Bedurulanka 2012 6 Days Collections: 6 రోజులకే అన్ని కోట్లు.. కార్తికేయ సినిమాకు అన్ని కోట్ల లాభమా!
టాలీవుడ్‌లో టాలెంట్ ఉన్న హీరోలు చాలా మందే ఉన్నా.. అందులో కొందరు మాత్రం హిట్లను సరిగా అందుకోవడం లేదు. అలాంటి వారిలో కార్తికేయ గుమ్మకొండ ఒకడు. హీరోగా గ్రాండ్ ఎంట్రీని సొంతం చేసుకున్న అతడు.. ఆ తర్వాత మాత్రం కాస్త ఇబ్బందులు పడ్డాడు.
దీంతో ఈ సారి ఎలాగైనా సక్సెస్ సాధించాలన్న పట్టుదలతో 'బెదురులంక 2012' అనే సినిమాను చేశాడు. క్రేజీ కాన్సెప్టుతో వచ్చిన ఈ మూవీకి భారీ రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా దీనికి వసూళ్లు భారీగానే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో 'బెదురులంక 2012' రిపోర్టును మీరే చూసేయండి!

బెదురులంకలోకి హీరో కార్తికేయ: కార్తికేయ గుమ్మకొండ నటించిన తాజా సినిమానే 'బెదురులంక 2012'. కొత్త దర్శకుడు క్లాక్స్ తెరకెక్కించిన ఈ సినిమాను లౌక్యా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ముప్పనేని రవీంద్ర బెనర్జీ నిర్మించారు. ఇందులో నేహా శెట్టి హీరోయిన్‌గా, అజయ్ ఘోష్, శ్రీకాంత్ అయ్యంగార్, సత్య తదితరులు కీలక పాత్రలు చేశారు. ఈ సినిమాకు మణిశర్మ సంగీతాన్ని సమకూర్చారు.

బెదురులంక బిజినెస్ డీటేల్స్: కామెడీ అండ్ థ్రిల్లర్ జోనర్‌లో రూపొందిన 'బెదురులంక 2012' మూవీకి నైజాంలో రూ. 85 లక్షలు, సీడెడ్‌లో రూ. 65 లక్షలు, ఆంధ్రా మొత్తంలో రూ. 1.75 కోట్లు బిజినెస్ చేసింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రూ. 3.25 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసుకుంది. రెస్టాఫ్ ఇండియా, కర్నాటక, ఓవర్సీస్ ఏరియాల్లో కలిపి రూ. 85 లక్షలతో ఇది రూ. 4.10 కోట్లు బిజినెస్ అయింది.

6వ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఇలా: 'బెదురులంక 2012'కి ఏపీ, తెలంగాణలో 6వ రోజూ బాగానే రాణించింది. ఫలితంగా నైజాంలో రూ. 30 లక్షలు గ్రాస్, సీడెడ్‌లో రూ. 16 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 12 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 7 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 4 లక్షలు, గుంటూరులో రూ. 8 లక్షలు, కృష్ణాలో రూ. 7 లక్షలు, నెల్లూరులో రూ. 4 లక్షలతో కలిపి.. రూ. 88 లక్షలు గ్రాస్, రూ. 54 లక్షలు షేర్ వసూలు అయింది.

6వ రోజులకు కలిపి ఎంతంటే: 6 రోజుల్లో 'బెదురులంక 2012'కి తెలుగులో మంచి స్పందనే వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 2.63 కోట్లు గ్రాస్, సీడెడ్‌లో రూ. 1.28 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.10 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 76 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 41 లక్షలు, గుంటూరులో రూ. 73 లక్షలు, కృష్ణాలో రూ. 63 లక్షలు, నెల్లూరులో రూ. 36 లక్షలతో కలిపి.. రూ. 7.90 కోట్లు గ్రాస్, రూ. 4.75 కోట్లు షేర్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 6 రోజుల్లో రూ. 7.90 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసుకున్న 'బెదురులంక 2012' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ బాగానే రాణించిందని చెప్పాలి. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లో ఈ సినిమా రూ. 1.98 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. వీటితో కలిపితే 6 రోజుల్లో దీనికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 9.88 కోట్లు గ్రాస్, రూ. 5.72 కోట్లు షేర్ వచ్చింది.

టార్గెట్ ఇలా.. లాభం ఎంత?: యుగాంతం కాన్సెప్టుతో వచ్చిన 'బెదురులంక 2012' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 4.10 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 4.50 కోట్లుగా నమోదైంది. ఇక, 6 రోజుల్లో దీనికి రూ. 5.72 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 1.22 కోట్లు లాభాలను కూడా ఇది సొంతం చేసుకుంది.


Click it and Unblock the Notifications











