Karuppu 18 Days Collections: 300 కోట్లతో కరుప్పు సంచలనం.. సూర్య మూవీకి ఎన్ని కోట్ల లాభమంటే?

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్స్ సూర్య, త్రిష కృష్ణన్ జంటగా నటించిన కరుప్పు (వీరభద్రుడు) చిత్రం బాక్సాఫీస్ వద్ద ఊహకు అందని విధంగా పెర్ఫార్మ్ చేస్తున్నది. ట్రేడ్ వర్గాల అంచనాలను అధిగమించి తమిళంలోను, ఓవర్సీస్‌లోను కనక వర్షాన్ని కురిపిస్తున్నది. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం యావరేజ్ టాక్‌తో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టి సూపర్ హిట్ స్థాయి విజయంతో దూసుకెళ్తున్నది. ఈ సినిమా తమిళ సినిమా రంగంలో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 చిత్రాల్లో చేరేందుకు రెడీ అవుతున్నది. కోలీవుడ్ టాప్ 10 చిత్రాల జాబితా ఏమిటి? కరుప్పు బాక్సాఫీస్ జైత్రయాత్ర గురించిన వివరాల్లోకి వెళితే..

కరుప్పు సినిమా బడ్జెట్, ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాల్లోకి వెళితే... నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్లు, ప్రమోషనల్ ఖర్చులనీ కలిపి ఈ సినిమాను సుమారుగా 140 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరిగింది. ఈ సినిమా ఆంధ్రా, తెలంగాణ ప్రాంతపు థియేట్రికల్ రైట్స్ 7 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి. తమిళనాడులో 70 కోట్ల మేర బిజినెస్, కన్నడలో 10 కోట్లు, కేరళలో 5 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది.

Karuppu 18 Days Estimated Box office

కరుప్పు చిత్రం గత రెండు వారాల్లో దేశవ్యాప్తంగా భారీ వసూళ్లను సొంతం చేసుకొన్నది. మూడో వారంలో కూడా బాక్సాఫీస్ వద్ద స్టడీగా కలెక్షన్లను రాబడుతున్నది. గత 17 రోజులుగా వివిధ భాషల్లో ఈ సినిమా నమోదు చేసిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తమిళనాడులో ఈ చిత్రం ఇప్పటి వరకు 150 కోట్ల రూపాయల కలెక్షన్లను రాబట్టగా, తెలుగు రాష్ట్రాల్లోని నైజాం, సీడెడ్, ఆంధ్రాలో 34 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 23 కోట్ల రూపాయలు, కేరళలో 14 కోట్ల రూపాయలు రాబట్టింది. మిగితా రాష్ట్రాల్లో ఈ సినిమా 3 కోట్ల వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం ఇప్పటి వరకు ఇండియాలో 221 కోట్ల రూపాయలు మేర కలెక్షన్లు నమోదు చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

Also Read
నందమూరి తేజస్వినిపై అలాంటి రూమర్లు.. వైరల్ డ్యాన్స్ వీడియోతో...
నందమూరి తేజస్వినిపై అలాంటి రూమర్లు.. వైరల్ డ్యాన్స్ వీడియోతో...

సూర్య నటించిన కోర్ట్ రూమ్ డ్రామాకు ఓవర్సీస్‌లో కూడా ప్రేక్షకుల బ్రహ్మరథం పట్టారు. సూర్య కేరీర్‌లోనే అత్యధిక వసూళ్లను నమోదు చేసిన చిత్రం కరుప్పు రికార్డు క్రియేట్ చేసింది. ఈ చిత్రం ఓవర్సీస్‌లో అంటే నార్త్ అమెరికా, మలేషియా, గల్ఫ్, మిడిల్ ఈస్ట్, ఇతర దేశాల్లో కలిపి మొత్తంగా 8 మిలియన్లకుపైగా కలెక్షన్లను రాబట్టింది. దాంతో ఈ చిత్రం భారతీయ కరెన్సీలో సుమారుగా 78 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది అని ట్రేడ్ పండితులు తెలిపారు. దాంతో ఈ చిత్రం 300 కోట్ల రూపాయల క్లబ్‌లో చేరింది.

Recommended For You
నాకు గర్భస్రావం.. నా ప్రెగ్నెన్సీ పోవడానికి కారణం సీఎం విజయ్‌.. మండిపడ్డ యువ హీరోయిన్
నాకు గర్భస్రావం.. నా ప్రెగ్నెన్సీ పోవడానికి కారణం సీఎం విజయ్‌.. మండిపడ్డ యువ హీరోయిన్

ఇక 18వ రోజు కలెక్షన్ల విషయానికి వస్తే.. ఈ సినిమా వీకెండ్‌లో స్ట్రాంగ్‌గా పెర్ఫార్మ్ చేస్తున్నది. మూడో సోమవారం కూడా ఈ సినిమా భారీగానే వసూళ్లను రాబడుతుంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 2 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను రాబట్టే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

You May Also Like
'నేను డేటింగ్ చేయకపోతే.. బ్రేకప్‌తో ఆ క్రికెటర్ సూసైడ్ చేసుకోనే వాడేమో’
'నేను డేటింగ్ చేయకపోతే.. బ్రేకప్‌తో ఆ క్రికెటర్ సూసైడ్ చేసుకోనే వాడేమో’

ఇక ఈ సినిమా బ్రేక్ ఈవెన్ వివరాల్లోకి వెళితే.. సూర్య మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ మధ్యస్థంగా జరిగింది. గతంలో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీగా పరాజయం పొందడంతో సూర్య మూవీకి బిజినెస్ కొంత మేర తగ్గింది. దాతో ఈ సినిమా వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ సుమారుగా 100 కోట్ల రూపాయల మేర అమ్ముడుపోయాయి. అయితే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల రూపాయల గ్రాస్, 140 కోట్ల రూపాయల షేర్ వసూలు చేయడంతో సుమారుగా 70 కోట్ల రూపాయల ప్రాఫిట్ వచ్చింది అని లెక్క కడుతున్నారు. ఈ సినిమా ఇప్పటికే స్వదేశంలో తమిళం, తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ సాధించింది అని ట్రేడ్ వర్గాలు ధృవీకరించాయి.

Read more about: Karuppu suriya box office report
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X