Bhaje Vaayu Vegam 2 Days Collections: కార్తికేయ మూవీకి ఊహించని వసూళ్లు.. ఫస్ట్ డే కంటే దిమ్మతిరిగేలా!
టాలీవుడ్‌లో అతి తక్కువ మంది యంగ్ హీరోలు మాత్రమే తమదైన చిత్రాలతో సినిమాలు చేస్తూ విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నారు. అలాంటి వారిలో కార్తికేయ గుమ్మకొండ ఒకడు. డిఫరెంట్ మూవీలతో ప్రయోగాలు చేస్తోన్న అతడు.. అప్పుడప్పుడూ హిట్లను అందుకుంటున్నాడు. ఈ సారి భారీ విజయాన్ని సొంతం చేసుకోవాలన్న లక్ష్యంతో 'భజే వాయు వేగం' అనే సినిమా చేశాడు. మంచి హైప్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు డీసెంట్ టాక్ రావడంతో రెస్పాన్స్ వస్తోంది. మరి 'భజే వాయు వేగం' మూవీ 2 రోజుల వసూళ్లను మీరే చూడండి!
భజే వాయు వేగంతో కార్తికేయ
కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటించిన లేటెస్ట్ యాక్షన్ మూవీనే 'భజే వాయు వేగం'. ప్రశాంత్ రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమాను యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్‌పై యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించింది. ఇందులో ఐశ్వర్య మీనన్ హీరోయిన్‌గా నటించగా.. రవిశంకర్, కృష్ణ చైతన్య, తణికెళ్ల భరణి, రాహుల్ టైసన్ తదితరులు నటించారు. కపిల్ కుమార్ సంగీతాన్ని అందించారు.

కార్తికేయ ప్రీ బిజినెస్ ఎంత
హీరోగా పరిచయం అయినప్పటి నుంచి వరుసగా సినిమాలు చేస్తూ.. ఇప్పుడు ఎలాగైనా భారీ విజయాన్ని సొంతం చేసుకోవాలన్న లక్ష్యంతో కార్తికేయ గుమ్మకొండ నటించిన 'భజే వాయు వేగం' సినిమాపై అంచనాలను భారీగా ఏర్పడ్డాయి. తద్వారా మంచి డిమాండ్‌ను పెంచుకుని ఈ మూవీ వరల్డ్ వైడ్‌గా రూ. 3.60 కోట్లు వరకూ థియేట్రికల్ బిజినెస్ జరుపుకుంది.
2వ రోజు ఎంత వచ్చింది?
కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటించిన 'భజే వాయు వేగం' మూవీకి టాక్ మంచిగా వచ్చినా రెస్పాన్స్‌ను ఆశించిన రీతిలో అందుకోలేదు. కానీ, రెండో రోజు మాత్రం ఈ చిత్రం భారీగా పుంజుకుంది. ఫలితంగా ఈ సినిమాకు శనివారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రూ. 50 లక్షలు షేర్ వసూలు అయింది. అలాగే, రూ.95 లక్షలు గ్రాస్‌ను ఇది రాబట్టుకుంది.

2 రోజులకు కలిపి ఎంత?
ప్రశాంత్ రెడ్డి దర్శకత్వంలో కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటించిన 'భజే వాయు వేగం' సినిమాకు మిగిలిన వాటి నుంచి పోటీ ఉన్నప్పటికీ బాగానే రాణించింది. దీంతో నైజాంలో ఇది రూ. 60 లక్షలు షేర్ వసూలు చేసింది. అలాగే, ఆంధ్రప్రదేశ్‌లో రూ. 70 లక్షలు వసూలు చేసింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజులకూ కలిపి రూ. 1.30 కోట్లు షేర్, రూ. 2.75 కోట్లు గ్రాస్ వచ్చింది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంత?
టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ గుమ్మకొండ ప్రధాన పాత్రలో నటించిన 'భజే వాయు వేగం' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో 2 రోజుల్లో రూ. 1.30 కోటలు షేర్ వచ్చింది. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లో కలిపి రూ. 25 లక్షలు వసూలు చేసింది. వీటితో కలిపి రెండు రోజుల్లో ఈ చిత్రానికి రూ. 1.55 కోట్లు షేర్‌తో పాటు రూ. 3.25 కోట్లు గ్రాస్ వచ్చింది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?
క్రేజీ సబ్జెక్టుతో తెరకెక్కిన 'భజే వాయు వేగం' సినిమాకు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 3.60 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 4.00 కోట్లుగా నమోదైంది. ఇక, రెండు రోజుల్లో కార్తికేయ సినిమాకు రూ. 1.55 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 2.45 కోట్లు రాబడితేనే ఇది క్లీన్ హిట్‌గా నిలుస్తుంది.


Click it and Unblock the Notifications











