Karthikeya 2 day 2 collections హిందీలో రికార్డుల పరంపర.. బాక్సాఫీస్ వద్ద అరాచకంగా కలెక్షన్లు
యువ హీరో నిఖిల్, దర్శకుడు చందూ మొండేటి కాంబినేషన్‌లో వచ్చిన కార్తీకేయ 2 చిత్రం బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్‌గా కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నది. మొదటి రోజు సాధించిన వసూళ్ల కంటే ఈ చిత్రం భారీగా కలెక్షన్లను రాబడుతున్నది. టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ చిత్రం రెండో రోజు కలెక్షన్ల అంచనా ఎలా ఉన్నాయంటే..

60 నుంచి 300 స్క్రీన్లకు పెంపు
దేశవ్యాప్తంగా కార్తీకేయ 2 సినిమాకు భారీగా స్పందన లభిస్తున్నది. ఉత్తరాదిలో హిందూ వెర్షన్‌ను మొదటి రోజు 60 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. అయితే పబ్లిక్ డిమాండ్ ఎక్కువగా ఉండటంతో రెండో రోజున మొత్తం 300 స్క్రీన్లకుపైగా పెంచారు. ఈ సినిమా ఆదివారం భారీగా వసూళ్లను సాధించే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

దేశంలోని ప్రధాన నగరాల్లో
కార్తీకేయ 2 సినిమాకు అన్ని ప్రాంతాల్లో భారీగా అక్యుపెన్సీ లభించింది. హైదరాబాద్‌లో 90 శాతం, బెంగళూరులో 50 శాతం, చెన్నైలో 70 శాతం, ఢిల్లీలో 50 శాతం, ముంబైలో 52 శాతం మేరకు అక్యుపెన్సీ నమోదైంది. తొలి రోజుతో పోల్చుకొంటే ఈ చిత్రం అక్యుపెన్సీ పరంగా మెరుగ్గా కనిపించింది.

తెలుగు రాష్ట్రాల్లో అక్యుపెన్సీ
ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. విజయవాడలో 83 శాతం, వరంగల్‌లో 60 శాతం, గుంటూరులో 87 శాతం, వైజాగ్‌లో 90 శాతం, నిజమాబాద్‌లో 73 శాతం, కరీంనగర్‌లో 84 శాతం, మహబూబ్ నగర్‌లో 56 శాతం, కాకినాడలో 90 శాతం అక్యుపెన్సీ కనిపించింది.

రెండో రోజున కలెక్షన్లు ఎలా అంటే..
ఏపీ, తెలంగాణలో కార్తీకేయ 2 చిత్రం 3.5 కోట్ల షేర్, 5.30 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 5.05 కోట్ల షేర్, 8.50 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇక ఇండియావైడ్ కలెక్షన్లు చూస్తే.. ఈ చిత్రం రెండో రోజున 6.5 నుంచి 7 కోట్ల షేర్, 9 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది.

కార్తీకేయ 2 ప్రాఫిట్‌లోకి రావాలంటే..
కార్తీకేయ 2 చిత్రం 12.8 కోట్ల మేర బిజినెస్ చేసింది. దాంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. కనీసం 13.3 కోట్ల వసూళ్లను సాధించాల్సి ఉంది. ఇప్పటికే ఈ చిత్రం తొలి రోజు 5 కోట్లు వసూలు చేసింది. ఒకవేళ ఈ సినిమా 6 కోట్లకుపైగా సాధిస్తే.. ఇంకా 3 కోట్లకుపైగా వసూలు చేస్తే. బ్రేక్ ఈవెన్ సాధించినట్టే అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. సోమవారం ఆగస్టు 15 సెలవు దినం కాబట్టి.. ఈ చిత్రం లాభాల్లోకి ప్రవేశించే అవకాశం ఎక్కువగా ఉన్నాయి.


Click it and Unblock the Notifications











