twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Viruman 3 Days Collections: కార్తి సినిమాకు రికార్డు కలెక్షన్లు.. సూర్య, జ్యోతికకు లాభాలు వస్తాయా!

    |

    తమిళ సినీ ఇండస్ట్రీకి చెందిన కొంత మంది హీరోలకు తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి మార్కెట్ ఉన్న విషయం తెలిసిందే. అందులో సూర్య సోదరుడిగా పరిచయమై.. కోలీవుడ్‌లో ప్రస్తుతం స్టార్‌గా వెలుగొందుతోన్న కార్తి ఒకడు. అన్న కంటే ఆలస్యంగానే సినిమాల్లోకి ప్రవేశించినప్పటికీ... మంచి మంచి సినిమాలతో అతడి కంటే ముందే టాలీవుడ్‌లో మంచి మార్కెట్‌ను ఏర్పరచుకున్నాడు. అందుకు అనుగుణంగానే ప్రతి సినిమానూ ఇక్కడ విడుదల చేస్తున్నాడు. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా ఫాలోయింగ్‌ను క్రమంగా పెంచుకుంటోన్నాడు. ఫలితంగా రెట్టించిన ఉత్సాహంతో సినిమాల మీద సినిమాలు చేస్తూ వస్తున్నాడు.

    ఉల్లిపొర లాంటి చీరలో రమ్యకృష్ణ: అందాలన్నీ కనిపించడంతో ఇబ్బందిఉల్లిపొర లాంటి చీరలో రమ్యకృష్ణ: అందాలన్నీ కనిపించడంతో ఇబ్బంది

    కొంత కాలంగా సరైన బ్రేక్ లేక ఇబ్బందులు పడుతోన్న కార్తి.. ఫలితాలతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే అతడు తాజాగా 'విరుమన్' అనే సినిమాలో నటించాడు. ఎమ్ ముత్తయ్య అనే దర్శకుడు తెరకెక్కించిన ఈ సినిమాను సూర్య, జ్యోతిక ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. దీంతో ఈ సినిమా ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించింది. దీనికితోడు ఈ మూవీ నుంచి వచ్చిన అప్‌డేట్లు అంచనాలను ఒక్కసారిగా పెంచేశాయి. ఫలితంగా ఈ సినిమా హక్కుల కోసం అన్ని ఏరియాల్లోనూ తీవ్ర స్థాయిలో డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో విరుమన్ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 40 కోట్ల బిజినెస్ జరిగినట్లు తెలిసింది.

     Karthi Viruman Movie 3 Days Box Office Collections

    ఎన్నో అంచనాల నడుమ కార్తి నటించిన 'విరుమన్' మూవీ ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫుల్ లెంగ్త్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమాకు తమిళనాడులో మిక్స్‌డ్ టాక్ వచ్చింది. అందుకు అనుగుణంగానే ఓవర్సీస్‌లో సైతం ఈ చిత్రానికి అలాంటి టాకే దక్కింది. దీంతో కలెక్షన్లు అంతగా వచ్చే అవకాశం లేదని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేశారు. కానీ, ఊహించని విధంగా ఈ సినిమాకు వసూళ్లు పోటెత్తాయి. దీంతో కార్తి కెరీర్‌లోనే అత్యధికంగా ఈ చిత్రం మొదటి రోజు రూ. 8 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది. ఆ తర్వాత వీకెండ్ కావడంతో అదే కంటిన్యూ అవుతూ వచ్చింది.

    బాత్‌టబ్‌లో నగ్నంగా హీరోయిన్: స్నానం చేస్తోన్న ఫొటోలతో సంచలనంబాత్‌టబ్‌లో నగ్నంగా హీరోయిన్: స్నానం చేస్తోన్న ఫొటోలతో సంచలనం

    కార్తి హీరోగా నటించిన 'విరుమన్' మూవీకి టాక్‌తో సంబంధం లేకుండా ప్రేక్షకుల నుంచి మద్దతు లభిస్తోంది. ఫలితంగా ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని ఏరియాల్లోనూ కలెక్షన్లు పోటెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ చిత్రం మూడు రోజుల్లోనే రూ. 30 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసినట్లు ట్రేడ్ పండితులు వెల్లడించారు. మొత్తంగా మూడు రోజుల్లో కార్తి సినిమాకు తమిళనాడులో రూ. 26.04 కోట్లు గ్రాస్ వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలుపుకుంటే ఈ మూవీకి రూ. 30.04 కోట్లు వసూలు అయినట్లు తెలిసింది. అంటే మరో రూ. 10 కోట్లు గ్రాస్ వసూలు అయితే ఈ సినిమా క్లీన్ హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుందన్న మాట.

    మాస్ మూవీగా వచ్చిన 'విరుమన్'లో కార్తి సరసన లెజెండరీ డైరెక్టర్ ఎస్ శంకర్ కుమార్తె అదితి శంకర్ హీరోయిన్‌గా నటించింది. అలాగే, ఇందులో రాజ్ కిరణ్, ప్రకాశ్ రాజ్, సూరి సహా ఎంతో మంది కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించాడు. ఇక, ఈ చిత్రాన్ని 2డీ ఎంట‌ర్టైన‌మెంట్స్ ప‌తాకంపై సూర్య, జ్యోతిక నిర్మించారు.

    English summary
    Kollywood Star Hero Karthi Did Viruman Movie Under M. Muthaiah Direction. This Movie Collects 30 Crore Gross in 3 Days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X