Karuppu AP, TG Collections: వీరభద్రుడు (కరుప్పు) బాక్సాఫీస్ కలెక్షన్లు.. ఏపీ, తెలంగాణలో ఎన్ని కోట్లంటే?

సౌత్ స్టార్ హీరో సూర్య, హీరోయిన్ త్రిషా కృష్ణన్ నటించిన తాజా చిత్రం కరుప్పు. యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాకు ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ఆర్ ప్రభు, ఎస్ఆర్ ప్రకాశ్ బాబు నిర్మించారు. ఈ చిత్రంలో ఆర్జే బాలాజీ, ఇంద్రాన్స్, స్వసిక విజయ్, శివాడ నాయర్, అనఘా మాయ, సుప్రీత్ రెడ్డి, యోగిబాబు, మన్సూర్ ఆలీ ఖాన్, జార్జ్ మార్యన్, ఆడుకాలమ్ నరేన్, జాఫర్ సాధిక్ తదితరులు నటించారు.

ఈ చిత్రానికి సంబంధించిన సాంకేతిక నిపుణుల వివరాల్లో వెళితే.. సినిమాటోగ్రఫి: జీకే విష్ణు, ఎడిటింగ్: ఆర్ కళైవన్నన్, మ్యూజిక్ం సాయి అభయంకర్, స్టంట్స్: విక్రమ్ మోర్ తమ బాధ్యతలు నిర్వర్తించారు. ఈ చిత్రం మే 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అయింది. ఈ సినిమా గత 3 రోజులుగా వసూలు చేసిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

Karuppu 3 days Box Office

సూర్య, త్రిష కృష్ణన్ లాంటి అగ్రతారలతో రూపొందించిన ఈ చిత్రాన్ని ఖర్చుకు వెనుకాడకుండా నిర్మించారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్లు, ప్రమోషనల్ ఖర్చులనీ కలిపి ఈ సినిమాను సుమారుగా 140 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరిగింది. ఈ సినిమా ఆంధ్రా, తెలంగాణ ప్రాంతపు థియేట్రికల్ రైట్స్ 7 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో లాభాల్లోకి రావాలంటే.. కనీసం 8 కోట్ల షేర్, 16 కోట్ల మేర గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

తమిళంలో కరుప్పు, తెలుగులో వీరభద్రుడిగా రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద తొలి రోజు నుంచి సానుకూలమైన స్పందనను చూరగొంటున్నది. ఈ చిత్రం మొదటి రోజు 2.5 కోట్ల రూపాయలు గ్రాస్, రెండో రోజు 4 కోట్ల గ్రాస్, మూడో రోజు 4.5 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం గత మూడు రోజుల్లో 11 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఇక ఈ సినిమా తమిళనాడులో ప్రభంజనం కొనసాగిస్తున్నది. ఈ చిత్రం మొదటి రోజు 11.5 కోట్ల రూపాయలు వసూలు చేయగా, రెండో రోజు 17 కోట్ల రూపాయలు రాబట్టింది. ఇక మూడో రోజు 20 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా తమిళనాడులో సుమారుగా 49 కోట్ల మేర కలెక్షన్లు సాధించింది.

ఇక ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా సంచలన కలెక్షన్లను నమోదు చేస్తున్నది. ఈ చిత్రం ఓవర్సీస్‌లో మంచి వసూళ్లను రాబడుతున్నది. ఈ చిత్రం 3 రోజుల్లో 26 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 101 కోట్ల మేర కలెక్షన్లను రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇండియాలో 75 కోట్ల రూపాయల గ్రాస్, ఓవర్సీస్‌లో 26 కోట్లు వసూలు చేసింది. రానున్న రోజుల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Read more about: Karuppu suriya box office report
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X