Bedurulanka 2012 కార్తీకేయ గుమ్మకొండ మూవీకి అదిరిపోయే డీల్.. వరల్డ్ వైడ్ బిజినెస్ ఎన్ని కోట్లంటే?

RX 100 చిత్రంతో భారీ ఫాలోయింగ్ సంపాదించుకొన్న యువ హీరో కార్తికేయ గుమ్మకొండ. ఆ తర్వాత హీరోనే కాకుండా విలన్‌గా కూడా మెప్పించాడు. నానితో గ్యాంగ్ లీడర్, అజిత్‌తో వలిమై చిత్రాల్లో విలన్‌గా దక్షిణాదిలో ప్రేక్షకులను ఆకట్టుకొన్నాడు. తాజాగా కార్తీకేయ నటించిన చిత్రం బెదురులంక 2012 చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది. ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్, ఈ సినిమా వివరాల్లోకి వెళితే..

కార్తికేయ గుమ్మకొండ, డీజే టిల్లుతో కుర్రకారు గుండెల్లో కితకితలు పెట్టిన నేహా శెట్టి జంటగా బెదురులంక 2012 రూపొందింది. లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 3గా రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మించారు. సీ యువరాజ్ ఈ సినిమాను సమర్పించారు. క్లాక్స్ దర్శకుడిగా తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయమవుతున్నారు. ఆగస్టు 25న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

 Bedurulanka

ఇటీవల విడుదలైన బెదురు లంక రెండు పాటలకు మంచి ఆదరణ లభించింది. భోగమంత యిడువనే యిడువవు వింతగుంది రా... నువెవడివి సొల్లుడా శివా... నువెవడివి సొల్లుడా శివా..అంటూ సాగే పాట యూత్‌ను విశేషంగా ఆకట్టుకొంటూ ట్రెండింగ్‌గా నిలిచింది. ప్రమోషన్ కార్యక్రమాలు ఊపందుకోవడమే కాకుండా మంచి జోష్‌తోను కలిగిస్తున్నాయి.

బెదురులంక చిత్రం రోజు రోజుకు మంచి బజ్ క్రియేట్ చేస్తున్నది. దాంతో ఈ సినిమాకు వరల్డ్‌వైడ్‌గా మంచి బిజినెస్ రాబట్టింది. ఓవర్సీస్‌లో ఈ సినిమాను ది విలేజ్ గ్రూప్ రిలీజ్ చేస్తున్నది. సీడెడ్‌లో ఈ సినిమాను శ్రీ ధనుష్ ఫిల్మ్స్ రిలీజ్ చేస్తున్నది. ఇక నైజాం, ఆంధ్రా థియేట్రికల్ హక్కులను శంకర్ పిక్చర్స్ సొంతం చేసుకొన్నది.

 Bedurulanka

బెదురులంక 2012 మూవీ రిలీజ్‌కు ముందే ప్రీ రిలీజ్ బిజినెస్ హాట్ కేకులా జరిగిపోయింది. విడుదలకు ముందే ఈ సినిమా రూ.5 కోట్ల మేర రెవెన్యూను రాబట్టినట్టు చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ సినిమా ఆగస్గు 25వ తేదీన రిలీజ్ అవుతున్న నేపథ్యంలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఆగస్టులో ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X