Bhaje Vaayu Vegam Business: కార్తికేయ మూవీకి భారీ బిజినెస్.. అన్ని కోట్లు వస్తేనే భజే వాయు వేగం హిట్
తెలుగు సినిమా పరిశ్రమలో వరుసగా మూవీలు చేస్తున్నా.. విజయాలను అందుకోవడంలో విఫలం అవుతోన్న హీరోలు చాలా మందే ఉన్నారు. అందులో టాలెంటెడ్ గాయ్ కార్తికేయ గుమ్మకొండ ఒకడు. ఆరంభంలోనే పలు హిట్లను సొంతం చేసుకున్న అతడు.. ఆ తర్వాత అంతగా రాణించలేదు. ఈ పరిస్థితుల్లో 'బెదురులంక 2012' మూవీతో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడు. ఈ ఊపులోనే ఇప్పుడు కార్తికేయ 'భజే వాయు వేగం' అనే సినిమాలో నటించాడు. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎంత మేర బిజినెస్ చేసుకుందో చూద్దాం పదండి!
భజే వాయు వేగం అంటూ రాక
కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటించిన క్రైమ్ యాక్షన్ మూవీనే 'భజే వాయు వేగం'. ప్రశాంత్ రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమాను యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్‌పై యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించింది. ఇందులో ఐశ్వర్య మీనన్ హీరోయిన్‌గా నటించగా.. రవిశంకర్, కృష్ణ చైతన్య, తణికెళ్ల భరణి, రాహుల్ టైసన్ తదితరులు నటించారు. కపిల్ కుమార్ మ్యూజిక్ కంపోజ్ చేశారు.

అలాంటి కథతో థ్రిల్లింగ్‌గానే
విలన్ గ్యాంగ్స్‌కు చెందిన ఒక బ్యాగ్ మిస్ అవుతుంది. అది క్రికెటర్ అయిన హీరోకి చేరుతుంది. ఆ సమయంలోనే అతడి తండ్రి ఆసుపత్రిలో ఉంటాడు. అప్పుడు హీరో ఏం చేశాడు? ఆ బ్యాగ్ కోసం విలన్ గ్యాంగ్ ఏం చేసింది? అనే అంశాలతో తెరకెక్కించిన చిత్రమే 'భజే వాయు వేగం'. క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో రూపొందిన ఇది ఎన్నో అంచనాలను ఏర్పరచుకుని విడుదలైంది.
గ్రాండ్ రిలీజ్.. టాక్ అలాగ
భారీ విజయం కోసం వేచి చూస్తోన్న కార్తికేయ నటించిన 'భజే వాయు వేగం' మూవీ ఎన్నో అంచనాలతో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. దీనికి ఆరంభంలోనే డీసెంట్ టాక్ వచ్చింది. అందుకు తగ్గట్లుగానే ప్రేక్షకుల నుంచి స్పందన కూడా లభిస్తోంది. ఇదే కంటిన్యూ అయితే కలెక్షన్లు కూడా భారీగానే వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

సినిమా ప్రీ బిజినెస్ ఇలా
టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ నటించిన క్రైమ్ థ్రిల్లర్ సబ్జెక్ట్ 'భజే వాయు వేగం' మూవీపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. పైగా దీని నుంచి వచ్చి ప్రచార చిత్రాలు అన్నీ ఆకట్టుకోవడంతో హైప్ భారీగా పెరిగిపోయింది. ఫలితంగా కార్తికేయ నటించిన ఈ సినిమాకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రూ. 3.40 కోట్లు మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
వరల్డ్ వైడ్‌గా ఎంతంటే
కార్తికేయ - ప్రశాంత్ రెడ్డి కాంబినేషన్‌లో రూపొందిన 'భజే వాయు వేగం' మూవీపై అందరూ బాగానే ఫోకస్ చేశారు. అందుకు తగ్గట్లే మార్కెట్ పరంగా ఇది బయ్యర్ల దృష్టిని ఆకట్టుకుంది. ఫలితంగా రెస్టాఫ్ ఇండియా, కర్నాటక, ఓవర్సీస్ ఏరియాల్లో కలిపి రూ. 60 లక్షలకు అమ్ముడైంది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 4.00 కోట్లు థియేట్రికల్ బిజినెస్‌ను చేసుకుంది.

అన్ని కోట్లు వస్తేనే హిట్
కార్తికేయ నటించిన 'భజే వాయు వేగం' సినిమాకు ఊహించని విధంగా రూ. 4.00 కోట్లు బిజినెస్ జరిగింది. దీంతో ఈ సినిమాకు రూ. 4.50 కోట్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్ నమోదైంది. అంటే.. ఇంత మొత్తం వసూలు చేస్తేనే 'భజే వాయు వేగం' సినిమా కమర్షియల్‌గా విజయం సాధిస్తుంది. మౌత్ టాక్ మంచిగా వస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ మొత్తం రాబట్టడం కష్టమేమీ కాదు అనొచ్చు.


Click it and Unblock the Notifications











