Karuppu Day 10 Collection: సూర్య ‘ వీరభద్రుడు ' వీకెండ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే..?

Karuppu Box Office Collection: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన మోస్ట్ అవేటెడ్ యాక్షన్ డ్రామా 'కరుప్పు' (తెలుగులో 'వీరభద్రుడు') బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా మొదటి రోజునుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని, వసూళ్ల పరంగా స్ట్రాంగ్ రన్ కొనసాగిస్తోంది. సాధారణంగా వీకెండ్ తర్వాత కలెక్షన్స్‌లో డ్రాప్ కనిపించడం కామన్. కానీ 'కరుప్పు' మాత్రం వర్కింగ్ డేస్‌లో కూడా స్టెడీగా కలెక్షన్స్ రాబడుతూ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. ఈ నేపథ్యంలో సూర్య సినిమా ఎన్ని కోట్లు వసూలు చేసింది? 10వ రోజు కలెక్షన్లు ఎంత?అనే వివరాల్లోకెళ్తే..

కరుప్పు సినిమాను దర్శకుడు ఆర్.జే. బాలాజీ తెరకెక్కించగా, డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్.ఆర్. ప్రభు, ఎస్.ఆర్. ప్రకాష్ బాబు నిర్మించారు. యాక్షన్, ఫాంటసీ ఎలిమెంట్స్‌ను మేళవించి రూపొందించిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా సూర్య నటన, ఎమోషనల్ సన్నివేశాలు, మాస్ ఎలిమెంట్స్ సినిమాకు ప్లస్ పాయింట్‌గా మారాయి. హీరోయిన్‌గా త్రిష నటన కూడా ప్రేక్షకులను మెప్పించింది. యోగి బాబు, ఇంద్రన్స్, నటరాజన్ సుబ్రమణ్యం, మన్సూర్ అలీ ఖాన్ వంటి నటులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

Karuppu day 10 expected box office collections worldwide Suriya-Trisha s Film Collections

టెక్నికల్‌గా కూడా 'కరుప్పు' హై స్టాండర్డ్స్‌ను మెయింటైన్ చేసింది. సాయి అభయంకర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమా ఎమోషన్స్‌ను మరింత బలంగా చూపించగా, సినిమాటోగ్రాఫర్ జీకే విష్ణు విజువల్స్ సినిమాకు గ్రాండ్ ఫీల్ తీసుకొచ్చాయి. ప్రతి ఫ్రేమ్‌లోనూ రిచ్‌నెస్ కనిపించడం, థియేటర్ ఎక్స్‌పీరియన్స్‌ను మరింత ఎలివేట్ చేసింది. దాదాపు రూ.130 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా, నిర్మాణ పరంగా ఎక్కడా రాజీ పడకుండా రూపొందించారు. ఓటీటీ హక్కులు సుమారు రూ.35 కోట్లకు అమ్ముడవ్వగా, శాటిలైట్ రైట్స్ కూడా మంచి ధరకు వెళ్లినట్లు సమాచారం. ఇక ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ హక్కులు సుమారు రూ.110 కోట్లకు అమ్ముడయ్యాయి. ఈ లెక్కల ప్రకారం సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే కనీసం రూ.115 కోట్ల షేర్ అవసరం.

ఇక కరుప్పు సినిమా కలెక్షన్ల పరంగా చూస్తే.. ఈ మూవీ ప్రస్తుతం కొత్త బాక్సాఫీస్ రికార్డులను సృష్టిస్తోంది. ఈ యాక్షన్-డ్రామా థియేటర్లలో విడుదలైనప్పటి నుండి భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఇటు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద, అటు ఓవర్సీస్ లోనూ ఈ సినిమా దుమ్మురేపుతోంది. 2026లో అతిపెద్ద తమిళ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇప్పటికే ఇండియాలో రూ.100 కోట్ల మార్క్ దాటేసిన ఈ సినిమా, ఇప్పుడు రూ.150 కోట్ల దిశగా వేగంగా పయనిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కూడా రూ.200 కోట్ల మైలురాయిని దాటేసి సూర్య కెరీర్‌లోనే హైయెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది.

ట్రేడ్ వెబ్‌సైట్ Sacnilk ప్రకారం, 'కరుప్పు' మొదటి రోజు రూ.15.50 కోట్లతో ఓపెనింగ్ తీసుకుంది. ఆ తర్వాత వీకెండ్‌లో కలెక్షన్స్ భారీగా పెరిగాయి. రెండో రోజు (శనివారం) రూ.24.15 కోట్లు, మూడో రోజు (ఆదివారం) రూ.28.35 కోట్లు వసూలు చేసి సినిమా మాస్ రన్‌ను స్టార్ట్ చేసింది. నాలుగో రోజు నుంచి కొంత డ్రాప్ కనిపించినా, వసూళ్లు స్టెడీగా కొనసాగాయి. నాలుగో రోజు రూ.14.30 కోట్లు, ఐదో రోజు రూ.12.75 కోట్లు, ఆరో రోజు రూ.10.70 కోట్లు రాబట్టింది. ఏడో రోజు రూ.8.10 కోట్లు, ఎనిమిదో రోజు రూ.7.80 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక తొమ్మిదో రోజు (డే 9) మళ్లీ కలెక్షన్లు పెరిగాయి. దీంతో మొత్తం ఇండియా నెట్ కలెక్షన్స్ రూ.133.85 కోట్లకు చేరుకోగా, గ్రాస్ కలెక్షన్స్ రూ.154.99 కోట్లకు చేరాయి.

ఓవర్సీస్‌లో కూడా 'కరుప్పు' దుమ్మురేపుతోంది. తొమ్మిదో రోజు రూ.3.50 కోట్లు వసూలు చేయడంతో, విదేశీ మార్కెట్‌లో మొత్తం రూ.62.75 కోట్ల గ్రాస్ నమోదైంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా మొత్తం రూ.217.74 కోట్ల గ్రాస్ సాధించి బ్లాక్‌బస్టర్ రేంజ్‌లో దూసుకెళ్తోంది. సూర్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. మొదట్లో మిక్స్‌డ్ టాక్ వచ్చినా, మాస్ ఆడియన్స్ సపోర్ట్, పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్‌తో 'కరుప్పు' కలెక్షన్స్ రోజురోజుకీ పెరుగుతున్నాయి. ముఖ్యంగా వీకెండ్ తర్వాత కూడా స్టెడీగా కలెక్షన్స్ రావడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది.

ఇక 10వ రోజు (ఆదివారం) అంచనా కలెక్షన్లు చూస్తే.. ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సుమారు రూ.10 కోట్ల వరకు వసూలు చేసే అవకాశముంది. సాధారణంగా వర్కింగ్ డేస్‌లో భారీ డ్రాప్ కనిపించినా వీకెండ్ లో కలెక్షన్లు పెరిగే అవకాశం ఉంది. దీంతో 10 రోజుల నెట్ కలెక్షన్లు సుమారు రూ. 140 కోట్లకు, గ్రాస్ కలెక్షన్లు రూ. 170 కోట్లకు చేరుకునే అవకాశముంది. ఓవర్సీస్ మార్కెట్‌లో సుమారు రూ.70 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టింది. వర్డల్ వైడ్ రూ.290 కోట్లు కలెక్ట్ చేసే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులు చేసే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనాలు ఉన్నాయి.

Read more about: Karuppu suriya box office report
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X