Karuppu Day 9 Collection: బాక్సాఫీస్‌పై కరుప్పు దండయాత్ర.. సూర్య మూవీకి ఎన్ని కోట్లంటే?

Karuppu Box Office Collection: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) నటించిన మోస్ట్ అవేటెడ్ యాక్షన్ డ్రామా కరుప్పు ( వీరభద్రుడు) బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా మొదటి రోజునుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో, వసూళ్ల పరంగా దూసుకెళ్తోంది. ముఖ్యంగా వర్కింగ్ డేస్‌లో కూడా కలెక్షన్స్ తగ్గకుండా స్టెడీగా కొనసాగడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. సాధారణంగా వీకెండ్ తర్వాత సినిమాలకు కలెక్షన్స్‌లో డ్రాప్ కనిపిస్తుంటుంది. కానీ, కరుప్పు మాత్రం ఆ ట్రెండ్‌ను బ్రేక్ చేస్తూ నిలకడగా ఆదాయం రాబడుతోంది. ఈ నేపథ్యంలో సూర్య సినిమా ఎన్ని కోట్లు వసూలు చేసింది? 9 రోజు కలెక్షన్లు ఎంత? అనే వివరాల్లోకెళ్తే..

ఈ సినిమాను దర్శకుడు RJ బాలాజీ తెరకెక్కించగా, డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్.ఆర్. ప్రభు, ఎస్.ఆర్. ప్రకాష్ బాబు నిర్మించారు. కథలో యాక్షన్, ఫాంటసీ ఎలిమెంట్స్‌ను మేళవిస్తూ రూపొందించిన ఈ సినిమా ప్రేక్షకులను అన్ని వర్గాల్లో ఆకట్టుకుంటోంది. హీరోయిన్‌గా త్రిష నటించగా, యోగి బాబు, ఇంద్రన్స్, నటరాజన్ సుబ్రమణ్యం, మన్సూర్ అలీ ఖాన్ వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించారు. టెక్నికల్‌గా కూడా సినిమా హై స్టాండర్డ్స్‌ను మెయింటైన్ చేసింది. సంగీత దర్శకుడు సాయి అభయంకర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రాఫర్ జీకే విష్ణు విజువల్స్ అన్ని కలిసి సినిమాకు గ్రాండ్ ఫీల్‌ను తీసుకొచ్చాయి.

Karuppu day 9 expected box office collections worldwide Suriya-Trisha s Film Collections

దాదాపు రూ.130 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా, నిర్మాణ పరంగా ఎక్కడా రాజీ పడకుండా రూపొందించబడింది. ఈ బడ్జెట్‌ను రికవర్ చేయడానికి ముందుగానే మంచి ప్రీ-రిలీజ్ బిజినెస్ కూడా చేసుకుంది. ఓటీటీ హక్కులు సుమారు రూ.35 కోట్లకు అమ్ముడవ్వగా, శాటిలైట్ హక్కులు కూడా మంచి ధరకు వెళ్లినట్లు సమాచారం. ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ హక్కులు దాదాపు రూ.110 కోట్లకు అమ్ముడవడంతో, సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే కనీసం రూ.115 కోట్ల షేర్ అవసరం అయ్యింది.

ఇక కరుప్పు కలెక్షన్ల పరంగా బాక్సాఫీస్ వద్ద తన దూకుడు కొనసాగుతోంది. విడుదలైన మొదటి వారం ముగిసేసరికి ఈ సినిమా ఇటు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద, అటు ఓవర్సీస్ లోనూ భారీ వసూళ్లు రాబట్టుతూ ట్రేడ్ వర్గాలను ఆశ్యర్చపరస్తోంది. ప్రముఖ ట్రేడ్ ట్రాకింగ్ వెబ్‌సైట్ సక్నిల్క్ (Sacnilk)వివరాల ప్రకారం.. సూర్య మూవీ మొదటి వారం ముగిసే సమయానికి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.113.85 కోట్ల నెట్ కలెక్షన్లు నమోదు చేసిన ఈ సినిమా, 8వ రోజు కల్లా రూ.121.65 కోట్ల నెట్‌ను దాటింది. ఇందులో మెజారిటీ వసూళ్లు తమిళ వెర్షన్ నుంచే రావడం విశేషం. ప్రాంతాల వారీగా చూస్తే తమిళనాడులోనే ఈ సినిమా అత్యధికంగా రూ.91.80 కోట్ల వసూళ్లు రాబట్టి తన మాస్ రేంజ్‌ను మరోసారి నిరూపించింది.

తెలుగు రాష్ట్రాల్లో 'వీరభద్రుడు' పేరుతో విడుదలైన ఈ సినిమాకు కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. విదేశాల్లో కూడా 'కరుప్పు' దుమ్మురేపుతోంది. ఈ సినిమా రూ.21.83 కోట్ల కలెక్షన్స్ సాధించి మంచి మార్కెట్‌ను సొంతం చేసుకుంది. ఇక కర్ణాటకలో రూ.15 కోట్ల వరకు వసూళ్లు రాగా, కేరళలో కూడా రూ.10.35 కోట్లకు పైగా కలెక్షన్స్ రావడం విశేషం. ఇక హిందీ బెల్ట్, మిగతా ప్రాంతాల్లో కలిపి సుమారు రూ.2.30 కోట్ల వసూళ్లు నమోదయ్యాయి. ఇక ఓవర్సీస్ కూడా భారీ కలెక్షన్లు వసూలు చేసింది. ఈ మూవీ సుమారు రూ.59.35 కోట్ల గ్రాస్‌ను రాబట్టింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా రూ.200.86 కోట్ల గ్రాస్‌ను నమోదు చేసి, సూర్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.

ఇక 9వ రోజు (శనివారం) అంచనా కలెక్షన్లు చూస్తే.. ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సుమారు రూ.10 కోట్ల వరకు వసూలు చేసే అవకాశముంది. సాధారణంగా వర్కింగ్ డేస్‌లో భారీ డ్రాప్ కనిపించినా వీకెండ్ లో కలెక్షన్లు పెరిగే అవకాశం ఉంది. దీంతో 9 రోజుల నెట్ కలెక్షన్లు సుమారు రూ. 130 కోట్లకు, గ్రాస్ కలెక్షన్లు రూ. 150 కోట్లకు చేరుకునే అవకాశముంది. ఓవర్సీస్ మార్కెట్‌లో సుమారు రూ.65 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టింది. వర్డల్ వైడ్ రూ.270 కోట్లు కలెక్ట్ చేసే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులు చేసే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనాలు ఉన్నాయి. మొత్తంగా అన్ని ఏరియాల్లో స్టెడీగా రన్ అవుతున్న 'కరుప్పు' సినిమా, సూర్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచే దిశగా దూసుకెళ్తోంది.

Read more about: suriya Karuppu box office report
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X