Karthikeya 2 day 1 collections తొలి రోజు బాక్సాఫీస్ ఊచకోత.. నిఖిల్ కెరీర్‌లో హయ్యెస్ట్‌గా

యువ దర్శకుడు చందూ మొండేటి దర్శకత్వంలో యువ హీరో నిఖిల్ నటించిన కార్తీకేయ 2 చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీగా హల్‌చల్ చేస్తున్నది. 2004లో వచ్చిన కార్తీకేయ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిన ఈ సినిమా తొలి ఆట నుంచి మంచి టాక్‌తో దూసుకెళ్తున్నది. ప్యాన్ ఇండియా సినిమాగా రూపొందిన ఈ చిత్రం అన్ని భాషల్లోను భారీగా వసూళ్లను రాబడుతున్నది. ఈ సినిమా తొలి రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

తొలి ఆట నుంచే భారీగా ఆక్యుపెన్సీ

తొలి ఆట నుంచే భారీగా ఆక్యుపెన్సీ


కార్తీకేయ 2 చిత్రం టీజర్లు, ట్రైలర్లు, ప్రమోషన్ కార్యక్రమాలు ఊపందుకోవడంతో అడ్వాన్స్ బుకింగ్‌కు భారీగా రెస్పాన్స్ లభించింది. ఉదయం ఆటల తర్వాత టాక్ పాజిటివ్‌గా ఉండటంతో మధ్యాహ్నం, ఈవెనింగ్ షోలకు మంచి ఆక్యుపెన్సీ నమోదైంది. దాంతో తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో మంచి స్పందన వ్యక్తమైంది.

సక్సెస్ సంబరాలతో

సక్సెస్ సంబరాలతో


కార్తీకేయ 2 సినిమాకు లభించిన ఓపెనింగ్స్‌తో సంతృప్తి చెందిన యూనిట్ సభ్యులు, నిర్మాత, దర్శకులు సక్సెస్ సంబరాలను జరుపుకొన్నారు. దేశవ్యాప్తంగా భారీ కలెక్షన్లు లభిస్తున్నట్టు ట్రేడ్ రిపోర్టులు అందాయని నిర్మాతలు చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లోనే 70 శాతానికి పైగా ఆక్యుపెన్సీ లభించింది. హిందీ ప్రాంతంలో 30 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది.

ఇతర రాష్ట్రాల్లో ఆక్యుపెన్సీ

ఇతర రాష్ట్రాల్లో ఆక్యుపెన్సీ


కార్తీకేయ సినిమా ఇతర రాష్ట్రాల్లో అక్యుపెన్సీ విషయానికి వస్తే.. బెంగళూరులో 50 శాతం, చెన్నైలో 62 శాతం, నేషనల్ క్యాపిటల్ రీజన్‌లో 50 శాతం, ముంబైలో 40 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. నైజాం, ఆంధ్రాల్లో కూడా హౌస్‌పుల్ బోర్డుల పడ్డాయి.

తెలుగు రాష్ట్రాల్లో

తెలుగు రాష్ట్రాల్లో


తెలుగు రాష్ట్రాల్లో కార్తీకేయ 2 చిత్రం 340 థియేటర్లలో రిలీజైంది. ఈ వారాంతం తర్వాత భారీగా స్రీన్స్ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలి రోజు నైజాం, ఆంధ్రాలో 4 కోట్ల షేర్ రాబట్టే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

తొలి రోజు కలెక్షన్ల అంచనా

తొలి రోజు కలెక్షన్ల అంచనా


ఇక కర్ణాటక, హిందీ ప్రాంతాల్లో కార్తీకేయ చిత్రం భారీ వసూళ్లను నమోదు చేసింది. లాల్ సింగ్ చడ్డా, రక్షా బంధన్ చిత్రాలకు ధీటుగా కార్తీకేయ 2 వసూళ్లను నమోదు చేసినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అంతా సవ్యంగా జరిగితే.. ఈ సినిమా తొలి రోజు 7 కోట్ల నుంచి 7.5 కోట్ల షేర్ ప్రపంచవ్యాప్తంగా నమోదు చేసే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి.

కార్తీకేయ 2 లాభాల్లోకి రావాలంటే

కార్తీకేయ 2 లాభాల్లోకి రావాలంటే


కార్తీకేయ 2 చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రీ రిలీజ్ భారీగా జరిగింది. హిందీ, తెలుగు, ఇతర భాషలకు సంబంధించిన బిజినెస్ మొత్తం 17.2 కోట్లు నమోదైంది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే.. కనీసం 18 కోట్ల బిజినెస్ జరుగాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X