Karuppu 15 Days Collections: తమిళంలో చరిత్ర సృష్టించిన కరుప్పు. సూర్య మూవీకి అరుదైన రికార్డు
సౌత్ ఇండియన్ సూపర్ స్టార్స్ సూర్య, త్రిష కృష్ణన్ జంటగా నటించిన కరుప్పు (వీరభద్రుడు) చిత్రం బాక్సాఫీస్ వద్ద ఊహకు అందని విధంగా పెర్ఫార్మ్ చేస్తున్నది. ట్రేడ్ వర్గాల అంచనాలను అధిగమించి తమిళంలోను, ఓవర్సీస్‌లోను కనక వర్షాన్ని కురిపిస్తున్నది. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం యావరేజ్ టాక్‌తో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టి సూపర్ హిట్ స్థాయి విజయంతో దూసుకెళ్తున్నది. ఈ సినిమా తమిళ సినిమా రంగంలో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 చిత్రాల్లో చేరేందుకు రెడీ అవుతున్నది. కోలీవుడ్ టాప్ 10 చిత్రాల జాబితా ఏమిటి? కరుప్పు బాక్సాఫీస్ జైత్రయాత్ర గురించిన వివరాల్లోకి వెళితే..
కరుప్పు సినిమా బడ్జెట్, ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాల్లోకి వెళితే... నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్లు, ప్రమోషనల్ ఖర్చులనీ కలిపి ఈ సినిమాను సుమారుగా 140 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరిగింది. ఈ సినిమా ఆంధ్రా, తెలంగాణ ప్రాంతపు థియేట్రికల్ రైట్స్ 7 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి. తమిళనాడులో 100 కోట్ల మేర బిజినెస్, కన్నడలో 10 కోట్లు, కేరళలో 5 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది.

కరుప్పు సినిమా తొలి రోజు 18 కోట్ల రూపాయల కలెక్షన్లతో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టిన చిత్రం ప్రత ీరోజు కలెక్షన్లను పెంచుకొంటూ పోయింది. తొలివారం ముగిసే సమయానికి ఇండియాలో 114 కోట్ల రూపాయలు వసూలు చేసింది. రెండో వారం ఈ చిత్రం 55 కోట్ల రూపాయలను రాబట్టింది. దాంతో రెండు వారాల్లో ఈ సినిమా ఇండియాలో 169 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించింది. 15వ రోజు విషయానికి వస్తే.. ఈ చిత్రం 5 కోట్ల రూపాయల వరకు వసూలు చేసే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
కరుప్పు చిత్రం కేవలం ఇండియాలోనే కాకుండా విదేశాల్లో కూడా కలెక్షన్లను కుమ్మేస్తున్నది. ఈ చిత్రం ఇప్పటి వరకు 72.5 కోట్ల రూపాయల వసూళ్లను సాధించింది. దాంతో ఈ చిత్రం ఇప్పటి వరకు 174 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్లు, 196 కోట్లరూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ చిత్రం 268 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. ఈ చిత్రం 300 కోట్ల రూపాయల కలెక్షన్ల మార్కు వైపు దూసుకెళ్తున్నది.
తమిళ సినిమా రంగంలో అత్యధిక వసూళ్లు సాధించిన 10 పది సినిమాల్లో రజనీకాంత్ నటించిన 2.0 చిత్రం 691 కోట్ల రూపాయల కలెక్షన్లతో టాప్ స్థానంలో ఉండగా, రెండో స్థానంలో విజయ్ నటించిన లియో 606 కోట్ల రూపాయలు, జైలర్ 605 కోట్ల రూపాయలు, కూలీ 518 కోట్ల రూపాయలు, పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1 488 కోట్ల రూపాయలు, విక్రమ్ 414 కోట్ల రూపాయలు, పొన్నియన్ సెల్వన్ 2 345 కోట్ల రూపాయలు, అమరన్ 334 కోట్లు, వారిసు 298 కోట్ల రూపాయలు వసూలు చేసింది. త్వరలోనే ఈ లిస్టులో సూర్య కూడా చేరబోతున్నారనే సంకేతాలు వెలువుడుతున్నాయి.


Click it and Unblock the Notifications