. ఇలా ఐదు రోజుల్లో 'జపాన్' మూవీ నైజాంలో రూ. 1.11 కోట్లు ఆంధ్రా మొత్తంలో రూ. 1.42 కోట్లతో కలిపి రూ. 2.53 కోట్లు షేర్, రూ. 4.75 కోట్లు గ్రాస్ రాబట్టింది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే:క్రేజీ కాన్సెప్టుతో రూపొందిన 'జపాన్' మూవీకి ఐదు రోజుల్లో తమిళనాడులో రూ. 10.65 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ. 4.75 కోట్లు, కర్నాటకలో రూ. 1.25 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 55 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 4.95 కోట్లు వసూలు చేసింది. ఇలా ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా రూ. 22.15 కోట్లు గ్రాస్‌తో పాటు రూ. 11.50 కోట్లు షేర్‌ను మాత్రమే వసూలు చేసింది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?:కార్తి నటించిన 'జపాన్' మూవీ అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 40 కోట్లు బిజినెస్ చేయగా.. 5 రోజుల్లో రూ. 11.50 కోట్లు రాబట్టింది. అంటే 41 కోట్లు టార్గెట్‌కు ఇంకా రూ. 29.50 కోట్లు వెనుకబడి ఉంది. తెలుగులో ఈ చిత్రానికి రూ. 6 కోట్లు బిజినెస్ జరిగింది. అంటే 6.50 కోట్ల టార్గెట్‌తో వచ్చిన ఈ మూవీకి ఇంకా రూ. 3.97 కోట్లు వసూలు కావాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











