Karuppu Day 8 Collection: బాక్సాఫీస్ వద్ద వీరభద్రుడు జోరు.. సూర్య మూవీకి ఎన్ని కోట్లంటే?

Karuppu Box Office Collection: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన మోస్ట్ అవేటెడ్ యాక్షన్ డ్రామా 'కరుప్పు' (వీరభద్రుడు) బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ రన్ కొనసాగుతోంది. విడుదలైన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా, వర్కింగ్ డేస్‌లో కూడా తగ్గకుండా మంచి కలెక్షన్స్ సాధించడం విశేషం. వీకెండ్ తర్వాత సాధారణంగా వచ్చే డ్రాప్ కనిపించడం, సినిమా స్థిరంగా వసూళ్లు రాబడుతూ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. ఈ ట్రెండ్‌ను బట్టి చూస్తే 'కరుప్పు' సూర్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచే దిశగా దూసుకెళ్తోందని చెప్పాలి. ఈ నేపథ్యంలో సూర్య సినిమా ఎన్ని కోట్లు వసూలు చేసింది? 8 రోజు కలెక్షన్లు ఎంత? అనే వివరాల్లోకెళ్తే..

దర్శకుడు RJ బాలాజీ తెరకెక్కించిన ఈ ఫాంటసీ యాక్షన్ డ్రామాను డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్.ఆర్. ప్రభు, ఎస్.ఆర్. ప్రకాష్ బాబు నిర్మించారు. త్రిష కృష్ణన్ హీరోయిన్‌గా నటించగా, యోగి బాబు, ఇంద్రన్స్, నటరాజన్ సుబ్రమణ్యం, మన్సూర్ అలీ ఖాన్ వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించారు. సంగీతాన్ని సాయి అభయంకర్ అందించగా, సినిమాటోగ్రఫీని జీకే విష్ణు చేశారు. టెక్నికల్‌గా ఈ సినిమా రిచ్‌గా ఉండటం వల్ల, విజువల్స్ గ్రాండ్‌గా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

Karuppu day 8 expected box office collections worldwide Suriya-Trisha s Film Collections

సుమారు రూ.130 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ నిర్మాణ పరంగా ఎక్కడా రాజీ పడకుండా గ్రాండ్‌గా మలిచారు. ఈ భారీ బడ్జెట్‌ను రికవర్ కోసం మంచి ప్రీ-రిలీజ్ బిజినెస్ కూడా చేసింది. ఓటీటీ హక్కులు దాదాపు రూ.35 కోట్లకు అమ్ముడవ్వగా, శాటిలైట్ రైట్స్ కూడా మంచి ధరకు విక్రయమైనట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ హక్కులు సుమారు రూ.110 కోట్లకు వెళ్లినట్లు సమాచారం. ఈ లెక్కల ప్రకారం 'కరుప్పు' బ్రేక్ ఈవెన్ సాధించాలంటే కనీసం రూ.115 కోట్ల షేర్ అవసరం.ప్రస్తుతం కలెక్షన్లను గమనిస్తే, ఈ టార్గెట్‌ను సినిమా ఈజీగా దాటేంది. ఫస్ట్ వీక్‌లోనే భారీ గ్రాస్ వసూళ్లు నమోదు చేసింది. ఇప్పటికే 'కరుప్పు' సూర్య కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలవడం విశేషం.

కరుప్పు కలెక్షన్ల పరంగా బాక్సాఫీస్ వద్ద తన దూకుడు కొనసాగుతోంది. విడుదలైన మొదటి వారం ముగిసేసరికి ఈ సినిమా ఇటు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద, అటు ఓవర్సీస్ లోనూ మంచి వసూళ్లు రాబట్టుతూ ట్రేడ్ వర్గాలను ఆశ్యర్చపరస్తోంది. ప్రముఖ ట్రేడ్ ట్రాకింగ్ వెబ్‌సైట్ సక్నిల్క్ (Sacnilk)వివరాల ప్రకారం.. ఈ మూవీ 7వ రోజు ఇండియాలో రూ. 8.30 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఆరో రోజు వసూళ్లలో దాదాపు 22.4 శాతం తగ్గుదల నమోదు చేసింది. ఆరో రోజు రూ. 10.70 కోట్లు వసూలు చేసిన ఇండియా ఈ సినిమా, ఇప్పటివరకు మొత్తం నెట్స్ కలెక్షన్లు రూ.114.05 కోట్లకు చేరింది.

ఇక గ్రాస్ కలెక్షన్స్ విషయానికి వస్తే, ఏడు రోజుల్లో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద గ్రాస్ రూ. 132.05 కోట్లకు చేరింది. ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా మంచి రన్ కొనసాగుతోంది. 7వ రోజు మాత్రమే రూ. 3 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఈ సినిమా, ఓవర్సీస్‌లో మొత్తం రూ. 57 కోట్ల గ్రాస్. ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా 'కరుప్పు' సినిమా మొదటి వారం ముగిసేసరికి మొత్తం రూ. 207 కోట్ల గ్రాస్ వసూలు చేసి బ్లాక్ బస్టర్ దిశగా దూసుకెళ్తోంది. ఈ విజయానికి ప్రధాన కారణం తమిళ వెర్షన్ ప్రభావమే అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. 7వ రోజు మాత్రమే తమిళ వెర్షన్ నుంచి రూ. 7 కోట్ల నెట్ వసూళ్లు రావడం విశేషం. దాదాపు 3,599 షోలలో ప్రదర్శితమైన ఈ వెర్షన్‌కు 35 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది.

ఇక 8వ రోజు (శుక్రవారం)అంచనా కలెక్షన్లు చూస్తే.. ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 8 కోట్ల వరకు వసూలు చేసే అవకాశముంది. సాధారణంగా వర్కింగ్ డేస్‌లో భారీ డ్రాప్ కనిపించినా ఈ సినిమా మాత్రం స్థిరంగా కలెక్షన్స్ వసూలు చేస్తోంది. దీంతో 8 రోజుల నెట్ కలెక్షన్లు సుమారు రూ.120 కోట్లకు, గ్రాస్ కలెక్షన్లు రూ. 140 కోట్లకు చేరుకునే అవకాశముంది. అలాగే.. వైడ్ వైడ్ 220 కోట్లు కలెక్ట్ చేసే అవకాశం ఉంది. ఇక రాబోయే వీకెండ్ లో ఇదే ట్రెండ్ కొనసాగితే తర్వలోనే వర్డల్ వైడ్ గా రూ.250 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించే అవకాశముందని ట్రేడ్ అంచనా వేస్తోంది.

Read more about: suriya Karuppu box office report
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X