Karuppu Closing Collection: కరుప్పు క్లోజింగ్ కలెక్షన్స్.. సూర్య మూవీకి లాభమా? నష్టమా?

Karuppu Closing Collection: కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకు గత కొన్నేళ్లుగా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయి విజయాలు దక్కలేదు. అయితే ఈసారి మాత్రం మాస్, ఎమోషన్, ఫాంటసీ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'కరుప్పు' (తెలుగులో 'వీరభద్రుడు') సినిమా ఆయన కెరీర్‌లోనే అతిపెద్ద కంబ్యాక్‌గా నిలిచింది. విడుదలకు ముందు భారీ అంచనాలు నెలకొన్న ఈ చిత్రం, మొదటి షో నుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుని అన్ని ప్రాంతాల్లో సాలిడ్ కలెక్షన్స్ రాబట్టింది. ఈ నేపథ్యంలో సూర్య మూవీ బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? 'కరుప్పు మూవీకి లాభమెంత? నష్టమెంత? క్లోజింగ్ కలెక్షన్స్ ఎన్ని కోట్లు పరిశీలిస్తే..

డైరెక్టర్ ఆర్జే బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సూర్య డ్యూయల్ రోల్‌లో నటించగా, త్రిష కథానాయికగా నటించారు. భారీ విజువల్స్, పవర్‌ఫుల్ ప్రమోషన్స్ సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. ఈ సినిమా మే 15న విడుదలైంది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్.ఆర్ ప్రభు, ఎస్.ఆర్ ప్రకాష్ బాబు నిర్మించారు. ఈ సినిమాను సుమారు రూ.130 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. స్టార్ క్యాస్టింగ్, భారీ సెట్స్, అత్యున్నత సాంకేతిక విలువలు, విజువల్ ఎఫెక్ట్స్ కోసం నిర్మాతలు ఎక్కడా రాజీ పడలేదని సినీ వర్గాలు చెబుతున్నాయి.

Karuppu Box Office Closing Collections Worldwide

ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనడంతో విడుదలకు ముందే ఓటీటీ, శాటిలైట్, ఆడియో హక్కుల ద్వారా భారీ ఆదాయం కూడా వచ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సినిమా డిజిటల్ హక్కులను సుమారు రూ.35 కోట్లకు సొంతం చేసుకున్నట్లు సమాచారం. శాటిలైట్ హక్కులను ప్రముఖ టెలివిజన్ నెట్‌వర్క్ దక్కించుకుంది. దీంతో విడుదలకు ముందే నిర్మాతలు తమ పెట్టుబడిలో అధిక శాతం రికవరీ చేసినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు థియేట్రికల్ బిజినెస్ కూడా అద్భుతంగా జరిగింది. తమిళనాడు, తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, కేరళ, ఓవర్సీస్ మార్కెట్లు కలిపి సుమారు రూ.110 కోట్లకు పైగా థియేట్రికల్ హక్కులు అమ్ముడైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బాక్సాఫీస్ వద్ద 'కరుప్పు' బ్రేక్ ఈవెన్ సాధించాలంటే దాదాపు రూ.115 కోట్ల షేర్ రాబట్టాల్సిన పరిస్థితి.

సూర్య 'కరుప్పు' మూవీ విడుదలైన తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. సూర్య కెరీర్ భారీ విజయాన్ని అందుకుంది. ఇండియా నెట్ కలెక్షన్ల పరంగా చూస్తే కరుప్పు రూ.194.38 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. ఇండియా గ్రాస్ రూ.224.66 కోట్లకు చేరగా, ప్రపంచవ్యాప్తంగా మొత్తం గ్రాస్ రూ.307 కోట్లు అందుకుంది. ఈ కలెక్షన్లలో తమిళనాడులోనే ఏకంగా రూ. 155 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టి, సూర్య స్టార్‌డమ్‌ను మరోసారి నిరూపించింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో 'వీరభద్రుడు' పేరుతో విడుదలైన ఈ సినిమా రూ.33 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. కర్ణాటకలో రూ.23 కోట్లు, కేరళలో రూ.14 కోట్లు, మిగతా ప్రాంతాల్లో రూ.3 కోట్ల గ్రాస్ వసూళ్లు నమోదు చేసింది.

విదేశీ మార్కెట్‌లో కూడా ఈ సినిమాకు మంచి స్పందన వచ్చింది. ఓవర్సీస్‌లో రూ.81 కోట్ల గ్రాస్ సాధించి సూర్యకు ఉన్న అంతర్జాతీయ మార్కెట్‌ను మరోసారి చాటిచెప్పింది. అలాగే... మొదటి వారం ఈ సినిమా రూ.113.85 కోట్ల నెట్ కలెక్షన్లతో సెన్సేషన్ క్రియేట్ చేసింది. రెండో వారంలో మరో రూ.54.30 కోట్లు, మూడో వారంలో రూ.21.20 కోట్లు వసూలు చేసింది. వీక్‌డేస్‌లో కూడా స్థిరమైన కలెక్షన్స్ అందుకుంటూ కరుప్పు రూ.300 కోట్ల క్లబ్‌లోకి సులభంగా అడుగుపెట్టింది.

ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 'వీరభద్రుడు' పేరుతో విడుదలైంది. విడుదలైన సమయంలో భారీ పోటీ ఉన్నప్పటికీ ప్రేక్షకుల ఆదరణను అందుకుంది. 26 రోజుల రన్ ముగిసే సమయానికి తెలంగాణలో రూ.15.85 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లో రూ.17.20 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. మొత్తం తెలుగు రాష్ట్రాల్లో రూ.33.05 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ.7.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగగా, ఇప్పటికే రూ.16.65 కోట్ల షేర్ సాధించి దాదాపు రూ.9.15 కోట్లకు పైగా లాభాలను అందించింది. దీంతో కరుప్పు (వీరభద్రుడు) తెలుగులో డబుల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిందనే చెప్పాలి.

ప్రపంచవ్యాప్తంగా కూడా 'కరుప్పు' బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించింది. తమిళనాడులో రూ.155.80 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ.33.05 కోట్లు, కర్ణాటకలో రూ.23 కోట్లు, కేరళలో రూ.14 కోట్లు, హిందీ, ఇతర ప్రాంతాల్లో రూ.3.05 కోట్లు, ఓవర్సీస్ మార్కెట్‌లో రూ.81 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. మొత్తంగా 26 రోజుల్లో రూ. 307.85 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ నమోదు చేసింది. దీంతో దాదాపు రూ. 145 కోట్లకు పైగా షేర్ రాబట్టి, బ్రేక్ ఈవెన్ మార్క్‌ను భారీ మార్జిన్‌తో దాటేసింది. మొత్తంగా బయ్యర్లకు సుమారు రూ. 30 కోట్లకు పైగా లాభాలను అందించింది. ఇది సూర్య కెరీర్‌లోనే అత్యంత లాభాలు అందుకున్న సినిమాగా నిలిచింది. అలాగే.. డిజిటల్ రైట్స్, ఆడియో రైట్స్, శాటిలైట్ హక్కులు, డబ్బింగ్ రైట్స్‌తో నిర్మాత అదనపు లాభాలు అందుకున్నట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

Read more about: Karuppu box office report suriya
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X