Karuppu Day 2 Box Office Collection: బాక్సాఫీస్ వద్ద కరుప్పు వసూళ్ల వేట..సూర్య మూవీకి ఎన్ని కోట్లంటే?

Karuppu Box Office Collection: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించి మోస్ట్ అవేటెడ్ యాక్షన్ డ్రామా 'కరుప్పు'(Karuppu). 'కంగువా', 'రెట్రో' వంటి సినిమాలు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడంతో ఈసారి ఎలాగైనా బాక్సాఫీస్ వద్ద బలమైన హిట్ సాధించాలని సూర్య గట్టిగా ఫోకస్ పెట్టారు. అందుకే ఈసారి ప్రయోగాల జోలికి వెళ్లకుండా, తనకు బాగా కలిసొచ్చిన మాస్ యాక్షన్ ఫార్ములాతో 'కరుప్పు' (తెలుగులో వీరభధ్రుడు)తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా మే15న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ నేపథ్యంలో కరుప్పు బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ఈవెన్ టార్గెట్ ఎంత? ఈ సినిమా ఎంత కలెక్ట్ చేసింది? రెండో రోజు కలెక్షన్లు ఎన్నికోట్లంటే? అనే వివరాల్లోకి వెళితే..

కరుప్పు సినిమాని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్‌.ఆర్‌. ప్రభు, ఎస్‌.ఆర్‌. ప్రకాశ్ బాబు నిర్మించగా, దర్శకత్వ బాధ్యతలు ఆర్ జే బాలజీ చేపట్టారు. హీరోయిన్‌గా త్రిష నటించగా, యోగి బాబు, ఇంద్రన్స్, నట్టి సుబ్రహ్మణ్యం, మన్సూర్ అలీఖాన్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. సాయి అభయంకర్ సంగీతం అందించగా, జీకే విష్ణు సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తించారు.

Karuppu day 2 expected box office collections worldwide Suriya-Trisha s Film Collections

ఇక బడ్జెట్ విషయానికి వస్తే, ఈ సినిమాను దాదాపు రూ.130 కోట్ల భారీ వ్యయంతో నిర్మించినట్లు సమాచారం. స్టార్ క్యాస్టింగ్, టాప్ టెక్నీషియన్స్, హై ప్రొడక్షన్ వాల్యూస్ అన్ని కలిపి సినిమాను గ్రాండ్‌గా తీర్చిదిద్దారు. ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ పరంగా కూడా 'కరుప్పు'స్ట్రాంగ్ రికార్డులు సృష్టించింది. ఓటీటీ హక్కులు సుమారు రూ.35 కోట్లకు అమ్ముడవ్వగా, శాటిలైట్ రైట్స్ ప్రముఖ ఛానెల్ దక్కించుకుంది. మొత్తం మీద థియేట్రికల్‌గా ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.110 కోట్ల బిజినెస్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ లెక్కల ప్రకారం సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే కనీసం రూ.115 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంటుంది.

ఇక కలెక్షన్ల పరంగా చూస్తే.. ఈ మూవీ తొలి రోజు పాజిటివ్ టాక్ అందుకుంది. మొదటి రోజు కలెక్షన్స్ విషయానికి వస్తే, దేశవ్యాప్తంగా 4,891 షోల ద్వారా రూ.14.40 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టి, ఇండియా గ్రాస్ రూ.16.66 కోట్లకు చేరింది. ఇక ఓవర్సీస్ నుంచి మరో రూ.4 కోట్లు రాబట్టడంతో, మొదటి రోజే వరల్డ్‌వైడ్‌గా రూ.20.66 కోట్ల మార్క్‌ను ఈ సినిమా దాటింది. ఇది సూర్య కెరీర్‌లో ఇటీవల కాలంలో మంచి ఓపెనింగ్‌గా చెప్పుకోవచ్చు.

ప్రాంతాల వారీగా చూస్తే, తమిళనాడు ఈ సినిమాకు ప్రధాన మార్కెట్‌గా నిలిచింది. అక్కడే అత్యధికంగా రూ.10.50 కోట్ల గ్రాస్ మొదటి రోజే వచ్చింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు కలిపి రూ.2.75 కోట్లు, కర్ణాటక నుంచి రూ.2 కోట్లు, కేరళ నుంచి రూ.1.25 కోట్లు వచ్చాయి. రెస్ట్ ఆఫ్ ఇండియా నుంచి రూ.16 లక్షల మేర మాత్రమే కలెక్షన్లు నమోదయ్యాయి.

ఇక రెండో రోజు కలెక్షన్లు ఊహించినట్లుగానే పెరగవచ్చు. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం, 'కరుప్పు' రెండో రోజు సుమారు రూ.15 కోట్ల నెట్ కలెక్షన్ సాధించవచ్చనీ, దీంతో మొత్తం నెట్ కలెక్షన్స్ రూ.30 కోట్లకు, గ్రాస్ సుమారు రూ.34 కోట్లకు చేరే అవకాశముందని అంచనా. మంచి మౌత్ టాక్ వస్తే ఈ సినిమా కలెక్షన్లు మరింత పుంజుకునే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఇక సూర్య ఈ సినిమాతో మళ్లీ హిట్ ట్రాక్‌లోకి వస్తాడా? అన్నది వచ్చే రోజుల్లో స్పష్టమవుతుంది.

Read more about: Karuppu suriya box office report
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X