Bhaje Vaayu Vegam 5 Days Collections: కార్తికేయ మూవీకి భారీ వసూళ్లు.. హిట్‌కు చేరువగా భజే వాయు వేగం

తెలుగు చిత్ర పరిశ్రమలో తక్కువ మంది యంగ్ హీరోలు మాత్రమే విభిన్నమైన సినిమాలు చేస్తూ సక్సెస్‌ఫుల్‌గా కెరీర్‌లను ముందుకు తీసుకు వెళ్తున్నారు. అలాంటి వారిలో కార్తికేయ గుమ్మకొండ ఒకరు. ఇటీవలే విజయాన్ని అందుకున్న అతడు.. అదే ఊపును కంటిన్యూ చేయాలన్న ఉద్దేశంతో 'భజే వాయు వేగం' అనే సినిమాను చేశాడు. దీంతో ఈ చిత్రంపై అంచనాలు మంచిగానే ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే ఈ చిత్రం మంచి టాక్‌ను తెచ్చుకుని రెస్పాన్స్‌ను అందుకుంటోంది. మరి 'భజే వాయు వేగం' మూవీ 5 రోజుల వసూళ్లను మీరే చూడండి!

యాక్షన్ స్టోరీతో వచ్చేశాడు
కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటించిన చిత్రమే 'భజే వాయు వేగం'. ప్రశాంత్ రెడ్డి తెరకెక్కించిన ఈ యాక్షన్ సినిమాను యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్‌పై యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించింది. ఇందులో ఐశ్వర్య మీనన్ హీరోయిన్‌గా నటించగా.. రవిశంకర్, కృష్ణ చైతన్య, తణికెళ్ల భరణి, రాహుల్ టైసన్ తదితరులు నటించారు. కపిల్ కుమార్ సంగీతాన్ని సమకూర్చాడు.

Kartikeya Gummakonda Starrer Bhaje Vaayu Vegam Movie 5 Days Worldwide Collections Details

కార్తికేయ ప్రీ బిజినెస్ ఎంత
సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి వరుసగా సినిమాలు చేస్తూ.. ఇప్పుడు ఎలాగైనా భారీ విజయాన్ని సొంతం చేసుకోవాలన్న లక్ష్యంతో కార్తికేయ గుమ్మకొండ నటించిన 'భజే వాయు వేగం' సినిమాపై అంచనాలను భారీగా ఏర్పడ్డాయి. తద్వారా మంచి డిమాండ్‌ను పెంచుకుని ఈ మూవీ వరల్డ్ వైడ్‌గా రూ. 3.60 కోట్లు వరకూ థియేట్రికల్ బిజినెస్ చేసుకుంది.

5వ రోజు ఎంత వచ్చింది?
కార్తికేయ గుమ్మకొండ హీరోగా చేసిన 'భజే వాయు వేగం' మూవీకి టాక్‌ మంచిగా వచ్చినా రెస్పాన్స్‌ను ఆశించిన రీతిలో అందుకోలేదు. కానీ, రెండో రోజు నుంచి ఈ చిత్రం భారీగా పుంజుకుంది. తర్వాత డౌన్ అవుతూ వెళ్తోంది. ఈ క్రమంలోనే 5వ రోజు ఈ మూవీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రూ. 18 లక్షలు షేర్ వసూలు అయింది. అలాగే, రూ. 35 లక్షలు గ్రాస్‌ను ఇది రాబట్టుకుంది.

Kartikeya Gummakonda Starrer Bhaje Vaayu Vegam Movie 5 Days Worldwide Collections Details

5 రోజులకు కలిపి ఎంత?
ప్రశాంత్ రెడ్డి దర్శకత్వంలో కార్తికేయ గుమ్మకొండ హీరోగా చేసిన 'భజే వాయు వేగం' సినిమాకు మిగిలిన వాటి నుంచి పోటీ ఉన్నప్పటికీ బాగానే రాణించింది. దీంతో నైజాంలో ఇది రూ. 1.15 కోట్లు షేర్ వసూలు చేసింది. అలాగే, ఆంధ్రప్రదేశ్‌లో రూ. 1.38 కోట్లు వసూలు చేసింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో 5 రోజులకూ కలిపి రూ. 2.53 కోట్లు షేర్, రూ. 5.20 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంత?
టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటించిన 'భజే వాయు వేగం' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో 5 రోజుల్లో రూ. 2.53 కోట్లు షేర్ వచ్చింది. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లో కలిపి రూ. 42 లక్షలు వసూలు చేసింది. వీటితో కలిపి ఐదు రోజుల్లో ఈ చిత్రానికి రూ. 2.95 కోట్లు షేర్‌తో పాటు రూ. 6.25 కోట్లు గ్రాస్ వచ్చింది.

Kartikeya Gummakonda Starrer Bhaje Vaayu Vegam Movie 5 Days Worldwide Collections Details

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?
యాక్షన్ సబ్జెక్టుతో తెరకెక్కిన 'భజే వాయు వేగం' సినిమాకు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 3.60 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 4.00 కోట్లుగా నమోదైంది. ఇక, ఐదు రోజుల్లో కార్తికేయ సినిమాకు రూ. 2.95 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 1.05 కోట్లు రాబడితేనే ఇది క్లీన్ హిట్‌గా నిలుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X