twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Karthikeya 2 day 3 collections.. హిందీలో అరాచకంగా కలెక్షన్లు.. అమీర్, అక్షయ్‌ను మించి రికార్డు కలెక్షన్లు

    |

    కృష్ణతత్వం కథా నేపథ్యంతో రూపొందిన కార్తీకేయ 2 చిత్రం భారీ వసూళ్లను నమోదు చేస్తున్నది. హిందూ సంస్కృతి, ఆచారాల ఆధారంగా అభిషేక్ అగర్వాల్, టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన చిత్రానికి చందూ మొండెటి దర్శకత్వం వహించారు. నిఖిల్, అనుపమ పరమేశ్వరన్, అనుపమ్ ఖేర్ తదితరలు నటించారు. ఈ చిత్రానికి దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణ రోజు రోజుకు పెరుగుతున్నది. ఈ సినిమాకు సంబంధించిన మూడో రోజు కలెక్షన్లు ఎలా ఉన్నాయంటే?

    దేశంలోని ప్రధాన నగరాల్లో

    దేశంలోని ప్రధాన నగరాల్లో

    కార్తీకేయ 2 చిత్రానికి మూడో రోజు కూడా భారీగా ఆక్యుపెన్సీ కనిపించింది. దేశంలోని ప్రధాన నగరాలైన బెంగళూరులో 50 శాతం, చెన్నైలో 53 శాతం, ఢిల్లీలో 40 శాతం, ముంబైలో 42 శాతం అక్యుపెన్సీ లభించింది. గత రెండు రోజులతోపాటు మూడో రోజు కూడా బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్‌గా కలెక్షన్లను రాబట్టింది.

    హిందీలో భారీగా రెస్సాన్స్

    హిందీలో భారీగా రెస్సాన్స్

    అయితే కార్తీకేయ 2 సినిమాకు ఉత్తరాదిలో హిందీ వెర్షన్‌కు భారీ స్పందన కనిపిస్తున్నది. పబ్లిక్ డిమాండ్ మేరకు భారీగా షోల సంఖ్యను పెంచుతున్నారు. శనివారం 50 షోలతో ప్రారంభమైన ఈ చిత్రం.. ఆదివారం 150 షోలు, సోమవారం 500 పైగా షోలు, మంగళవారం 1000కి పైగా షోలను పెంచారు. దేశవ్యాప్తంగా 72 శాతం అక్యుపెన్సీ నమోదైంది.

    లాల్ సింగ్ చడ్డా, రక్షాబంధన్ కంటే

    లాల్ సింగ్ చడ్డా, రక్షాబంధన్ కంటే

    కార్తీకేయకు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా హిందీలో ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వస్తున్నది. ఇటీవల విడుదలైన బాలీవుడ్ సూపర్ స్టార్స్ అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్ నటించిన చిత్రాలు లాల్ సింగ్ చడ్డా, రక్షాబంధన్ చిత్రాల కంటే ఎక్కువ కలెక్షన్లు రాబట్టడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది.

    మూడు రోజుల్లో కార్తీకేయ కలెక్షన్లు

    మూడు రోజుల్లో కార్తీకేయ కలెక్షన్లు

    ఇక తెలుగు రాష్ట్రాల్లో కార్తీకేయ 2 చిత్రం మూడో రోజు కలెక్షన్ల విషయానికి వస్తే.. నైజాంలో 1.46 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. సీడెడ్‌లో 74 లక్షలు, ఉత్తరాంధ్రలో 56 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో 37 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 28 లక్షలు, గుంటూరు జిల్లాలో 39 లక్షలు, కృష్ణా జిల్లాలో 30 లక్షలు, నెల్లూరు జిల్లాలో 13 లక్షలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 4.23 లక్షల షేర్, 6.60 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

    నైజాం, ఆంధ్రాలో

    నైజాం, ఆంధ్రాలో

    కార్తీకేయ 2 చిత్రం మూడు రోజుల కలెక్షన్ల విషయానికి వస్తే.. నైజాంలో 4 కోట్లు, ఆంధ్రాలో 7 కోట్లుకుపైగా షేర్ సాధించింది. ఈ చిత్రం తొలి రోజున 3.5 కోట్లు, రెండో రోజున 3.81 కోట్లు మూడో రోజున 4.23 కోట్లు వసూలు చేసింది. రోజు రోజుకు కలెక్షన్లను పెంచుకొంటూ పోవడంతో ట్రేడ్ వర్గాల్లో జోష్ కనిపించింది.

    ప్రపంచవ్యాప్తంగా వసూళ్లు

    ప్రపంచవ్యాప్తంగా వసూళ్లు


    కార్తీకేయ 2 చిత్రం తెలుగేతర రాష్ట్రాల్లో కూడా భారీ వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో 70 లక్షలు, ఓవర్సీస్‌లో 2.6 కోట్లు వసూలు చేసింది. కార్తీకేయ 2 చిత్రం తొలి రోజున హిందీ మార్కెట్‌లో పెద్దగా వసూళ్లు రాబట్టలేకపోయింది. మొదటి రోజున కేవలం 8 లక్షలు వసూలు చేసిన ఈ చిత్రం రెండో రోజున 34 లక్షలు, మూడో రోజున ఈ చిత్రం కోటి రూపాయలు షేర్‌ను రాబట్టింది. దీంతో మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా 15.44 కోట్ల షేర్, 26.5 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

    మూడు రోజుల్లో ఎంత లాభం అంటే..

    మూడు రోజుల్లో ఎంత లాభం అంటే..


    కార్తీకేయ 2 చిత్రం మూడు రోజుల్లోనే భారీ లాభాల్లోకి ప్రవేశించింది. 13 కోట్లకుపైగా బ్రేక్ ఈవెన్ లక్ష్యంతో బాక్సాఫీస్ రన్ మొదలుపెట్టిన ఈ చిత్రం ఇప్పటికే 2 కోట్లుపైగా లాభాలను సాధించింది. టాలీవుడ్‌లో క్లీన్ హిట్‌గా నిలిచిన చిత్రంగా ఓ ఘనతను సొంతం చేసుకొన్నది.

    English summary
    Karthikeya 2 is set to release on August 13th. This movie started on positive note at box office. Here is day 3 expected collections.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X