Karthikeya 2 day 2 collections.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం.. రెండు రోజుల్లోనే లాభాలకు చేరువగా కార్తీకేయ

యువ హీరో నిఖిల్ సిద్దార్థ్, డైరెక్టర్ చందూ మొండేటి కాంబినేషన్‌లో వచ్చిన కార్తీకేయ సీక్వెల్ కార్తీకేయ 2 చిత్రం భారీ అంచనాలకు తగినట్టే బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తున్నది. ఆగస్టు 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లను రాబడుతున్నది. ఈ సినిమా సాధించిన మూడో రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

అమెరికాలో భారీ కలెక్షన్లు

అమెరికాలో భారీ కలెక్షన్లు

కార్తీకేయ 2 చిత్రం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా హిందీ ప్రాంతం, అమెరికాలో భారీ వసూళ్లను నమోదు చేసింది. ఈ చిత్రం ఓవర్సీస్‌లో నిఖిల్ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఘనతను సాధించింది. ఈ చిత్రం గత రెండు రోజుల్లో 450K అమెరికన్ డాలర్లను వసూలు చేసింది. ఆగస్టు 15న ఈ చిత్రం హాఫ్ మిలియన్ డాలర్ క్లబ్‌లో చేరడం ఖాయంగా కనిపిస్తున్నది.

తెలుగు రాష్ట్రాల్లో 2వ రోజు

తెలుగు రాష్ట్రాల్లో 2వ రోజు

ఇక తెలుగు రాష్ట్రాల్లో కార్తీకేయ 2 చిత్రం రెండో రోజున సాధించిన కలెక్షన్లు ఇలా ఉన్నాయి. నైజాంలో 1.36 కోట్లు, సీడెడ్‌లో 69 లక్షలు, ఉత్తరాంధ్రలో 50 లక్షలు, ఈస్ట్ గోదావరి జిల్లాలో 29 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 25 లక్షలు, గుంటూరు జిల్లాలో 31 లక్షలు, కృష్ణా జిల్లాలో 30 లక్షలు, నెల్లూరు జిల్లాలో 11 లక్షలు సాధించింది. దాంతో ఈ చిత్రం 3.81 కోట్ల షేర్, 5.85 కోట్ల గ్రాస్ సాధించింది.

గత రెండు రోజుల్లో మొత్తం వసూళ్లు

గత రెండు రోజుల్లో మొత్తం వసూళ్లు

తెలుగు రాష్ట్రాల్లో కార్తీకేయ 2 చిత్రం తొలి రోజు కంటే రెండో రోజు అధికంగా వసూళ్లను సాధించింది. తొలి రోజు 3.5 కోట్ల షేర్ సాధిస్తే.. రెండో రోజు 3.81 కోట్ల వసూళ్లను నమోదు చేసింది. దాంతో ఈ చిత్రం రెండు రోజుల్లో 7.31 కోట్ల షేర్, 11.15 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

హిందీలో థియేటర్ల పెంపు.

హిందీలో థియేటర్ల పెంపు.

హిందీ మార్కెట్లో కార్తీకేయ 2 చిత్రానికి బ్రహ్మండమైన ఆదరణ లభిస్తున్నది. 53 షోలతో రిలీజైన ఈ చిత్రం మూడో రోజు నాటికి 300 థియేటర్లు, 570 కిపైగా షోలతో ప్రదర్శింపబడుతున్నది. తొలి రోజు 8 లక్షలు సాధించిన ఈ చిత్రం రెండో రోజున 34 లక్షలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం మొత్తంగా 42 లక్షలు షేర్ రాబట్టింది.

ప్రపంచవ్యాప్తంగా ఎంత వసూలు చేసిందంటే..

ప్రపంచవ్యాప్తంగా ఎంత వసూలు చేసిందంటే..

ఇక కార్తీకేయ 2 చిత్రం ఇతర రాష్ట్రాల కలెక్షన్ల విషయానికి వస్తే.. కర్ణాటక, మిగితా రాష్ట్రాల్లో 45 లక్షలు, ఓవర్సీస్‌లో 2.15 కోట్ల వసూళ్లను సాధించింది. దాంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 10 కోట్లకుపైగా షేర్, 17 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది.

బ్రేక్ ఈవెన్‌కు చేరువగా కార్తీకేయ 2

బ్రేక్ ఈవెన్‌కు చేరువగా కార్తీకేయ 2

కార్తీకేయ 2 చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. 12.8 కోట్ల మేర బిజినెస్ చేసింది. దాంతో ఈ సినిమా 13.3 కోట్ల బ్రేక్ ఈవెన్‌తో బాక్సాఫీస్ యాత్రను మొదలుపెట్టింది. గత రెండు రోజుల్లో ఈ చిత్రం 10 కోట్లు వసూలు చేసింది. ఇక మరో రోజులో 3 కోట్లు సాధిస్తే ఈ సినిమా లాభాల్లోకి ప్రవేశిస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X