Karuppu Day 12 Collection: 300 కోట్లపై కన్నేసిన కరుప్పు.. సూర్య మూవీకి ఎన్ని కోట్లంటే?

Karuppu Box Office Collection: కరుప్పు (Karuppu) బాక్సాఫీస్ అద్బుత కలెక్షన్లతో ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. స్టార్ హీరో సూర్య (Suriya)నటించిన ఈ మోస్ట్ అవేటెడ్ యాక్షన్ ఫాంటసీ డ్రామా భారీ అంచనాల మధ్య విడుదలై మొదటి రోజునుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. సాధారణంగా వీకెండ్ ముగిసిన తర్వాత సినిమాల వసూళ్లు పడిపోవడం కామన్‌గా కనిపిస్తుంటుంది. అయితే 'కరుప్పు' మాత్రం ఆ ట్రెండ్‌ను బ్రేక్ చేస్తూ వర్కింగ్ డేస్‌లో కూడా స్టెడీగా కలెక్షన్స్ రాబడుతూ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. ఈ నేపథ్యంలో సూర్య సినిమా ఎన్ని కోట్లు వసూలు చేసింది? 12వ రోజు కలెక్షన్లు ఎంత? అనే వివరాల్లోకెళ్తే..

ఈ సినిమాను దర్శకుడు RJ బాలాజీ తెరకెక్కించగా, ప్రముఖ నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్.ఆర్. ప్రభు, ఎస్.ఆర్. ప్రకాష్ బాబు నిర్మించారు. యాక్షన్, ఫాంటసీ, ఎమోషన్‌ల సమ్మేళనంగా రూపొందిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందించబడింది. ముఖ్యంగా సూర్య నటన సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఆయన పోషించిన పాత్రలో ఎమోషన్, మాస్, యాక్షన్ అన్ని ఎలిమెంట్స్ సమపాళ్లలో ఉండటంతో ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతున్నారు. హీరోయిన్‌గా నటించిన త్రిష తన పాత్రలో మెచ్యూర్డ్ పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకుంది. కామెడీ, సపోర్టింగ్ పాత్రల్లో కనిపించిన యోగి బాబు, ఇంద్రన్స్, నటరాజన్ సుబ్రమణ్యం, మన్సూర్ అలీ ఖాన్ వంటి నటులు కూడా తమ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారనే చెప్పాలి.

Karuppu day 12 expected box office collections worldwide Suriya-Trisha s Film Collections

టెక్నికల్‌గా కూడా 'కరుప్పు' హై స్టాండర్డ్స్‌ను మెయింటైన్ చేసింది. సాయి అభయంకర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమా ఎమోషన్స్‌ను మరింత బలంగా చూపించగా, సినిమాటోగ్రాఫర్ జీకే విష్ణు విజువల్స్ సినిమాకు గ్రాండ్ ఫీల్ తీసుకొచ్చాయి. ప్రతి ఫ్రేమ్‌లోనూ రిచ్‌నెస్ కనిపించడం, థియేటర్ ఎక్స్‌పీరియన్స్‌ను మరింత ఎలివేట్ చేసింది. దాదాపు రూ.130 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా, నిర్మాణ పరంగా ఎక్కడా రాజీ పడకుండా రూపొందించారు. ఓటీటీ హక్కులు సుమారు రూ.35 కోట్లకు అమ్ముడవ్వగా, శాటిలైట్ రైట్స్ కూడా మంచి ధరకు వెళ్లినట్లు సమాచారం. ఇక ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ హక్కులు సుమారు రూ.110 కోట్లకు అమ్ముడయ్యాయి. ఈ లెక్కల ప్రకారం సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే కనీసం రూ.115 కోట్ల షేర్ వసూలు చేయాల్సి ఉంటుంది.

కరుప్పు సినిమా కలెక్షన్ల పరంగా ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తుంది. ప్రారంభంలో మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ, తర్వాత పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్ కారణంగా కలెక్షన్లు రోజురోజుకూ బలపడుతూ ఇప్పుడు బ్లాక్‌బస్టర్ రేంజ్‌లో దూసుకుపోతున్నాయి. రోజువారీ కలెక్షన్లను పరిశీలిస్తే, మొదటి రోజు నుంచే ఈ సినిమా స్ట్రాంగ్ ఓపెనింగ్స్‌ అందుకుంటుంది. మొదటి రోజు రూ. 15.50 కోట్లు, రెండో రోజు రూ. 24.15 కోట్లు, మూడో రోజు రూ. 28.35 కోట్లు వసూలు చేసి భారీ వీకెండ్‌ను అందుకుంది. ఆ తర్వాత వర్కింగ్ డేస్‌లో సహజంగా తగ్గినా, స్థిరంగా వసూళ్లు కొనసాగాయి. మొత్తంగా మొదటి వారం రూ. 113.85 కోట్ల నెట్ కలెక్షన్ సాధించింది. రెండో వారం కూడా ఈ సినిమా స్ట్రాంగ్‌గా కలెక్షన్స్ అందుకుంది. రెండో శుక్రవారం రూ. 7.80 కోట్లు, శనివారం రూ. 12.45 కోట్లు, ఆదివారం రూ. 14.75 కోట్లు వసూలు చేసి మళ్లీ బాక్సాఫీస్ వద్ద జోరు చూపించింది.

ఇక రెండో సోమవారం (11వ రోజు) ఈ సినిమా వసూళ్లు కొంత తగ్గినా, మొత్తం కలెక్షన్ల పరంగా మాత్రం స్ట్రాంగ్‌గా మారాయి. తాజా లెక్కల ప్రకారం.. 11వ రోజున 'కరుప్పు' రూ. 5.90 కోట్లు వసూలు చేసింది. ఆదివారం రూ. 14.75 కోట్లు రాబట్టిన నేపథ్యంలో ఇది దాదాపు 60 శాతం తగ్గుదలగా కనిపించినప్పటికీ, వర్కింగ్ డేలో అది కూడా రెండో వారం కూడా ఈ స్థాయిలో వసూళ్లు రావడం సినిమాకు ఉన్న డిమాండ్‌ను స్పష్టంగా చూపిస్తోంది. ఇక ఇండియన్ బాక్సాఫీస్ విషయానికి వస్తే.. ఈ సినిమా ఇప్పటివరకు రూ. 154.75 కోట్ల నెట్ కలెక్షన్ సాధించింది. గ్రాస్ పరంగా ఇది రూ.179 కోట్లకు చేరుకుంది.ఈ మూవీ కేవలం 11 రోజుల్లోనే రూ.150 కోట్ల మార్క్ దాటడం సూర్య కెరీర్‌లో ఓ మైల్ స్టోన్ గా చెప్పవచ్చు. తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, కేరళలో కూడా ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ రావడం విశేషం.

ఇక ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా 'కరుప్పు' మంచి రన్ కొనసాగిస్తోంది. 11వ రోజున సుమారు రూ. 1 కోటి వసూలు చేయడంతో, మొత్తం ఓవర్సీస్ గ్రాస్ రూ. 68 కోట్లకు చేరుకుంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా మొత్తం వసూళ్లు రూ. 247.15 కోట్లకు చేరి, రూ. 250 కోట్ల మార్క్‌కు అతిచేరువలో నిలిచింది.ఇక 12వ రోజు (మంగళవారం)అంచనా కలెక్షన్లు చూస్తే.. ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సుమారు రూ.4 కోట్ల వరకు, ఓవర్సీస్ మార్కెట్ లో దాదాపు రూ. 1 కోట్ల అందుకునే అవకాశముంది.

సాధారణంగా వర్కింగ్ డేస్‌లో భారీ డ్రాప్ కనిపించినా ఈ సినిమాకు మాత్రం చెప్పుకోదగ్గ కలెక్షన్లు అందుకుంటుందనే చెప్పాలి. దీంతో 12 రోజుల ఇండియాన్ నెట్ కలెక్షన్లు సుమారు రూ. 160 కోట్లకు, గ్రాస్ కలెక్షన్లు రూ. 185 కోట్లకు చేరుకునే అవకాశముంది. ఓవర్సీస్ మార్కెట్‌లో సుమారు రూ.75 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టింది. వర్డల్ వైడ్ రూ.255 కోట్ల వరకు కలెక్ట్ చేసే అవకాశం ఉందట. రాబోయే రోజుల్లో రూ. 300 కోట్లు అందుకుని, మరిన్ని రికార్డులు చేసే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనాలు ఉన్నాయి.

Read more about: box office report Karuppu suriya
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X