Karthikeya 2 day 5 collections బాలీవుడ్‌లో సంచలనం.. కార్తీకేయ 2 మూవీ 5 రోజు కలెక్షన్లు ఎంతంటే?
యువ దర్శకుడు చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందిన కార్తీకేయ చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల మ్యాజిక్ క్రియేట్ చేస్తున్నది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఈ చిత్రం వసూళ్ల ప్రభంజనాన్ని కురిపిస్తున్నది. సంచలన నిర్మాత అభిషేక్ అగర్వాల, టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మాణ సారథ్యంలో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన ఈ సినిమాకు సంబంధించిన 5వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

అమీర్, అక్షయ్ సినిమాలు ఫ్లాప్ కావడంతో
బాలీవుడ్‌లో స్టార్ హీరోలు అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్ నటించిన లాల్ సింగ్ చద్దా, రక్షాబంధన్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా పడ్డాయి. కేవలం 50 స్కీన్లలో రిలీజైన ఈ చిత్రానికి భారీగా రెస్పాన్స్ లభించడంతో లాల్ సింగ్ చడ్డా, రక్షాబంధన్ సినిమాలను ఎత్తివేసి కార్తీకేయ 2 చిత్రాన్ని ప్రదర్శించడం బాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. ఈ సినిమాను హిందీ మార్కెట్‌లో 1000కి పైగా స్క్రీన్లలో ప్రదర్శించడం ఓ రికార్డుగా మారింది.

హిందీ వెర్షన్‌కు కలెక్షన్ల వెల్లువ
ఆగస్టు 13వ తేదీన రిలీజైన కార్తీకేయ చిత్రం హిందీ వెర్షన్ శనివారం రోజున 7 లక్షలు, ఆదివారం 28 లక్షలు, సోమవారం 1.10 లక్షలు, మంగళవారం 1.28 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమాకు లాంగ్ వీకెండ్ కలిసివచ్చింది. నాలుగు రోజులపాటు హాలీడేస్ రావడంతో కలెక్షన్లు కూడా భారీగా నమోదయ్యాయి. వసూళ్ల పరంగా ఈ సినిమా తొలి రోజుతో పోల్చితే 300 శాతం వృద్ధి కనిపించింది.

అడ్వాన్స్ బుకింగ్ జోష్
ప్రస్తుతం కార్తీకేయ 2 చిత్రం ఇండియా స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నది. 6వ రోజున కూడా ఈ సినిమా భారీగా అడ్వాన్స్ బుకింగ్ నమోదు చేసింది. ఈ సినిమా 1900 థియేటర్లలో ప్రదర్శిస్తూ... 44 లక్షల రూపాయలను అడ్వాన్స్ బుకింగ్ రూపంలో రాబట్టింది. ఐదో రోజు కంటే ఈ చిత్రం 6వ రోజున భారీగా రెస్పాన్స్ కూడ గట్టుకొన్నది.

5వ రోజు అక్యుపెన్సీ ఇలా..
కార్తీకేయ చిత్రం 4వ రోజుతో పోల్చితే 5వ రోజు ఆక్యుపెన్సీ భారీగా తగ్గింది. హైదరాబాద్‌లో 29.5 శాతం, ముంబైలో 11.33 శాతం, ఢిల్లీలో 12 శాతం, కోల్‌కత్తాలో 10 శాతం, కాన్పూర్‌లో 17 శాతం, మిగితా ప్రదేశాల్లో 10 శాతం కంటే తక్కువగా ఆక్యుపెన్సీ నమోదైంది.

దేశవ్యాప్తంగా కార్తీకేయ కలెక్షన్లు
ఇక దేశవ్యాప్తంగా కార్తీకేయ చిత్రం తొలి రోజు 5 కోట్లకుపైగా షేర్, రెండో రోజు 6 కోట్ల షేర్; మూడో రోజు 7.5 కోట్ల షేర్, 4వ రోజున 4 కోట్ల షేర్ సాధించింది. ఇక 5వ రోజున ఈ చిత్రం దేశవ్యాప్తంగా 3 కోట్లకుపైగా షేర్ సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ చిత్రం ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 25 కోట్ల షేర్ సాధించడం విశేషంగా మారింది.


Click it and Unblock the Notifications











