Karuppu Day 5 Collection: జోరు తగ్గని కరుప్పు.. సూర్య మూవీకి ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?
Karuppu Box Office Collection: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya)నటించిన మోస్ట్ అవేటెడ్ యాక్షన్ డ్రామా కరుప్పు (Karuppu). ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌తో స్టెడీగా దూసుకెళ్తోంది. ఆర్.జే. బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫాంటసీ యాక్షన్ డ్రామా విడుదలైన మొదటి రోజు నుంచే మంచి టాక్ సంపాదించుకుంది. వర్కింగ్ డేస్ లో కూడా భారీ వసూళ్లు సాధిస్తోంది. ముఖ్యంగా ఈ సినిమా సూర్య కెరీర్‌లోనే హయ్యెస్ట్ గ్రాసింగ్ మూవీగా నిలిచే దిశగా దూసుకుపోతుండటం విశేషం. ఈ నేపథ్యంలో కరుప్పు బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ఈవెన్ టార్గెట్ ఎంత? మూడు రోజు కలెక్షన్లు ఎన్నికోట్లంటే? అనే వివరాల్లోకి వెళితే..
డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై SR.ప్రభు, S.R.ప్రకాష్ బాబు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకి R.J.బాలాజీ దర్శకత్వం వహించారు. ఇందులో త్రిష కృష్ణన్ హీరోయిన్‌గా నటించగా, యోగి బాబు, ఇంద్రన్స్, నట్టి సుబ్రమణ్యం, మన్సూర్ అలీ ఖాన్ కీలక పాత్రల్లో కనిపించారు. సంగీతాన్ని సాయి అభయంకర్ అందించారు, సినిమాటోగ్రఫీ బాధ్యతలను జీకే విష్ణు నిర్వర్తించారు. వీరి కాంబినేషన్ సినిమాకు మంచి టెక్నికల్ రిచ్‌నెస్ అందించింది. నిర్మాణ పరంగా ఈ చిత్రం భారీ స్థాయిలో రూపొందించబడింది. సుమారు రూ.130 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ ప్రాజెక్ట్‌లో ప్రొడక్షన్ వాల్యూస్‌కు ఎక్కడా రాజీ పడకుండా గ్రాండ్‌గా మలిచారు.

బిజినెస్ పరంగా కూడా 'కరుప్పు'భారీ డీల్ సెట్ అయ్యింది. ఓటీటీ హక్కులు దాదాపు రూ.35 కోట్లకు అమ్ముడవ్వగా, శాటిలైట్ హక్కులు కూడా ధరకు విక్రయమైనట్లు సమాచారం. ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ రైట్స్ విలువ సుమారు రూ.110 కోట్లకు చేరినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ లెక్కల ప్రకారం సినిమా పూర్తి స్థాయిలో లాభాల్లోకి రావాలంటే కనీసం రూ.115 కోట్ల షేర్ సాధించాల్సి ఉంటుంది. దీంతో బాక్సాఫీస్ రన్‌లో ఈ టార్గెట్‌ను చేరుతుందా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఇక కలెక్షన్ల విషయానికి వస్తే, కరుప్పు సినిమా విడుదలకు ముందు మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా, థియేటర్లలోకి వచ్చిన తర్వాత కూడా పాజిటివ్ టాక్‌తో కలెక్షన్ల పరంగా మంచి రన్ కొనసాగిస్తోంది. మొదటి రోజే స్ట్రాంగ్ ఓపెనింగ్ సాధించిన 'కరుప్పు' రూ.15.50 కోట్ల నెట్ కలెక్షన్లు రాబట్టింది. రెండో రోజు (శనివారం) భారీ జంప్ తీసుకుంటూ 50 శాతానికి పైగా వృద్ధి నమోదు చేసి రూ.23.40 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. దీంతో రెండు రోజుల్లోనే ఇండియన్ బాక్సాఫీస్ వద్ద నెట్ రూ.38.90 కోట్లకు, గ్రాస్ రూ.45.04 కోట్లకు చేరింది.
ఇక విడుదలైన నాలుగు రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.141.30 కోట్ల గ్రాస్ వసూళ్లు నమోదు చేసి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. దీంతో సూర్య కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా, సింగం 2 రికార్డును అధిగమించింది. ఇక ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.82.30 కోట్ల నెట్, రూ.95.30 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. తమిళనాడులోనే సుమారు రూ.58 కోట్లు రాబట్టింది. ఓవర్సీస్‌లో రూ.46 కోట్లకు పైగా వసూలు చేసి గ్లోబల్ మార్కెట్‌లో కూడా సత్తా చాటింది. వీకెండ్ తర్వాత కూడా స్ట్రాంగ్ హోల్డ్ కొనసాగించిన ఈ సినిమా, ఇక నాలుగో రోజు(సోమవారం) రోజే రూ.14.30 కోట్లకు పైగా వసూలు చేయడం విశేషం.
ఇక కరుప్పు మూవీ ఐదో రోజు ఇండియాలో సుమారు రూ.10 కోట్ల నెట్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో మొత్తం ఇండియా నెట్ కలెక్షన్స్ రూ.93.67 కోట్లకు చేరుకోగా, గ్రాస్ కలెక్షన్స్ దాదాపు రూ.105 కోట్లను తాకాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,600కు పైగా షోలతో ప్రదర్శింపబడుతున్న ఈ సినిమా, దీంతో ఇండియా నెట్ కలెక్షన్లతో రూ.100 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టినట్టు తెలుస్తోంది. మరోవైపు విదేశాల్లో దాదాపు రూ.47 కోట్ల వసూళ్లు నమోదు కావడంతో, వరల్డ్‌వైడ్‌గా ' కరుప్పు' రూ.142.30 కోట్ల గ్రాస్‌ను దాటే అవకాశముంది. ఇదే ట్రెండ్ కొనసాగితే, త్వరలోనే కరుప్పు రూ.150 కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయమని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications



