Japan Closing Collections: జపాన్ పని ఔట్.. 40 కోట్లకు వచ్చింది ఇంతే.. కార్తి చెత్త రికార్డు

కోలీవుడ్‌లోని చాలా మంది హీరోలు తెలుగులో సైతం మంచి మార్కెట్‌ను ఏర్పరచుకున్నారు. అందులో విలక్షణ నటుడు కార్తి ఒకడు. తనదైన చిత్రాలతో దక్షిణాది ప్రేక్షకులను అలరిస్తోన్న అతడు.. ఈ మధ్య కాలంలో ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. ఈ ఊపులోనే ఇటీవలే 'జపాన్' అనే క్రేజీ కామెడీ మూవీతో వచ్చాడు. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాకు టాక్‌తో పాటు రెస్పాన్స్ కూడా ఆశించిన విధంగా రాలేదు. ఫలితంగా ఇది బాక్సాఫీస్ ముందు దారుణమైన వసూళ్లతో ఉనికి కోల్పోయింది. మరి కార్తి 'జపాన్' మూవీ క్లోజింగ్ వసూళ్లను మీరే చూడండి!

జపాన్‌గా మారిపోయిన కార్తి:కోలీవుడ్ స్టార్ కార్తి హీరోగా నటించిన కామెడీ సినిమానే 'జపాన్'. రాజు మురుగణ్ తెరకెక్కించిన ఈ క్రేజీ సినిమాను డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్‌ఆర్‌ ప్రకాష్‌ బాబు, ఎస్‌ఆర్‌ ప్రభు సంయుక్తంగా నిర్మించారు. ఇందులో అను ఇమాన్యూయేల్ హీరోయిన్‌గా నటించగా.. సునీల్ కీలక పాత్రను పోషించాడు. ఈ క్రేజీ సినిమాకు జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందించాడు.

Karthi Starrer Japan Movie Closing Box Office Collections

జపాన్ మూవీ బిజినెస్ ఇలా:డార్క్ కామెడీతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'జపాన్' మూవీ ఆరంభంలోనే మంచి హైప్ క్రియేట్ చేసుకుంది. ఫలితంగా ఈ సినిమా రైట్స్‌కు భారీ స్థాయిలో డిమాండ్ ఏర్పడింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో రూ. 6 కోట్లు, తమిళంతో సహా మిగిలిన అన్ని ప్రాంతాలూ కలిపి రూ. 34 కోట్లు బిజినెస్ అయింది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ రూ. 40 కోట్లు థియేట్రికల్ బిజినెస్ అయింది.

అలాంటి టాక్‌తో డల్‌గానే:కార్తి హీరోగా రాజు మురుగణ్ తెరకెక్కించిన 'జపాన్' మూవీ ఎన్నో అంచనాలతో దీపావళి కానుకంగా విడుదలైంది. దీనికి ఓవర్సీస్‌తో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడులోనూ నెగెటివ్ టాకే వచ్చింది. దీంతో ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా ఏ ప్రాంతంలోనూ స్పందన పెద్దగా రాలేదు. ముఖ్యంగా హాలీడే ఉన్నా సత్తా చాటలేదు. దీంతో చాలా చోట్ల రన్‌కు కంప్లీట్ చేసేసుకుంది.

Karthi Starrer Japan Movie Closing Box Office Collections

తెలుగులో వసూళ్లు ఎంత?:కార్తి నటించిన 'జపాన్' మూవీకి తెలుగులో నిరాశనే ఎదుర్కోవాల్సి వచ్చింది. వరుస సెలవులు ఉన్నా ఈ చిత్రం ఏమాత్రం ప్రభావాన్ని చూపించలేకపోయింది. ఫలితంగా దీనికి మన దగ్గర చాలా తక్కువ వసూళ్లు వచ్చాయి. ఇలా తెలుగులో 'జపాన్' మూవీ నైజాంలో రూ. 1.17 కోట్లు ఆంధ్రా మొత్తంలో రూ. 1.50 కోట్లతో కలిపి రూ. 2.67 కోట్లు షేర్, రూ. 5.05 కోట్లు గ్రాస్ రాబట్టింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే:'జపాన్' మూవీ వరల్డ్ వైడ్‌గా దాదాపుగా క్లోజింగ్‌కు వచ్చేసింది. ఇది తమిళనాడులో రూ. 11.25 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ. 5.05 కోట్లు, కర్నాటకలో రూ. 1.34 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 60 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 5.10 కోట్లు వసూలు చేసింది. ఇలా ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా రూ. 23.34 కోట్లు గ్రాస్‌తో పాటు రూ. 12.15 కోట్లు షేర్‌ను మాత్రమే వసూలు చేసింది.

Karthi Starrer Japan Movie Closing Box Office Collections

ఓవరాల్ టార్గెట్ ఎంతంటే:'జపాన్' మూవీ అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 40 కోట్లు బిజినెస్ చేయగా.. ఫుల్ రన్‌లో రూ. 12.15 కోట్లు రాబట్టింది. అంటే 41 కోట్లు టార్గెట్‌కు ఇంకా రూ. 28.85 కోట్లు నష్టాలను ఎదుర్కొంది. తెలుగులో ఈ చిత్రానికి రూ. 6 కోట్లు బిజినెస్ జరిగింది. అంటే 6.50 కోట్ల టార్గెట్‌తో వచ్చిన ఈ మూవీకి రూ. 3.83 కోట్లు వరకూ నష్టాలు ఎదురయ్యాయి.

కార్తి కెరీర్‌లో చెత్త రికార్డు:విలక్షణ నటుడు కార్తి నటించిన 'జపాన్' మూవీ వారం రోజుల లోపే రన్‌ను ముగించేసుకుంది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా రెస్పాన్స్‌ను సొంతం చేసుకోలేపోవడంతో ఈ చిత్రం రూ. 28 కోట్లకు పైగా నష్టాలను చవి చూసింది. ఫలితంగా కార్తి కెరీర్‌లోనే అత్యధిక లాస్‌ను ఎదుర్కొన్న సినిమాగా ఇది చెత్త రికార్డును నమోదు చేసుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X