Karthikeya 2 Advance booking నిఖిల్ మూవీకి పాజిటివ్ బజ్.. తొలి రోజు కలెక్షన్లు ఎంతంటే?
యువ హీరో నిఖిల్ సిద్దార్థ్, దర్శకుడు చందూ మొండేటి కాంబినేషన్‌లో వచ్చిన కార్తీకేయ చిత్రం ఊహించని విజయాన్ని అందుకొన్నది. 2014లో వచ్చిన కార్తీకేయ సినిమాకు సీక్వెల్‌గా రూపొందిన కార్తీకేయ 2 చిత్రం భారీ అంచనాల మధ్య ఆగస్టు 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. ఈ సినిమా టీజర్లు, ట్రైలర్లు, ప్రమోషన్ ఈవెంట్స్ సినిమాకు పాజిటివ్ బజ్‌ను తెచ్చిపెట్టాయి. అయితే ఈ సినిమా ఓపెనింగ్స్, అడ్వాన్సు బుకింగ్ పరిస్థితి ఎలా ఉందంటే..
Recommended Video


ద్వారకలో కృష్ణతత్వం
నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా రూపొందిన కార్తీకేయ 2 చిత్రం కృష్ణతత్వం కథా నేపథ్యంగా రూపొందింది. ద్వారక ప్రాంతంలో కృష్ణుడి అస్తిత్వం ఉందా లేదా అనే పాయింట్‌పై దర్శకుడు చందూ మొండేటి తాను చేసిన పరిశోధన ఆధారంగా కొత్తగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ అంశాలు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతుందని యూనిట్ చెబుతున్నారు.

హైదరాబాద్‌లో భారీగా
హైదరాబాద్‌లో కార్తీకేయ 2 సినిమాకు భారీ స్పందన లభిస్తున్నది. ఏఎంబీ సినిమాస్ 99 శాతం, ప్రసాద్ ఐమాక్స్‌లో 75 శాతానికిపైగా అక్యుపెన్సీ నమోదైంది. హైదరాబాద్ నగరంలో మొత్తంగా 229 షోలు ప్రదర్శించగా 45 శాతానికిపైగా ఆక్యుపెన్సీ కనిపించింది. తొలి రోజు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో 61 లక్షలు వసూలు చేసింది.

తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్ ఇలా..
ఇక తెలుగు రాష్ట్రాల్లో కార్తీకేయ సినిమాకు మంచి రెస్పాన్స్ లభిస్తున్నది. వైజాగ్‌లో 8.3 లక్షలు, కాకినాడ 2.7 లక్షలు, 2.25 లక్షలు, వరంగల్‌లో 2.12 లక్షలు, విజయవాడలో 5.46 లక్షలు, చెన్నైలో 2.68 లక్షలు, బెంగళూరులో 5.14 లక్షలు అడ్వాన్స్ బుకింగ్ నమోదు చేసింది.

అమెరికాలో మోస్తారుగా
అమెరికాలో కూడా కార్తీకేయ 2 చిత్రానికి మోస్తారు అడ్వాన్స్ బుకింగ్ నమోదైంది. 125 లోకేషన్లలో 256 షోల ద్వారా మొత్తం 36 వేల రూపాయలను నమోదు చేసింది. ప్రీమియర్ షోలు ప్రదర్శించే సమయానికి ఈ మొత్తం పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ వారం విడుదలైన లాల్ సింగ్ చద్దా, మాచర్ల నియోజకవర్గం సినిమాలు పెద్దగా టాక్‌ను సొంతం చేసుకోలేకపోవడం ఈ సినిమాకు పాజిటివ్‌గా మారిందనే విషయాన్ని ట్రేడ్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

తొలి రోజు అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్లు ఇలా
కార్తీకేయ 2 సినిమా ఓవరాల్ అడ్వాన్స్ బుకింగ్‌ను పరిశీలిస్తే.. దేశవ్యాప్తంగా ఈ సినిమాకు 33 వేల టికెట్లు అమ్ముడుపోయాయి. తొలి రోజు అడ్వాన్స్ బుకింగ్ విషయానికి వస్తే.. 1.02 కోట్ల మేరకు కలెక్షన్లు నమోదయ్యాయి. ఈ మొత్తం ఇంకా పెరిగే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











