Karuppu Day 6 Box Office: బాక్సాఫీస్‌పై వీరభద్రుడి ఉగ్రరూపం.. కరుప్పు వరల్డ్ వైడ్ కలెక్షన్లు ఎన్ని కోట్లంటే?
సౌత్ స్టార్ హీరో సూర్య, హీరోయిన్ త్రిషా కృష్ణన్ నటించిన తాజా చిత్రం కరుప్పు. యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాకు ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ఆర్ ప్రభు, ఎస్ఆర్ ప్రకాశ్ బాబు నిర్మించారు. ఈ చిత్రంలో ఆర్జే బాలాజీ, ఇంద్రాన్స్, స్వసిక విజయ్, శివాడ నాయర్, అనఘా మాయ, సుప్రీత్ రెడ్డి, యోగిబాబు, మన్సూర్ ఆలీ ఖాన్, జార్జ్ మార్యన్, ఆడుకాలమ్ నరేన్, జాఫర్ సాధిక్ తదితరులు నటించారు.
ఈ చిత్రానికి సంబంధించిన సాంకేతిక నిపుణుల వివరాల్లో వెళితే.. సినిమాటోగ్రఫి: జీకే విష్ణు, ఎడిటింగ్: ఆర్ కళైవన్నన్, మ్యూజిక్ం సాయి అభయంకర్, స్టంట్స్: విక్రమ్ మోర్ తమ బాధ్యతలు నిర్వర్తించారు. ఈ చిత్రం మే 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అయింది. ఈ సినిమా గత 3 రోజులుగా వసూలు చేసిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

సూర్య, త్రిష కృష్ణన్ లాంటి అగ్రతారలతో రూపొందించిన ఈ చిత్రాన్ని ఖర్చుకు వెనుకాడకుండా నిర్మించారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్లు, ప్రమోషనల్ ఖర్చులనీ కలిపి ఈ సినిమాను సుమారుగా 140 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరిగింది. ఈ సినిమా ఆంధ్రా, తెలంగాణ ప్రాంతపు థియేట్రికల్ రైట్స్ 7 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి. తమిళనాడులో 100 కోట్ల మేర బిజినెస్, కన్నడలో 10 కోట్లు, కేరళలో 5 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది.
తెలుగులో వీరభద్రుడి ఉగ్రరూపం
తెలుగు రాష్ట్రాల్లో వీరభద్రుడు టైటిల్‌తో రిలీజైన సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తొలి రోజు 3 కోట్ల రూపాయల నెట్, రెండో రోజు 4.5 కోట్ల రూపాయల నెట్, మూడో రోజు 5 కోట్ల రూపాయల నెట్, నాలుగవ రోజు 2.5 కోట్ల రూపాయల నెట్, ఐదో రోజు 2.5 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్లను సాధించింది. గత ఐదు రోజుల్లో 17.5 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్లను ఆంధ్రా, నైజాంలో వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
తమిళంలో 100 కోట్ల రేసులో
తమిళనాడులో సూర్య మూవీకి మంచి ఆదరణ కనిపిస్తున్నది. ఈ చిత్రం తొలి రోజు 11.5 కోట్ల రూపాయలు, రెండో రోజు 17 కోట్ల రూపాయలు, మూడో రోజు 20 కోట్ల రూపాయలు, నాలుగో రోజు 11.5 కోట్ల రూపాయలు, ఐదో రోజు 10 కోట్ల రూపాయలు వసూలు చేసిది. దాంతో ఈ చిత్రం గత 5 రోజుల్లో 70 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్లను రాబట్టింది.
కన్నడ, మలయాళం, ఇతర రాష్ట్రాల్లో
ఇక దక్షిణాదిలో కన్నడ, కేరళ, అలాగే నార్త్ ఇండియాలో ఇతర ప్రాంతాల్లో కూడా ఈ సినిమాకు భారీ ఆదరణ దక్కుతున్నది. ఈ చిత్రం ఇప్పటి వరకు కన్నడలో 12.5 కోట్ల రూపాయలు, కేరళలో 9 కోట్ల రూపాయలు, ఇతర రాష్ట్రాల్లో 2 కోట్ల రూపాయలు 23.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం ఇండియాలో సుమారుగా 110 కోట్లకుపైగా నెట్ కలెక్షన్లను, 130 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు ధృవీకరించాయి.
ఓవర్సీస్‌లో ఎన్ని కోట్లంటే?
ఇక ఓవర్సీస్‌లో ఈ సినిమా వసూళ్ల తుఫాన్ క్రియేట్ చేస్తున్నది. పలు దేశాల్లో సూర్య కెరీర్‌లోనే అత్యధికంగా రికార్డు వసూళ్లను సాధిస్తున్నది. ఈ చిత్రం గత 5 రోజుల్లో 51 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా ఇండియాలో 130 కోట్ల గ్రాస్ కలెక్షన్లతో కలిపి మొత్తంగా 180 కోట్లకుపైగా గ్రాస్ కలెక్షన్లను నమోదు చేసింది. ఈ చిత్రం విడుదలైన ప్రతీ చోట స్ట్రాంగ్ ఆక్యుపెన్సీని కొనసాగిస్తున్నది అని డిస్ట్రిబ్యూటర్లు వెల్లడిస్తున్నారు.
6వ రోజు కలెక్షన్ల అంచనాతో
ఇక కరప్పు సినిమా ఆరో రోజు కూడా నిలకడగా వసూళ్లను నమోదు చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ చిత్రం ఇండియాలో 350 లోకేషన్లలో 1200 స్క్రీన్లలో 3700 షోలు ప్రదర్శిస్తున్నారు. ఇండియాలో ఈ చిత్రం 6వ రోజున 5.5 కోట్ల నుంచి 6 కోట్ల రూపాయల మేర కలెక్షన్లను సాధించే అవకాశం ఉంది. వరల్డ్ వైడ్‌గా 7 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. దాంతో ఈ చిత్రం ఓవరాల్‌గా 185 నుంచి 190 కోట్ల మేర కలెక్షన్లను నమోదు చేసే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.


Click it and Unblock the Notifications