Karthikeya 2 day 28 collections కార్తీకేయ 2 బాక్సాఫీస్ జైత్రయాత్ర.. ఎన్ని కోట్ల లాభమంటే?
హీరో నిఖిల్ సిద్దార్థ, దర్శకుడు చందు మొండేటి కాంబినేషన్‌లో యువ నిర్మాత అభిషేక్ అగర్వాల్ నిర్మించిన కార్తీకేయ 2 చిత్రం భారీ లాభాలతో కొనసాగుతున్నది. ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం 2022లో అతి పెద్ద విజయాలను అందుకొన్న చిత్రాల సరసన నిలిచింది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఉత్తరాదిలో కూడా భారీగా ప్రేక్షకులను ఆకట్టుకొంటూ వసూళ్ల వర్షాన్ని కురిపించింది. కార్తీకేయ 2 మూవీ 28వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

కార్తీకేయ 2 ప్రీ రిలీజ్ బిజినెస్
కార్తీకేయ 2 చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రీ రిలీజ్ వివరాల్లోకి వెళితే.. 12.80 కోట్ల బిజినెస్ చేసింది. దాంతో ఈ చిత్రం 13.5 కోట్ల బ్రేక్ ఈవెన్ లక్ష్యంతో బాక్సాఫీస్ యాత్రను ప్రారంభించింది. అయితే రిలీజ్ రోజు తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ రావడంతో కేవలం మూడు రోజుల్లోనే లాభాల్లోకి జారుకొన్నది.

తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు ఇలా
తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజున 3.5 కోట్ల వసూళ్లను సాధించింది. తొలి వారాంతానికి ఈ చిత్రం 15 కోట్లకుపైగా వసూళ్లను సంపాదించింది. దాంతో ఈ సినిమా లాభాల్లోనే కొనసాగింది.తాజాగా ఈ సినిమా 28వ రోజున 37 లక్షల షేర్ సాధించింది. దాంతో ఈ చిత్రం తెలుగు రాష్టాల్లో 30.22 కోట్ల షేర్, 50.65 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

నైజాం, ఆంధ్రాలో
ఇక 28 రోజుల్లో కార్తీకేయ 2 చిత్రం నైజాంలో 12 కోట్లు, సీడెడ్‌లో 4.6 కోట్లు, ఉత్తరాంధ్రలో 4.11 కోట్లు, తూర్పు గోదావరి జిల్లాలో 2.37 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో 1.52 కోట్లు, గుంటూరు జిల్లాలో 2.52 కోట్లు రాబట్టింది. ఇక కృష్ణా జిల్లాలో 2.04 కోట్లు, నెల్లూరులో 99 లక్షలు వసూళ్లను నమోదు చేసింది.

ప్రపంచవ్యాప్తంగా వసూళ్లు
కార్తీకేయ 2 చిత్రానికి సంబంధించి తెలుగేతర రాష్ట్రాల్లోని వసూళ్ల వివరాల్లోకి వెళితే.. కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో 2.65 కోట్లు, ఓవర్సీస్‌లో 5.64 కోట్లు, ఉత్తర భారతంలో 12.15 కోట్ల వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 50.66 కోట్ల షేర్, 101 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

28 రోజుల్లో ఎంత లాభామంటే?
కార్తీకేయ 2 చిత్రం 13.5 కోట్ల బ్రేక్ ఈవెన్‌తో వసూళ్లను రాబట్టింది. గత 28 రోజుల్లో ఈ చిత్రం 50.66 కోట్ల వసూళ్లను నమోదు చేసింది. దాంతో ఈ చిత్రం ఇప్పటి వరకు 38 కోట్ల లాభాలను సాధించింది. ఇటీవల కాలంలో ఓ చిన్న సినిమా ఈ రేంజ్‌లో లాభాలను సాధించడం ఇదే మొదటిసారి అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.


Click it and Unblock the Notifications











