Karuppu Day 17 Collection: బాక్సాఫీస్ వద్ద కరుప్పు సునామీ.. సీఎం విజయ్ రికార్డును బ్రేక్ చేసిన సూర్య..

Karuppu Box Office Collection: సౌత్ ఇండియన్ సూపర్ స్టార్స్ సూర్య, త్రిష కృష్ణన్ జంటగా నటించిన కరుప్పు (వీరభద్రుడు) బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. విడుదలైన మూడు వారాలు పూర్తవుతున్నా ఈ సినిమా జోరు ఏమాత్రం తగ్గడం లేదు. మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. తమిళంలోను, ఓవర్సీస్‌లోను కాసుల వర్షాన్ని కురిపిస్తున్నది. ముఖ్యంగా మూడో వారంలో కూడా భారీ స్థాయిలో కలెక్షన్లు నమోదు చేస్తుండటం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తాజాగా కలెక్షన్లు చూస్తే సినిమా క్రేజ్ ఇంకా ఏమాత్రం తగ్గలేదని స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో 17 రోజుల్లో ఈ సినిమా ఎన్నికోట్లు వసూలు చేసిందంటే?

కరుప్పు రోజు వారి కలెక్షన్ల గమనిస్తే.. తొలి రోజు రూ.15.50 కోట్ల నెట్ కలెక్షన్లతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఖాతా తెరిచింది. రెండో రోజు రూ.24.15 కోట్లు, మూడో రోజు రూ.28.35 కోట్లు రాబట్టింది. వీకెండ్ ముగిసే సరికి సినిమా వసూళ్ల పరంగా దూసుకుపోయింది. ఆ తర్వాత కూడా వర్కింగ్ డేస్‌లో మంచి హోల్డ్ చూపించింది. నాలుగో రోజు రూ.14.30 కోట్లు, ఐదో రోజు రూ.12.75 కోట్లు, ఆరో రోజు రూ.10.70 కోట్లు, ఏడో రోజు రూ.8.10 కోట్లు వసూలు చేసింది. దీంతో తొలి వారం ముగిసే సమయానికి రూ.113.85 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు చేసింది.

Karuppu Day 17 expected box office collections Suriya Breaks Vijay s Varisu Record with Massive Run

ఇంతటి భారీ ఓపెనింగ్ తర్వాత రెండో వారంలో కలెక్షన్లు తగ్గుతాయని చాలా మంది భావించారు. కానీ సూర్య సినిమా అక్కడ కూడా సత్తా చాటింది. రెండో శుక్రవారం రూ.7.80 కోట్లు, శనివారం రూ.12.45 కోట్లు, ఆదివారం రూ.14.75 కోట్లు రాబట్టింది. వీకెండ్ తర్వాత కూడా సినిమా మంచి వసూళ్లను కొనసాగించింది. సోమవారం రూ.5.90 కోట్లు, మంగళవారం రూ.4.45 కోట్లు, బుధవారం రూ.4 కోట్లు, గురువారం రూ.4.95 కోట్లు వసూలు చేసింది. మొత్తంగా రెండో వారంలోనే రూ.54.30 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించి తన బాక్సాఫీస్ స్టామినాను నిరూపించింది.

మూడో వారంలోకి అడుగుపెట్టిన తర్వాత కూడా 'కరుప్పు' కలెక్షన్లు ఏ మాత్రం తగ్గలేదు. 16వ రోజు 'కరుప్పు' ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.5.15 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించింది. అంతకుముందు రోజు అయిన 15వ రోజు రూ.3.25 కోట్లను మాత్రమే వసూలు చేసిన ఈ సినిమా, శనివారం ఒక్కసారిగా 58 శాతానికి పైగా గ్రోత్ నమోదు చేసింది.

దీంతో 16 రోజుల్లో కరుప్పు సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద మొత్తం నెట్ కలెక్షన్లు రూ.176.55 కోట్లు నమోదయ్యాయి. గ్రాస్ కలెక్షన్ల పరంగా చూస్తే ఇండియాలోనే రూ.204 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇక తమిళనాడులో ఈ సినిమా సృష్టిస్తున్న ప్రభంజనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మొత్తం కలెక్షన్లలో అత్యధిక వాటా తమిళ వెర్షన్ నుంచే వచ్చిందే. ప్పటివరకు తమిళంలో రూ.150.66 కోట్ల నెట్ కలెక్షన్ అందుకోగా.. తెలుగు వెర్షన్ నుంచి రూ.26.72 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించింది.

ఇక ఓవర్సీస్ లో కూడా 'కరుప్పు' దూసుకుపోతోంది. ముఖ్యంగా అమెరికా, యూకే, గల్ఫ్ దేశాల్లో సూర్య సినిమాకు మంచి ఆదరణ లభిస్తోంది. 16వ రోజు ఓవర్సీస్‌లో మరో రూ.2 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా.. ఇప్పటివరకు మొత్తం రూ.77.75 కోట్ల ఓవర్సీస్ కలెక్షన్లు సాధించింది. భారత్ గ్రాస్ రూ.204.21 కోట్లు, విదేశీ వసూళ్లు రూ.77.75 కోట్లు కలిపి ప్రపంచవ్యాప్తంగా మొత్తం రూ.281.96 కోట్ల గ్రాస్ కలెక్షన్లను నమోదు చేసింది. ప్రస్తుతం ఈ సినిమా రూ.300 కోట్ల క్లబ్‌కు కేవలం రూ.18 కోట్ల దూరంలో మాత్రమే ఉంది.

ఇక 17 రోజు(ఆదివారం) అంచనా కలెక్షన్స్ చూస్తే.. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ. 6 కోట్ల నుంచి 7 కోట్ల వరకు నెట్ కలెక్షన్లు సాధించే అవకాశముంది. ఇక ఓవర్సీర్ లో రూ. 2 కోట్ల వరకు కలెక్ట్ చేసే అవకాశముంది. ఈ లెక్కన చూస్తే.. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.185 కోట్ల నెట్ కలెక్షన్లు, గ్రాస్ కలెక్షన్ల పరంగా రూ.210 కోట్లకు పైగా వసూలు చేసే అవకాశముందట. ప్రపంచ వ్యాప్తంగా రూ. 300 కోట్లపైగా వసూలు చేసే అవకాశముందట. ఈ వసూళ్లను బట్టి చూస్తే త్వరలోనే ఈ మైలురాయిని అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. రూ.130 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికే భారీ లాభాల్లోకి వెళ్లింది. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం ప్రస్తుతం రూ.50 కోట్లకు పైగా లాభాలు అందుకున్నట్టు తెలుస్తోంది.

మరో ఆసక్తికర అంశం ఏమిటంటే.. దళపతి విజయ్ నటించిన 'వారిసు' సినిమా ఇండియాలో రూ.178.14 కోట్ల నెట్ కలెక్షన్లతో తమిళ సినిమాల జాబితాలో టాప్-10లో ఉంది. 'కరుప్పు' ఆ రికార్డును నేడు బ్రేక్ చేసి టాప్ 10 సినిమాల్లో కరుప్పు చేరింది. మొత్తం మీద చూస్తే 'కరుప్పు' కేవలం మరో హిట్ సినిమా మాత్రమే కాదు.. సూర్య కెరీర్‌లో భారీ విజయం అందుకున్న సినిమాల్లో ఒకటిగా నిలుస్తోంది. మరికొన్ని రోజుల్లో మరిన్ని రికార్డులను కూడా బద్దలు కొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Read more about: box office report Karuppu suriya
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X