Bedurulanka 2012 5 Days Collections: కార్తికేయ హిట్ రికార్డు.. 17వ మూవీగా.. ఏకంగా అన్ని లక్షలు లాభం

ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న టాలెంటెడ్ హీరోల్లో కార్తికేయ గుమ్మకొండ ఒకడు. మొదటి చిత్రంతోనే టాలీవుడ్‌లో సెన్సేషన్ అయిన అతడు.. ఆ తర్వాత వరుసగా చాలా మూవీలు చేశాడు. కానీ, హిట్లు మాత్రం పెద్దగా అందుకోలేకపోయాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే ఈ యంగ్ హీరో 'బెదురులంక 2012' అనే సినిమాను చేశాడు. క్రేజీ కాన్సెప్టుతో వచ్చిన ఈ చిత్రానికి మంచి స్పందన దక్కింది. ఫలితంగా దీనికి వసూళ్లు పోటెత్తాయి. తద్వారా ఈ చిత్రం క్లీన్ హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో 'బెదురులంక 2012' రిపోర్టును చూద్దాం పదండి!

యుగాంతం కాన్సెప్టుతో వచ్చింది:కార్తికేయ గుమ్మకొండ నటించిన యుగాంతం కాన్సెప్టు మూవీనే 'బెదురులంక 2012'. కొత్త దర్శకుడు క్లాక్స్ తెరకెక్కించిన ఈ సినిమాను లౌక్యా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ముప్పనేని రవీంద్ర బెనర్జీ నిర్మించారు. ఇందులో నేహా శెట్టి హీరోయిన్‌గా, అజయ్ ఘోష్, శ్రీకాంత్ అయ్యంగార్, సత్య తదితరులు కీలక పాత్రలు చేశారు. ఈ సినిమాకు మణిశర్మ సంగీతాన్ని అందించాడు.

Kartikeya Gummakonda Starrer Bedurulanka 2012 Movie 5 Days Collections

బెదురులంక బిజినెస్ డీటేల్స్:ఫన్ అండ్ థ్రిల్లర్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'బెదురులంక 2012' మూవీకి నైజాంలో రూ. 85 లక్షలు, సీడెడ్‌లో రూ. 65 లక్షలు, ఆంధ్రా మొత్తంలో రూ. 1.75 కోట్లు బిజినెస్ చేసింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రూ. 4.10 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసుకుంది. రెస్టాఫ్ ఇండియా, కర్నాటక, ఓవర్సీస్ ఏరియాల్లో కలిపి రూ. 85 లక్షలతో ఇది రూ. 4.10 కోట్లు బిజినెస్‌ జరిగింది.

5వ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఇలా:'బెదురులంక 2012'కి ఏపీ, తెలంగాణలో 5వ రోజూ హోల్ట్ చేసింది. ఫలితంగా నైజాంలో రూ. 34 లక్షలు గ్రాస్, సీడెడ్‌లో రూ. 19 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 15 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 9 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 6 లక్షలు, గుంటూరులో రూ. 10 లక్షలు, కృష్ణాలో రూ. 9 లక్షలు, నెల్లూరులో రూ. 5 లక్షలతో కలిపి.. రూ. 1.07 కోట్లు గ్రాస్, రూ. 62 లక్షలు షేర్ వసూలు అయింది.

Kartikeya Gummakonda Starrer Bedurulanka 2012 Movie 5 Days Collections

5వ రోజులకు కలిపి ఎంతంటే:'బెదురులంక 2012'కి తెలుగులో 5 రోజుల్లో మంచి స్పందనే వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 2.33 కోట్లు గ్రాస్, సీడెడ్‌లో రూ. 1.12 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 98 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 69 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 37 లక్షలు, గుంటూరులో రూ. 65 లక్షలు, కృష్ణాలో రూ. 56 లక్షలు, నెల్లూరులో రూ. 32 లక్షలతో కలిపి.. రూ. 7.02 కోట్లు గ్రాస్, రూ. 4.21 కోట్లు షేర్ వచ్చింది.

Kartikeya Gummakonda Starrer Bedurulanka 2012 Movie 5 Days Collections

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే:ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 5 రోజుల్లో రూ. 7.02 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసుకున్న 'బెదురులంక 2012' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ బాగానే రాణించిందని చెప్పాలి. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లో ఈ సినిమా రూ. 1.82 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. వీటితో కలిపితే 5 రోజుల్లో దీనికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 8.88 కోట్లు గ్రాస్, రూ. 5.12 కోట్లు షేర్ వచ్చింది.

Kartikeya Gummakonda Starrer Bedurulanka 2012 Movie 5 Days Collections

టార్గెట్ ఇలా.. లాభం ఎంత?:క్రేజీ కాన్సెప్టుతో వచ్చిన 'బెదురులంక 2012' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 4.10 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 4.50 కోట్లుగా నమోదైంది. ఇక, 5 రోజుల్లో దీనికి రూ. 5.12 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 62 లక్షలు లాభాలను కూడా ఇది సొంతం చేసుకుంది.

Kartikeya Gummakonda Starrer Bedurulanka 2012 Movie 5 Days Collections

17వ సినిమాగా రికార్డు కొట్టేసి:కార్తికేయ గుమ్మకొండకు ఆరంభంలోనే మంచి హిట్ వచ్చింది. కానీ, ఆ తర్వాత నటించిన చాలా చిత్రాలు నిరాశనే మిగిల్చాయి. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు వచ్చిన 'బెదురులంక 2012' మాత్రం టార్గెట్‌ను చేరుకుని హిట్‌గా నిలిచింది. దీంతో ఈ ఏడాది వచ్చిన చిత్రాల్లో 17వ హిట్ మూవీగా ఇది రికార్డు సాధించింది. అలాగే, ఐదేళ్ల తర్వాత కార్తికేయకూ విజయాన్ని అందించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X