Karuppu Day 3 Box Office Collection: 100 కోట్లకు చేరువలో కరుప్పు.. సూర్య మూవీకి 3వ రోజు ఎన్ని కోట్లంటే?

Karuppu Box Office Collection: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన మోస్ట్ అవేటెడ్ యాక్షన్ డ్రామా 'కరుప్పు' ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌తో స్టెడీగా దూసుకెళ్తోంది. కంగువా', 'రెట్రో' వంటి సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో ఈసారి ఎలాగైనా సాలిడ్ హిట్ అందుకోవాలని సూర్య గట్టిగా ఫోకస్ పెట్టారు. అందుకే ప్రయోగాలకంటే మాస్ యాక్షన్ ఫార్ములాను ఎంచుకుని 'కరుప్పు' (తెలుగులో 'వీరభద్రుడు')తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మే 15న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం, మొదటి షో నుంచే మంచి టాక్ సంపాదించుకోవడం విశేషం. ఈ నేపథ్యంలో కరుప్పు బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ఈవెన్ టార్గెట్ ఎంత? మూడు రోజు కలెక్షన్లు ఎన్నికోట్లంటే? అనే వివరాల్లోకి వెళితే..

డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్‌.ఆర్‌. ప్రభు, ఎస్‌.ఆర్‌. ప్రకాశ్ బాబు నిర్మించిన ఈ సినిమాకు ఆర్ జే బాలజీ దర్శకత్వం వహించారు. త్రిష హీరోయిన్‌గా నటించగా, యోగి బాబు, ఇంద్రన్స్, నట్టి సుబ్రహ్మణ్యం, మన్సూర్ అలీఖాన్ వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. సాయి అభయంకర్ సంగీతం, జీకే విష్ణు విజువల్స్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

Karuppu day 3 expected box office collections worldwide Suriya-Trisha s Film Collections

బడ్జెట్ పరంగా ఈ సినిమా భారీ స్థాయిలో తెరకెక్కింది. దాదాపు రూ.130 కోట్లతో నిర్మించిన ఈ ప్రాజెక్ట్, ప్రొడక్షన్ వాల్యూస్ పరంగా ఎక్కడా తగ్గకుండా గ్రాండ్‌గా రూపొందించారు. ప్రీ రిలీజ్ బిజినెస్ పరంగా కూడా 'కరుప్పు' మంచి స్ట్రెంగ్త్ చూపించింది. ఓటీటీ హక్కులు సుమారు రూ.35 కోట్లకు అమ్ముడవ్వగా, శాటిలైట్ రైట్స్ కూడా భారీ ధరకు విక్రయమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ బిజినెస్ దాదాపు రూ.110 కోట్లకు చేరినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ లెక్కల ప్రకారం సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే కనీసం రూ.115 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంటుంది.

ఇక కలెక్షన్ల విషయానికి వస్తే, కరుప్పు సినిమా విడుదలకు ముందు మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా, థియేటర్లలోకి వచ్చిన తర్వాత కూడా పాజిటివ్ టాక్‌తో కలెక్షన్ల పరంగా మంచి రన్ కొనసాగిస్తోంది. మొదటి రోజే స్ట్రాంగ్ ఓపెనింగ్ సాధించిన 'కరుప్పు' రూ.15.50 కోట్ల నెట్ కలెక్షన్లు రాబట్టింది. రెండో రోజు (శనివారం) భారీ జంప్ తీసుకుంటూ 50 శాతానికి పైగా వృద్ధి నమోదు చేసి రూ.23.40 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. మొత్తం 6,288 షోలలో 56.8% ఆక్యుపెన్సీ నమోదు కావడం చూస్తే ఈ సినిమాపై ఎలాంటి బజ్ నెలకొందో తెలుస్తోంది. దీంతో రెండు రోజుల్లోనే ఇండియన్ బాక్సాఫీస్ వద్ద నెట్ రూ.38.90 కోట్లకు, గ్రాస్ రూ.45.04 కోట్లకు చేరింది.

ప్రాంతాల వారీగా చూస్తే తమిళ వెర్షన్‌నే ప్రధానంగా ముందంజలో ఉంది. రెండో రోజు మాత్రమే తమిళనాడులో రూ.19.75 కోట్ల గ్రాస్‌తో 64% ఆక్యుపెన్సీ నమోదు కాగా, తెలుగు వెర్షన్ రూ.3.65 కోట్లతో 37% ఆక్యుపెన్సీ సాధించింది. ఇది తమిళ మార్కెట్‌లో సూర్య క్రేజ్ ఇంకా స్ట్రాంగ్ గా ఉందని తెలుస్తోంది. ఇక ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా 'కరుప్పు'కు మంచి స్పందన లభిస్తోంది. రెండో రోజే విదేశాల్లో సుమారు రూ.10 కోట్ల వసూళ్లు సాధించగా, మొత్తం ఓవర్సీస్ కలెక్షన్ రూ.21 కోట్లకు చేరింది. ప్రపంచవ్యాప్తంగా రెండు రోజుల్లోనే రూ.66 కోట్లకు సమీపంగా గ్రాస్ రాబట్టింది.

ఇక మూడో రోజు (ఆదివారం)కూడా ఇదే తరహా స్ట్రాంగ్ కలెక్షన్స్ అందుకునే అవకాశముంది. అంచనాల ప్రకారం, ఈ మూవీ రూ.15 కోట్ల నెట్ కలెక్షన్ సాధించవచ్చనీ అంచనా. దీంతో మొత్తం మూడు రోజుల ఇండియన్ బాక్సాఫీస్ వద్ద నెట్ రూ. 60 కోట్లకు, గ్రాస్ రూ.72 కోట్లకు చేరే అవకాశముంది. అలాగే.. ప్రపంచవ్యాప్తంగా రూ.85కోట్లకు వరకు గ్రాస్ రాబట్టే అవకాశముందని అంచనా..

వికెండ్ ముగిసే సరికి ఈ సినిమా సేఫ్ జోన్ వైపు దూసుకెళ్తుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. యాక్షన్, ఎమోషన్, ఫాంటసీ ఎలిమెంట్స్ కలగలిపిన 'కరుప్పు' ప్రేక్షకులను ఆకట్టుకుంటూ బాక్సాఫీస్ వద్ద స్టెడీ రన్ కొనసాగిస్తోంది. రాబోయే వర్కింగ్ డేస్‌లో కూడా ఇదే జోరు కొనసాగిస్తే, ఈ సినిమా సూర్యకు ఒక మంచి కంబ్యాక్ హిట్‌గా నిలిచే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Read more about: Karuppu suriya box office report
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X