Karuppu Business Wordwide: కరుప్పు వరల్డ్ వైడ్ బిజినెస్.. సూర్య సినిమాకు ఎన్ని కోట్లు వస్తే లాభాల్లోకి అంటే?
సౌత్ స్టార్ హీరో సూర్య, హీరోయిన్ త్రిషా కృష్ణన్ నటించిన తాజా చిత్రం కరుప్పు. యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాకు ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ఆర్ ప్రభు, ఎస్ఆర్ ప్రకాశ్ బాబు నిర్మించారు. ఈ చిత్రంలో ఆర్జే బాలాజీ, ఇంద్రాన్స్, స్వసిక విజయ్, శివాడ నాయర్, అనఘా మాయ, సుప్రీత్ రెడ్డి, యోగిబాబు, మన్సూర్ ఆలీ ఖాన్, జార్జ్ మార్యన్, ఆడుకాలమ్ నరేన్, జాఫర్ సాధిక్ తదితరులు నటించారు.
ఈ చిత్రానికి సంబంధించిన సాంకేతిక నిపుణుల వివరాల్లో వెళితే.. సినిమాటోగ్రఫి: జీకే విష్ణు, ఎడిటింగ్: ఆర్ కళైవన్నన్, మ్యూజిక్ం సాయి అభయంకర్, స్టంట్స్: విక్రమ్ మోర్ తమ బాధ్యతలు నిర్వర్తించారు. ఈ చిత్రం మే 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. అయితే ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఈ చిత్రం వరల్డ్ వైడ్ చేసిన బిజినెస్ ఎంత? ఈ మూవీకి జరిగిన ఓటీటీ బిజినెస్ ఎంత? ఈ మూవీ లాభాల్లోకి రావాలంటే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

సూర్య మూవీ బడ్జెట్
ఈ చిత్రం భారీ తారాగణం, టాప్ టెక్నిషియన్స్‌తో రిచ్‌గా,క్వాలిటీగా రూపొందించారు. యాక్షన్ సీన్లకు భారీగా ప్రాధాన్యం కల్పించారు. మాస్ ఎలిమెంట్స్, ఎలివేషన్స్‌ను క్రేజీగా ప్లాన్ చేశారు. దాంతో బడ్జెట్ భారీగానే అయిందని సినీ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమాలో నటించిన వారి పారితోషికం, టెక్నిషియన్ల రెమ్యునరేషన్లు, ప్రొడక్షన్ కాస్ట్, ప్రమోషనల్ ఖర్చులనీ కలిపి ఈ మూవీ బడ్జెట్ సుమారుగా 130 కోట్ల రూపాయలు అయిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఓటీటీ బిజినెస్ వివరాలు
ఇక సూర్య కెరీర్‌లో గత చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీగా బోల్తా కొట్టినప్పటికీ.. హీరో బ్రాండ్ వాల్యూ, మార్కెట్ ఏ మాత్రం చెక్కుచెదరలేదనే నమ్మకాన్ని ఈ సినిమా కలిగించింది. ఈ చిత్రం థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ భారీగా జరగడం చూస్తే సూర్యకు ఉన్న క్రేజ్ తెలియజేసింది. నాన్ థియేట్రికల్ విషయానికి వస్తే.. ఈ సినిమా 35 కోట్ల రూపాయలను ఓటీటీ రైట్స్ ద్వారా సంపాదించింది. శాటిలైట్ రైట్స్‌ను జీ సంస్థ సొంతం చేసుకొన్నది.
థియేట్రికల్ రైట్స్ వాల్యూ
ఈ చిత్రం థియేట్రికల్ రైట్స్ సుమారుగా 110 కోట్ల మేర జరిగిందని, తమిళ థియేట్రికల్ రైట్స్ 35 కోట్ల రూపాయల మేర అమ్ముడుపోయాయని ట్రేడ్ వర్గాల రిపోర్ట్. మ్యూజిక్ రైట్స్, ఇతర హక్కుల అమ్మకం ద్వారా భారీగా ఆదాయాన్ని రాబట్టింది. ఈ సినిమా రిలీజ్‌కు ముందే 85 శాతం రికవరీని సాధించిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?
తమిళంలో ఈ సినిమాను శక్తి ఫిల్మ్ ఫ్యాక్టరీ, తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్, కేరళలో ఎంపీ ఫిలింస్, కర్ణాటకలో కేవీఎన్ ప్రొడక్షన్స్, నార్త్ ఇండియాలో పెన్ స్టూడియోస్, ఓవర్సీస్‌లో ఫార్స్ ఫిల్మ్స్ రిలీజ్ చేస్తున్నది. ఈ సినిమా 115 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ జర్నీని మే 14వ తేదీన మొదలుపెట్టేందుకు రెడీ అవుతున్నది.


Click it and Unblock the Notifications


