Karuppu USA Box Office: షాకింగ్‌గా కరుప్పు అడ్వాన్స్ బుకింగ్... సూర్య మూవీకి ఎంతంటే?
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్నాడు. రెట్రో, కంగువా వంటి చిత్రాలతో ఆయన రేసులో వెనుకబడ్డారు. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే ఉద్దేశంతో ప్రయోగాల జోలికి వెళ్లకుండా తనకు బాగా కలిసొచ్చిన మాస్ మసాలా మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు సూర్య. అదే కరుప్పు (తెలుగులో వీరభద్రుడు) .. మే 14న వరల్డ్ వైడ్‌గా విడుదల కానుంది. కోలీవుడ్ అగ్రనటి త్రిషా కృష్ణన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఆర్జే బాలాజీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో కరుప్పు బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ఈవెన్ టార్గెట్ ఎంత? అడ్వాన్స్ బుకింగ్‌లో ఈ సినిమా ఎంత కలెక్ట్ చేసింది? ఈ వివరాల్లోకి వెళితే..
కరుప్పు తారాగణం
డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ఆర్ ప్రభు, ఎస్ఆర్ ప్రకాష్ బాబులు సంయుక్తంగా కరుప్పు సినిమాను నిర్మిస్తున్నారు. ఆర్జే బాలాజీ, ఇంద్రణ్స్, నట్టి సుబ్రహ్మణ్యం, శ్వాసిక, శివద, సుప్రీత్ రెడ్డి, యోగి బాబు, మన్సూర్ అలీఖాన్, జార్జ్ మరియన్, దీపా శంకర్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. జీకే విష్ణు సినిమాటోగ్రాఫర్‌గా, ఆర్ కలైవనన్ ఎడిటర్‌గా వ్యవహరించారు. సాయి అభయంకర్ సంగీత దర్శకత్వం వహించారు.

కరుప్పు బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రొడక్షన్ కాస్ట్, పబ్లిసిటీ ఖర్చులతో కలిపి కరుప్పు సినిమాను దాదాపుగా 130 కోట్ల రూపాయలతో నిర్మించినట్లుగా కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. భారీ తారాగణానికి తోడు టాప్ టెక్నీషియన్స్‌తో నిర్మాణ విలువల పరంగా ఎక్కడా తగ్గకుండా నిర్మాతలు ఈ సినిమాను నిర్మించారు. ఇక కరుప్పు మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తే.. వరుస ఫ్లాపులు ఎదురైనప్పటికీ సూర్య మార్కెట్ చెక్కుచెదరలేదని కరుప్పు నిరూపించింది.
కరుప్పు ప్రీ రిలీజ్ బిజినెస్
ఈ మూవీ ఓటీటీ రైట్స్ 35 కోట్ల రూపాయలు పలకగా.. శాటిలైట్ రైట్స్‌ను జీ సంస్థ ఫ్యాన్స్ ధరకు దక్కించుకుంది. తమిళనాడు, తెలుగు రాష్ట్రాలు, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ కలిపి కరుప్పు మూవీకి వరల్డ్ వైడ్‌గా 110 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ చేసినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ ద్వారా కరుప్పుకు దాదాపు 85 శాతం రికవరీని సాధించినట్లుగా కోలీవుడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సినిమా బ్రేక్ఈవెన్ కావాలంటే బాక్సాఫీస్ వద్ద 115 కోట్ల రూపాయల షేర్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు.
ఇండియా కరుప్పు అడ్వాన్స్ బుకింగ్
ఇక కరుప్పుకు ఇండియాలో అడ్వాన్స్ బుకింగ్‌కు ఇండియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది. తమిళనాడులో ఇప్పటి వరకు 3732 షోలకు గాను.. 1,58,036 టికెట్లు అమ్ముడై 2.50 కోట్ల రూపాయలు రాబట్టింది. తెలుగులో 547 షోలకు గాను 8418 టికెట్లు అమ్ముడై.. 11.45 లక్షల రూపాయలు వసూలు చేసింది. మొత్తంగా ఇండియాలో ఇప్పటి వరకు 4279 షోలకు గాను 1,66,454 టికెట్లు అమ్ముడై 2.66 కోట్లు రాబట్టింది కరుప్పు. ఇక్కడ పరిస్ధితి ఇలా ఉంటే ఓవర్సీస్‌లో మాత్రం సూర్య సినిమాకు అడ్వాన్స్ బుకింగ్ షాకిస్తోంది.
అమెరికాలో కరుప్పు అడ్వాన్స్ బుకింగ్
అమెరికాలో ఇప్పటి వరకు 30 సెంటర్స్‌లో 47 షోలకు గాను 468 టికెట్లు అమ్ముడై 6717 డాలర్లు (6.41 లక్షల రూపాయలు) వసూలు చేయడం నిర్మాతలకు షాకిస్తోంది. ఈ ఏడాది రిలీజైన శివకార్తీకేయన్ పరాశక్తి, ప్రదీప్ రంగనాథన్ నటించిన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ సినిమాలు సైతం యూఎస్‌లో అడ్వాన్స్ సేల్స్‌లో మంచి విజయాలను అందుకున్నాయి. కానీ సూర్య వంటి అగ్ర నటుడి సినిమాకు అమెరికాలో అడ్వాన్స్ సేల్స్‌లో దారుణంగా వసూళ్లు రావడం ఆశ్చర్యపరుస్తోంది. అయితే ఈ సినిమా వీకెండ్‌లో పుంజుకుని 100K మార్క్ (9.55 లక్షల రూపాయలు) అందుకుంటుందని భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications



