Karuppu Overseas Collections: 200 కోట్ల క్లబ్‌లో కరుప్పు.. ఓవర్సీస్‌లో సూర్య మూవీకి ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?
తమిళ స్టార్ హీరో సూర్య నటించిన కరుప్పు చిత్రం ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల సునామీని సృష్టిస్తున్నది. గత 9 ఏళ్లుగా సరైన హిట్ లేని గజని హీరోకు ఈ చిత్రం రికార్డు స్థాయి వసూళ్లను కురుపిస్తున్నది. మిక్స్‌డ్ టాక్‌తో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టిన ఈ చిత్రం క్రిటిక్స్, ట్రేడ్ అనలిస్టుల అంచనాలను తలకిందులు చేస్తూ రికార్డుల పర్వాన్ని కొనసాగిస్తున్నది. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో త్రిష కృష్ణన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఓవర్సీస్ మార్కెట్‌లో ఊహకు అందని కలెక్షన్లను రాబడుతున్నది. ఈ చిత్రం ఇంటర్నేషన్ మార్కెట్‌లో సృష్టిస్తున్న కలెక్షన్ల హంగామా వివరాల్లోకి వెళితే..
సూర్య నటించిన సినిమాలు ఇటీవల కాలంలో బాక్సాఫీస్ వద్ద కాసులను రాబట్టడంలో విఫలమవుతున్న నేపథ్యంలో భారీ అంచనాలు లేకుండానే ఈ సినిమా ప్రీ రిలీజ్, థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఓవర్సీస్ రైట్స్ సుమారుగా 15 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది. ఈ చిత్రం సుమారుగా 17 కోట్ల రూపాయల షేర్.. 34 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ జర్నీ మొదలుపెట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

కరుప్పు చిత్రం మిక్స్‌డ్ టాక్‌తో థియేట్రికల్ రన్ మొదలుపెట్టింది. అయితే ఊహకు అందని విధంగా అంచనాలను తారుమారు చేస్తూ మిడిల్ ఈస్ట్‌లోను, నార్త్ అమెరికాలోను, యూనైటెడ్ కింగ్డమ్, యూరప్, ఆస్ట్రేలియా, మలేషియా, సింగపూర్ దేశాల్లో సూర్య కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్లను సాధించింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
కరుప్పు చిత్రం మిడిల్ ఈస్ట్‌లో గత 6 రోజుల్లో సుమారుగా 2 మిలియన్ డాలర్లు అంటే.. సుమారుగా 18 కోట్ల రూపాయలు వసూలు చేసింది. నార్త్ అమెరికాలో ఈ చిత్రం 1 మిలియన్ డాలర్లు అంటే సుమారుగా 10 కోట్ల రూపాయల వసూళ్లను సాధించింది. యూరపియన్ మార్కెట్‌లో ఈ చిత్రం 4.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఫ్రాన్స్‌లో 1.5 కోట్ల రూపాయలు, జర్మనీలో 1 కోటి రూపాయలు, సౌత్ ఏషియా, మలేషియాలో కలిపి 10 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో 2.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
ఇంటర్నేషన్ మార్కెట్‌లో కనివీని ఎరుగని విధంగా సూర్య కెరీర్‌లో రికార్డు స్థాయి కలెక్షన్లను నమోదు చేస్తున్నది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ చిత్రం గత 6 రోజుల్లో సుమారుగా 55 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సాధించింది. ఈ చిత్రం భారీగా, స్ట్రాంగ్‌గా బాక్సాఫీస్ రన్‌ను కొనసాగించే అవకాశాలు ఉన్నాయి అని తెలిపారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల రూపాయల క్లబ్‌లో చేరడం ఓ రికార్డుగా మారింది.
సౌత్ స్టార్ హీరో సూర్య, హీరోయిన్ త్రిషా కృష్ణన్ నటించిన తాజా చిత్రం కరుప్పు. యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాకు ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ఆర్ ప్రభు, ఎస్ఆర్ ప్రకాశ్ బాబు నిర్మించారు. ఈ చిత్రంలో ఆర్జే బాలాజీ, ఇంద్రాన్స్, స్వసిక విజయ్, శివాడ నాయర్, అనఘా మాయ, సుప్రీత్ రెడ్డి, యోగిబాబు, మన్సూర్ ఆలీ ఖాన్, జార్జ్ మార్యన్, ఆడుకాలమ్ నరేన్, జాఫర్ సాధిక్ తదితరులు నటించారు.
ఈ చిత్రానికి సంబంధించిన సాంకేతిక నిపుణుల వివరాల్లో వెళితే.. సినిమాటోగ్రఫి: జీకే విష్ణు, ఎడిటింగ్: ఆర్ కళైవన్నన్, మ్యూజిక్ం సాయి అభయంకర్, స్టంట్స్: విక్రమ్ మోర్ తమ బాధ్యతలు నిర్వర్తించారు. ఈ చిత్రం మే 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అయింది.


Click it and Unblock the Notifications