Japan Day 1 Collections: జపాన్‌కు షాకింగ్ కలెక్షన్లు.. తొలి రోజే అన్ని కోట్లు.. తెలుగులో ఎంతో చూస్తే!
తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన చాలా మంది హీరోలు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్‌ను, మార్కెట్‌ను ఏర్పరచుకున్నారు. అలాంటి వారిలో విలక్షణ నటుడు కార్తి ఒకడు. సూర్య తమ్ముడిగా పరిచయం అయినా.. తనదైన భిన్నమైన సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తోన్నాడు. దీనికితోడు ఈ మధ్య కాలంలో హిట్లు మీద హిట్లు కొడుతూ ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. ఈ జోష్‌లోనే ఇప్పుడు కార్తి 'జపాన్' అనే చిత్రంతో వచ్చాడు. క్రేజీ కాన్సెప్టుతో వచ్చిన ఈ మూవీకి మొదటి రోజు ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? ఎన్ని కోట్ల రూపాయలను వసూలు చేసింది? అనేవి చూద్దాం పదండి!
జపాన్‌గా ఎంట్రీ ఇచ్చిన కార్తి : కోలీవుడ్ స్టార్ కార్తి హీరోగా, రాజు మురుగణ్ తెరకెక్కించిన వినోదాత్మక చిత్రమే 'జపాన్'. ఈ క్రేజీ మూవీని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్‌ఆర్ ప్రకాష్ బాబు, ఎస్‌ఆర్ ప్రభు సంయుక్తంగా నిర్మించారు. ఇందులో అను ఇమాన్యూయేల్ హీరోయిన్‌గా నటించగా.. సునీల్ కీలక పాత్రను పోషించాడు. ఈ క్రేజీ సినిమాకు జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ ఇచ్చాడు.

జపాన్ మూవీ బిజినెస్ ఇలా : డార్క్ కామెడీతో క్రేజీగా రూపొందిన 'జపాన్' మూవీ ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించింది. అందుకు అనుగుణంగానే ఈ సినిమా హక్కులకు అన్ని ప్రాంతాల్లో భారీ డిమాండ్ ఏర్పడింది. తెలుగు రాష్ట్రాల్లో రూ. 6 కోట్లు, తమిళంతో సహా మిగిలిన అన్ని ప్రాంతాలూ కలిపి రూ. 34 కోట్లు బిజినెస్ అయింది. ఇలా మొత్తంగా రూ. 40 కోట్లు థియేట్రికల్ బిజినెస్ చేసింది.
అలాంటి టాక్.. స్పందనిలా : ఎన్నో అంచనాల నడుమ విడుదలైన కార్తి 'జపాన్' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ మిక్స్‌డ్ టాకే వచ్చింది. అందుకు ఏమాత్రం సరిపోని విధంగా దీనికి రెస్పాన్స్ డీసెంట్‌గా వచ్చింది. దీంతో ఈ సినిమాకు అనుకున్న దానికంటే ఓపెనింగ్ డేన కలెక్షన్లు తక్కువగా వస్తాయని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అందుకు తగ్గట్లే ఫస్ట్ డేనే డల్ కలెక్షన్లను రాబట్టింది.

తెలుగులో అన్ని కోట్లతో : తెలుగు రాష్ట్రాల్లో సైతం కార్తికి మంచి ఫాలోయింగ్ ఉంది. దీంతో అతడు నటించిన 'జపాన్' మూవీకి మంచిగా థియేటర్లు దొరికాయి. ఫలితంగా ఈ చిత్రం గ్రాండ్‌గా రిలీజ్ అయింది. కానీ, దీనికి టాక్ ఇక్కడ నెగెటివ్‌గా రావడంతో రెస్పాన్స్ తగ్గింది. తద్వారా మొదటి రోజు 'జపాన్' మూవీ ఆంధ్రా, తెలంగాణలో కలిపి రూ. 90 లక్షలు - 1 కోటి వరకూ వసూళ్లను రాబట్టింది.
వరల్డ్ వైడ్‌గా ఎంతంటే : ఫుల్ లెంగ్త్ ఫన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'జపాన్' మూవీకి తమిళంలోనూ ఆశించిన రీతిలో వసూళ్లు రాలేదు. అక్కడ ఈ చిత్రం రూ. 3.50 - 4 కోట్లు వరకూ షేర్ మాత్రమే వసూలు చేసింది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలనూ కలుపుకుంటే ఇది రూ. 5 కోట్లు లోపు షేర్‌ను మాత్రమే రాబట్టింది. ఇది చాలా తక్కువ మొత్తం అనే చెప్పుకోవాలి.


Click it and Unblock the Notifications











