Karthikeya 2 day 4 collections ఉత్తరాదిలో కార్తీకేయ 2 ప్రభంజనం.. ది కశ్మీర్ ఫైల్స్ మాదిరిగా సంచలనం

హిందూ సంస్కృతి ఆధారంగా తెరకెక్కిన కార్తీకేయ 2 చిత్రం దేశవ్యాప్తంగా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతున్నది. తెలుగు, హిందీ భాషల్లో రిలీజైన ఈ చిత్రానికి ప్రేక్షకులు ప్రతీ చోట బ్రహ్మరథం పడుతున్నారు. ఈ చిత్రం కేవలం మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల జోన్‌లోకి ప్రవేశించడం ఓ రికార్డుగా ట్రేడ్ వర్గాలు చెప్పుకొంటున్నాయి. అయితే ఉత్తరాదిలో కార్తీకేయ 2 ప్రభంజనం సృష్టిస్తున్నది. ఈ సినిమా 4 రోజుల కలెక్షన్ల అంచనా ఎలా ఉందంటే..

50 షోలతో ప్రారంభమై 1500 షోల వరకు

50 షోలతో ప్రారంభమై 1500 షోల వరకు


కార్తికేయ 2 చిత్రానికి ఉత్తరాదిలో అంచనాలకు మించిన స్పందనను సొంతం చేసుకొంటున్నది. తొలి రోజున కేవలం 50 షోలతో ప్రారంభమైన ఈ చిత్రం 5వ రోజుకు భారీగా థియేటర్ల సంఖ్యను, షో సంఖ్యను పెంచుకొన్నది. ఐదో రోజు నాటికి ఈ సినిమా 1500 లకుపైగా షోలతో రికార్డు వసూళ్లను సాధించేందుకు పరుగులు పెడుతున్నది.

ది కశ్మీర్ ఫైల్స్ రేపిన సంచలనం మాదిరిగానే

ది కశ్మీర్ ఫైల్స్ రేపిన సంచలనం మాదిరిగానే

కార్తీకేయ చిత్రం ఉత్తర భారతంలో సంచలనం రేపుతున్నది. కృష్ణతత్వం, కృష్ణుడి అస్తిత్వంతో రూపొందిన చిత్రానికి ఊహించని ప్రజాదరణ దక్కింది. కార్తీకేయ 2 నిర్మాత అభిషేక్ అగర్వాల్ గతంలో ది కాశ్మీరీ ఫైల్స్ చిత్రంతో బాలీవుడ్‌ను కుదిపేశాడు. అదే రీతిలో కార్తీకేయ 2 చిత్రాన్ని మరో సెన్సేషనల్ హిట్‌గా మలిచారనే అభిప్రాయం ట్రేడ్ వర్గాల్లో వ్యక్తమవుతున్నది.

అమెరికాలో రికార్డుస్థాయి వసూళ్లు

అమెరికాలో రికార్డుస్థాయి వసూళ్లు


ఇదిలా ఉండగా, అమెరికాలో కార్తీకేయ 2 చిత్రం భారీగా వసూళ్లను సాధించింది. కార్తీకేయ గత మూడు రోజుల్లో హాఫ్ మిలియన్ డాలర్లను సాధించింది. ఈ చిత్రం 500k అమెరికా డాలర్లకుపైగా వసూళ్లను సాధించింది. నాలుగో రోజు కూడా భారీగానే వసూళ్లు కనిపించాయి.

నాలుగో రోజున దేశవ్యాప్తంగా అక్యుపెన్సీ

నాలుగో రోజున దేశవ్యాప్తంగా అక్యుపెన్సీ


కార్తీకేయ చిత్రం గత మూడు రోజులుగా భారీ వసూళ్లను సాధిస్తున్నది. అయితే 4 రోజు వర్కింగ్ డే కావడంతో తెలుగు రాష్ట్రాల్లోనే దేశంలోని ప్రధాన నగరాల్లో అక్యుపెన్సీ రేటు కాస్త తగ్గుముఖం పట్టింది. హైదరాబాద్‌లో 36 శాతం, బెంగళూరు 15 శాతం, చెన్నైలో 25 శాతం, విజయవాడలో 22 శాతం, వరంగల్‌లో 45 శాతం, వైజాగ్‌లో 44 శాతం, నిజమాబాద్‌లో 62 శాతం, ఢిల్లీలో 13 శాతం, ముంబైలో 18 శాతం, కరీంనగర్‌లో 36 శాతం, కాకినాడలో 57 శాతం అక్యుపెన్సీ కనిపించింది.

ఇండియావైడ్ కార్తీకేయ2 కలెక్షన్లు

ఇండియావైడ్ కార్తీకేయ2 కలెక్షన్లు


ఇక కార్తీకేయ 2 చిత్రం తొలి రోజున ఇండియావైడ్‌గా తొలి రోజు 5 కోట్లకుపైగా షేర్, (హిందీలో 7 లక్షలు కలిపి) రాబట్టింది. ఇక రెండో రోజు 5.79 కోట్ల షేర్, (హిందీలో 28 లక్షల షేర్ కలిపి), మూడో రోజు 7.29 కోట్ల షేర్, (హిందీలో 1.8 కోట్ల షేర్ కలిపి) కలెక్షన్లు రాబట్టింది.

4వ రోజున కార్తీకేయ 2 కలెక్షన్లు ఇలా..

4వ రోజున కార్తీకేయ 2 కలెక్షన్లు ఇలా..


ఇక కార్తీకేయ 2 చిత్రం నాలుగో రోజున కూడా భారీగానే వసూళ్లను నమోదు చేసినట్టు ట్రేడ్ వర్గాల సమాచారం. వర్కింగ్ డే మంగళవారం రోజున రూ.3.5 కోట్ల షేర్ ఇండియావైడ్‌గా నమోదు చేస్తుందనే అంచనాను ట్రేడ్ వర్గాలు వేశాయి. ఓవర్సస్‌లో కలుపుకొని 4 కోట్లకుపైగా షేర్ సాధించే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X