Karuppu Day 1 Box Office Collection: కరుప్పు తొలి రోజు కలెక్షన్లు.. సూర్య-త్రిష మూవీకి ఎన్ని కోట్లంటే?

Karuppu Box Office Collection: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య.. వరుసగా ఆశించిన అపజయాలు ఎదుర్కొంటున్నారు. ఈసారి తప్పకుండా బాక్సాఫీస్ వద్ద భారీ కంబ్యాక్ ఇవ్వాలనే లక్ష్యంతో 'కరుప్పు' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మాస్, ఎమోషన్, కమర్షియల్ ఎలిమెంట్స్ మేళవించిన కథను ఎంచుకోవడం గమనార్హం. తమిళంలో 'కరుప్పు'గా, తెలుగులో 'వీరభద్రుడు'గా ఈ సినిమా విడుదలైంది. వాస్తవానికి ఈ సినిమా మే 14న విడుదల కావాల్సి ఉండగా, చివరి నిమిషంలో ఆర్థిక సమస్యల కారణంగా కొన్ని షోలు రద్దయ్యాయి. అనంతరం మే 15న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో కరుప్పు మూవీ బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ఈవెన్ టార్గెట్ ఎంత? తొలిరోజు ఈ సినిమా ఎన్ని కోట్లు రాబట్టింది? ఈ వివరాల్లోకి వెళితే..

కరుప్పు సినిమాను నటుడు-దర్శకుడు ఆర్జే బాలాజీ తెరకెక్కించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సూర్య ద్విపాత్రాభినయంలో కనిపిస్తుండగా, త్రిష కృష్ణన్ హీరోయిన్‌గా నటించడం సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌లతో మంచి హైప్ క్రియేట్ చేశాయి. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ఆర్ ప్రభు, ఎస్ఆర్ ప్రకాష్ బాబు నిర్మించిన ఈ సినిమాలో ఆర్జే బాలాజీతో పాటు ఇంద్రణ్స్, నట్టి సుబ్రహ్మణ్యం, శ్వాసిక, శివద, సుప్రీత్ రెడ్డి, యోగి బాబు, మన్సూర్ అలీఖాన్, జార్జ్ మరియన్, దీపా శంకర్ వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. జీకే విష్ణు సినిమాటోగ్రఫీ, ఆర్ కలైవనన్ ఎడిటింగ్, సాయి అభయంకర్ సంగీతం అందించారు.

Karuppu day 1 expected box office collections worldwide Suriya-Trisha s Film Opening Collections

ఇక సినిమా బడ్జెట్ విషయానికి వస్తే, ఈ సినిమాను సుమారు రూ.130 కోట్ల భారీ వ్యయంతో నిర్మించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. స్టార్ క్యాస్ట్, టాప్ టెక్నీషియన్స్, భారీ ప్రొడక్షన్ వాల్యూస్‌తో ఎక్కడా రాజీ పడకుండా మేకర్స్ ఈ చిత్రాన్ని రూపొందించారు. వరుస ఫ్లాప్స్ వచ్చినప్పటికీ సూర్య మార్కెట్ మాత్రం తగ్గలేదని 'కరుప్పు' ప్రీ రిలీజ్ బిజినెస్ స్పష్టంగా చూపించింది. ఈ సినిమా ఓటీటీ హక్కులు సుమారు రూ.35 కోట్లకు అమ్ముడవగా, శాటిలైట్ రైట్స్‌ను ప్రముఖ ఛానల్ జీ నెట్‌వర్క్ సొంతం చేసుకుంది.

థియేట్రికల్ రైట్స్ పరంగా తమిళనాడు, తెలుగు రాష్ట్రాలు, మిగతా భారతదేశం, ఓవర్సీస్ కలిపి సుమారు రూ.110 కోట్ల వరల్డ్‌వైడ్ బిజినెస్ జరిగినట్లు సమాచారం. మొత్తం మీద థియేట్రికల్, నాన్-థియేట్రికల్ డీల్స్ ద్వారా దాదాపు 85 శాతం పెట్టుబడిని ముందుగానే రికవరీ చేసినట్లు అంచనా. ఇక బాక్సాఫీస్ పరంగా 'కరుప్పు' బ్రేక్ ఈవెన్ కావాలంటే సుమారు రూ.115 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు.

మోస్ట్ అవేటెడ్ యాక్షన్ డ్రామా 'కరుప్పు' రిలీజ్‌కు ముందే అనుకోని ఇబ్బందులను ఎదుర్కొంది. అసలు ఈ సినిమా మే 14న తమిళనాడులో ప్రత్యేకంగా ఉదయం 9 గంటలకు ఫ్యాన్స్ షోలతో గ్రాండ్‌గా విడుదల కావాల్సి ఉంది. అయితే డిస్ట్రిబ్యూటర్లకు సంబంధించిన పెండింగ్ బకాయిల కారణంగా చివరి నిమిషంలో సమస్యలు తలెత్తాయి. దీంతో అనేక థియేటర్లలో ఉదయం, మధ్యాహ్నం షోలు రద్దు కావడంతో రిలీజ్ డే కలెక్షన్లపై ప్రభావం పడింది. అయితే ఈ గందరగోళ పరిస్థితుల్లో కూడా 'కరుప్పు' మంచి ఓపెనింగ్స్ అందుకుంది. ముఖ్యంగా తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లో ముందస్తు బుకింగ్స్ బలంగా ఉండటం సినిమాకు కొంత మద్దతు లభించింది.

ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, రిలీజ్‌కు ముందు రోజే ఈ సినిమా ఇండియా వ్యాప్తంగా సుమారు రూ.4.55 కోట్ల గ్రాస్ అడ్వాన్స్ బుకింగ్స్ సాధించింది. రాష్ట్రాల వారీగా చూస్తే... తమిళనాడులోనే అత్యధికంగా రూ.1.85 కోట్ల బుకింగ్స్ నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కలిపి రూ.1.22 కోట్లు, కేరళలో సుమారు రూ.71 లక్షలు, కర్ణాటకలో రూ.69 లక్షలు, మిగతా ప్రాంతాల్లో కలిపి రూ.8 లక్షల వరకు కలెక్షన్స్ వచ్చాయి. రిలీజ్ ఆలస్యం కాకపోయి ఉంటే మొత్తం ఓపెనింగ్ సామర్థ్యం రూ.11 కోట్లకు పైగా ఉండేదని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. ఒక బుక్‌మైషోలోనే ఈ సినిమా రిలీజ్‌కు ముందే 1.19 లక్షల టికెట్లు అమ్ముడవడం గమనార్హం. అయితే షోలు రద్దు కావడం వల్ల ఈ బుకింగ్స్ మోమెంటమ్‌కు బ్రేక్ పడింది.

తాజా సమాచారం ప్రకారం.. 'కరుప్పు' సినిమాకు భారీ రెస్పాన్స్ లభిస్తోంది. బుక్‌మైషోలో తమిళ వెర్షన్‌కు గంటకు సుమారు 39 వేల టిక్కెట్లు అమ్ముడవడం రికార్డు వేగంగా చెప్పుకుంటున్నారు. మే 15న తమిళ, తెలుగు వెర్షన్లకు కలిపి 2 లక్షలకు పైగా టిక్కెట్లు అమ్ముడయ్యాయంట. ఇలా తొలి షోల తర్వాత వచ్చిన పాజిటివ్ టాక్‌తో బుకింగ్స్ మరింత పెరిగాయి. ముఖ్యంగా సూర్య స్క్రీన్ ప్రెజెన్స్, ఎమోషనల్ సీన్స్, మాస్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ ట్రెండ్ కొనసాగితే స్పాట్ బుకింగ్స్ కూడా భారీగా పెరిగే అవకాశం ఉందట.

ప్రస్తుత పరిస్థితులను బట్టి 'కరుప్పు' డే 1 అంచన కలెక్షన్స్ భారీ మొత్తంలో ఉండవచ్చు. తొలిరోజు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 10 కోట్ల నుంచి 12కోట్ల గ్రాస్ కలెక్షన్స్, ఇక వరల్డ్ వైడ్ గా రూ. 15 కోట్లు వరకు వసూళ్లు సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇది సూర్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్‌లో ఒకటిగా నిలవొచ్చని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. పాజిటివ్ టాక్ అలాగే కొనసాగితే శని, ఆదివారాల్లో కలెక్షన్స్ గణనీయంగా పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Read more about: Karuppu suriya box office report
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X