Bedurulanka 2012 Business: కార్తికేయ మూవీకి షాకింగ్ బిజినెస్.. అన్ని కోట్లు వస్తేనే సినిమా హిట్!

హీరోకు ఉండాల్సిన అన్ని లక్షణాలు ఉన్నా.. టాలీవుడ్‌లోని కొందరు యంగ్ బాయ్స్ మాత్రం సరైన సక్సెస్‌లను సొంతం చేసుకోలేకపోతున్నారు. తద్వారా కెరీర్‌లను ఆశించిన రీతిలో సాగించడం లేదు. అలాంటి వారిలో కార్తికేయ గుమ్మకొండ ఒకరు. ఫస్ట్ మూవీతోనే సెన్సేషన్ అయిన అతడు.. ఆ తర్వాత చాలా చిత్రాలతో ప్రేక్షకులను పలకరించాడు. కానీ, హిట్‌ను మాత్రం సొంతం చేసుకోలేకపోయాడు. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు 'బెదురులంక 2012' మూవీ చేశాడు. ఇది శుక్రవారం రాబోతున్న నేపథ్యంలో దీని ప్రీ రిలీజ్ బిజినెస్‌పై ఓ లుక్కేద్దాం పదండి!

బెదురులంకలో కార్తికేయ:యంగ్ హీరో కార్తికేయ గుమ్మకొండ నటించిన తాజా చిత్రమే 'బెదురులంక 2012'. కొత్త దర్శకుడు క్లాక్స్ తెరకెక్కించిన ఈ సినిమాను లౌక్యా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ముప్పనేని రవీంద్ర బెనర్జీ నిర్మించారు. ఇందులో నేహా శెట్టి హీరోయిన్‌గా, అజయ్ ఘోష్, శ్రీకాంత్ అయ్యంగార్, సత్య తదితరులు కీలక పాత్రలు చేశారు. ఈ సినిమాకు మణిశర్మ మ్యూజిక్‌ను ఇచ్చారు.

Kartikeya Gummakonda Starrer Bedurulanka 2012 Movie Pre Release Business Details

అలాంటి స్టోరీతో ఫన్నీగా:బెదురులంక అనే గ్రామంలో 2012లో జరిగిన ఓ కల్పిత కథతో 'బెదురులంక 2012' సినిమా రూపొందింది. సరదాగా సాగిపోతోన్న ఆ ఊరిలో యుగాంతం భయం ఎందుకు వచ్చింది? దాన్ని ఆపేందుకు మత పెద్దలు ఎలాంటి ప్రయత్నాలు చేశారు? అసలు ఈ సమస్యలను హీరో ఎలా అధిగమించాడు? అనే అంశాలతో ఈ సినిమా కామెడీగా సాగిపోయేలా తెరకెక్కించారు.

Kartikeya Gummakonda Starrer Bedurulanka 2012 Movie Pre Release Business Details

ప్రమోషన్ పూర్తి.. సందడి:ఎలాగైనా ఈ సారి విజయాన్ని సొంతం చేసుకోవాలని కార్తికేయ నటించిన 'బెదురులంక 2012' మూవీ విడుదలకు సమయం దగ్గర పడడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను పూర్తి చేసింది. ఇప్పటికే చాలా ఈవెంట్లు కూడా చేసింది. అలాగే, ఇప్పటికే కొన్ని ఇంటర్వ్యూలు చేసుకున్నారు. ఇక, శుక్రవారమే దీన్ని ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నారు.

Kartikeya Gummakonda Starrer Bedurulanka 2012 Movie Pre Release Business Details

బెదురులంక ప్రీ బిజినెస్:కామెడీగా సాగే స్టోరీతో రాబోయే 'బెదురులంక 2012' మూవీపై కార్తికేయ అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఫోకస్ చేస్తున్నారు. అయినా దీనికి డిమాండ్ పెద్దగా రాలేదు. దీంతో ఇది నైజాంలో రూ. 85 లక్షలు, సీడెడ్‌లో రూ. 65 లక్షలు, ఆంధ్రా మొత్తంలో రూ. 1.75 కోట్లు బిజినెస్ చేసింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రూ. 4.10 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసుకుంది.

Kartikeya Gummakonda Starrer Bedurulanka 2012 Movie Pre Release Business Details

వరల్డ్ వైడ్‌గా ఎంతంటే:క్లాక్స్ దర్శకత్వంలో కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటించిన 'బెదురులంక 2012' మూవీపై అందరిలో ఆసక్తి ఉంది. కానీ, మార్కెట్ పరంగా ఇది బయ్యర్ల దృష్టిని అంతగా రాబట్టలేకపోయింది. ఫలితంగా రెస్టాఫ్ ఇండియా, కర్నాటక, ఓవర్సీస్ ఏరియాల్లో కలిపి రూ. 85 లక్షలు మాత్రమే అమ్ముడైంది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 4.10 కోట్లు బిజినెస్‌ను మాత్రమే చేసింది.

Kartikeya Gummakonda Starrer Bedurulanka 2012 Movie Pre Release Business Details

అన్ని కోట్లు వస్తేనే హిట్:కార్తికేయ నటించిన 'బెదురులంక 2012' సినిమాకు ఊహించని విధంగా రూ. 4.10 కోట్లు బిజినెస్ జరిగింది. దీంతో ఈ సినిమాకు రూ. 4.50 కోట్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్ నమోదైంది. అంటే.. ఇంత మొత్తం వసూలు చేస్తేనే 'బెదురులంక 2012' సినిమా కమర్షియల్‌గా విజయం సాధిస్తుంది. మంచి టాక్ వస్తే.. ఈ కలెక్షన్లు సాధించే అవకాశం ఉంటుందని చెప్పొకోవచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X