Karuppu Day 7 Collection: సూర్య 'కరుప్పు'మూవీకి బాక్సాఫీస్ షేక్.. ఏడో రోజు ఊహించని కలెక్షన్స్!
Karuppu Box Office Collection: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన మోస్ట్ అవేటెడ్ యాక్షన్ డ్రామా 'కరుప్పు'. ఈ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌తో స్టెడీగా దూసుకెళ్తోంది. దర్శకుడు ఆర్.జే. బాలాజీ తెరకెక్కించిన ఈ ఫాంటసీ యాక్షన్ డ్రామా విడుదలైన మొదటి రోజు నుంచే మంచి రెస్పాన్స్ అందుకుంది. ముఖ్యంగా వర్కింగ్ డేస్‌లో కూడా స్ట్రాంగ్ కలెక్షన్స్ సాధిస్తూ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది.
ఈ సినిమా ఇప్పటికే సూర్య కెరీర్‌లోనే హయ్యెస్ట్ గ్రాసింగ్ మూవీగా నిలిచే దిశగా అడుగులు వేస్తోంది. థియేటర్లలో స్టెడీ హోల్డ్‌తో కలెక్షన్లు రాబడుతూ, ఫస్ట్ వీక్ ముగిసేలోపు భారీ నంబర్స్ నమోదు చేయడం విశేషం. వీకెండ్ తర్వాత డ్రాప్ ఉన్నా, కలెక్షన్లు మాత్రం వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కరుప్పు బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ఈవెన్ టార్గెట్ ఎంత? 7 రోజుల్లో కలెక్షన్లు ఎన్నికోట్లంటే? అనే వివరాల్లోకి వెళితే..

డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్.ఆర్. ప్రభు, ఎస్.ఆర్. ప్రకాష్ బాబు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో త్రిష కృష్ణన్ హీరోయిన్‌గా నటించగా, యోగి బాబు, ఇంద్రన్స్, నట్టి సుబ్రమణ్యం, మన్‌సూర్ అలీ ఖాన్ కీలక పాత్రలు పోషించారు. సంగీతాన్ని సాయి అభయంకర్ అందించగా, సినిమాటోగ్రఫీని జీకే విష్ణు నిర్వహించారు. టెక్నికల్‌గా ఈ సినిమా రిచ్‌గా ఉండటంతో విజువల్ ఎక్స్‌పీరియన్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. సుమారు రూ.130 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని నిర్మాణ పరంగా ఎక్కడా రాజీ పడకుండా గ్రాండ్‌గా మలిచారు. ఈ భారీ బడ్జెట్‌ను రికవర్ చేయడానికి సినిమా మంచి బిజినెస్ కూడా చేసుకుంది.
ఓటీటీ హక్కులు దాదాపు రూ.35 కోట్లకు అమ్ముడవ్వగా, శాటిలైట్ రైట్స్ కూడా భారీ ధరకు విక్రయమైనట్లు సమాచారం. ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ హక్కులు సుమారు రూ.110 కోట్లకు అమ్ముడైనట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ లెక్కల ప్రకారం 'కరుప్పు' బ్రేక్ ఈవెన్ సాధించాలంటే కనీసం రూ.115 కోట్ల షేర్ అవసరం. ప్రస్తుతం వస్తున్న కలెక్షన్స్ ట్రెండ్‌ను బట్టి చూస్తే ఈ టార్గెట్‌ను సినిమా సులభంగా దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఫస్ట్ వీక్‌లోనే భారీ గ్రాస్ సాధించడం, వర్కింగ్ డేస్‌లో కూడా స్టెడీగా కలెక్షన్స్ రావడం సినిమా లాభాల దిశగా పయనిస్తున్నట్టు సూచిస్తోంది.
'కరుప్పు' బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్లతో దూసుకెళ్తోంది. విడుదలైన మొదటి వారంలోనే ఈ సినిమా భారీ వసూళ్లు సాధిస్తూ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. ముఖ్యంగా వర్కింగ్ డేస్‌లో కూడా స్ట్రాంగ్ హోల్డ్ చూపించడం సినిమాకి ఉన్న క్రేజ్‌ను స్పష్టంగా చూపిస్తోంది. బుధవారం ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సుమారు రూ.11.75 కోట్లు వసూలు చేసింది. మంగళవారంతో పోలిస్తే కేవలం 17 శాతం మాత్రమే డ్రాప్ రావడం గమనార్హం. సాధారణంగా వర్కింగ్ డేస్‌లో భారీగా పడిపోయే కలెక్షన్లు ఇక్కడ స్థిరంగా ఉండటం ఈ సినిమాకి ఉన్న స్టామినాను తెలియజేస్తోంది. దీంతో ఆరు రోజుల మొత్తం వసూళ్లు సుమారు రూ.120.25 కోట్లకు చేరుకున్నాయి.
'కరుప్పు' ఇప్పటికే సూర్య కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. దాదాపు 13 ఏళ్లుగా కొనసాగుతున్న 'సింగం 2' రికార్డును ఈ సినిమా బ్రేక్ చేసింది. అంతేకాదు, ఈ మూవీ ఫుల్ రన్‌లో రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించే అవకాశముందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. అంటే, సూర్య గత రికార్డుతో పోలిస్తే ఇది రెట్టింపు వసూళ్లు సాధించే అవకాశం ఉంది.
డే-వైజ్ కలెక్షన్లు చూస్తే సినిమా ఓపెనింగ్ నుంచి స్ట్రాంగ్‌గా కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. శుక్రవారం రూ.19 కోట్లు, శనివారం రూ.27 కోట్లు, ఆదివారం రూ.31.75 కోట్లు సాధించి వీకెండ్‌లో భారీ జోష్ చూపించింది. ఆ తర్వాత సోమవారం రూ.16.50 కోట్లు, మంగళవారం రూ.14.25 కోట్లు, బుధవారం రూ.11.75 కోట్లు వసూలు చేసి వర్కింగ్ డేస్‌లో కూడా మంచి స్థాయిలో నిలబడింది.
తమిళనాడులో ఈ సినిమా ప్రత్యేకంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. బుధవారం ఒక్కరోజే అక్కడ రూ.8 కోట్లు వసూలు చేసి, నాన్-హాలిడే డేస్‌లో మూడో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ విషయంలో 'విక్రమ్', 'లియో' చిత్రాల తరువాతి స్థానాన్ని దక్కించుకుంది. ప్రాంతాల వారీగా చూసినా 'కరుప్పు' మంచి కలెక్షన్లు రాబడుతోంది. తమిళనాడులో రూ.75.50 కోట్లు, ఆంధ్రప్రదేశ్-తెలంగాణలో రూ.18.85 కోట్లు, కర్ణాటకలో రూ.13.75 కోట్లు, కేరళలో రూ.10.25 కోట్లు, మిగతా భారతదేశంలో రూ.1.90 కోట్లు వసూలు చేసింది. ఇక గ్రాస్ కలెక్షన్స్ పరంగా చూస్తే.. ఇప్పటికే ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.121 కోట్లకు పైగా వసూలు చేసింది. వరల్డ్‌వైడ్‌గా ఈ మూవీ రూ.175 కోట్ల మార్క్‌ను చేరుకుని రూ.200 కోట్ల క్లబ్ వైపు దూసుకెళ్తోంది.
ఇక ఏడో రోజు ( గురువారం) అంచనా కలెక్షన్లు చూస్తే.. ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 10 కోట్ల వరకు వసూలు చేసే అవకాశముంది. మంగళవారంతో పోలిస్తే కేవలం 15 శాతం మాత్రమే డ్రాప్. సాధారణంగా వర్కింగ్ డేస్‌లో భారీగా పడిపోయే కలెక్షన్లు ఇక్కడ స్థిరంగా ఉండటం ఈ సినిమాకి ఉన్న స్టామినాను తెలియజేస్తోంది. దీంతో 7 రోజుల ఇండియన్ బాక్సాఫీస్ వద్ద మొత్తం వసూళ్లు సుమారు రూ.130 కోట్లకు చేరుకున్నాయి. వర్డల్ వైడ్ రూ. 190 కోట్ల వరకు వసూలు చేసే అవకాశముంది. మొత్తంగా చూస్తే, 'కరుప్పు' కేవలం ఓపెనింగ్ హిట్ మాత్రమే కాదు... సూర్య కెరీర్‌ను కొత్త స్థాయికి తీసుకెళ్లిన బ్లాక్‌బస్టర్‌గా నిలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇదే ట్రెండ్ కొనసాగితే త్వరలోనే ఈ సినిమా రూ.200 కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications






