»   » కాటమరాయుడు బ్లాక్‌బస్టర్.. విమర్శకులకు చెంపపెట్టు.. వందకోట్ల క్లబ్‌లో..

కాటమరాయుడు బ్లాక్‌బస్టర్.. విమర్శకులకు చెంపపెట్టు.. వందకోట్ల క్లబ్‌లో..

Written By:
Subscribe to Filmibeat Telugu

సినీ విమర్శకుల రిపోర్ట్‌ను లెక్క చేయకుండా కాటమరాయుడు చిత్రం కలెక్షన్ల పరంగా దుమ్మురేపుతున్నది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ను స్టామినాను మరోసారి రుజువు చేస్తూ వంద కోట్ల మైలురాయి వైపు పరుగులు పెడుతున్నది. తొలిరోజు రూ.55 కోట్లకు పైటా వసూలు చేసిన కాటమరాయుడు చిత్రం అదే ఊపును కొనసాగిస్తూ రెండో రోజు రూ. 30 కోట్లకు పైగా కలెక్షన్లను సాధించింది.

బ్లాక్ బస్టర్.. విమర్శకులకు చెంపపెట్టు

కాటమరాయుడు కలెక్షన్లపై సినీ క్రిటిక్, ట్రేడ్ అనలిస్ట్ ఉమేర్ సంధూ స్పందించింది. ఈ చిత్రాన్ని ద్వేషించేవారికి చెంపపెట్టు. కాటమరాయుడు బ్లాక్ బస్టర్. అద్భుతంగా వసూళ్లను సాధిస్తున్నది. ఇప్పటికే రూ.72 కోట్లను వసూలు చేసింది. అభిమానులు ఈ వార్తతో పండుగ చేసుకొంటారు అని ఆమె ట్వీట్ చేసింది.

అభిమానుల బ్రహ్మరధం

అభిమానుల బ్రహ్మరధం

సర్దార్ గబ్బర్ సింగ్ లాంటి దారుణమైన ఫ్లాప్ తర్వాత కాటమరాయుడు చిత్రం విడుదలైంది. పవన్ స్టైల్, యాక్షన్‌కు అభిమానులు బ్రహ్మరధం పట్టారు. వారాంతంలో థియేటర్లు హౌస్ ఫుల్‌గా కనిపించాయి.

రికార్డులను తిరగరాస్తున్న కాటమరాయుడు

రికార్డులను తిరగరాస్తున్న కాటమరాయుడు

తొలిరోజున టాలీవుడ్ రికార్డులన్నీంటిని కాటమరాయుడు తిరగరాసింది. అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నంబర్ 150 చిత్రం సాధించిన రూ.47 కోట్ల కలెక్షన్ల రికార్డును కాటమరాయుడు తుడిచిపెట్టింది. కాటమరాయుడు చిత్రం విడుదలైన అన్ని థియేటర్లలో దాదాపు 95 శాతం ప్రేక్షకులతో నిండిపోయినట్టు వార్తలు అందుతున్నాయి.

100 కోట్ల దిశగా పరుగు

100 కోట్ల దిశగా పరుగు

ఇప్పటికే వ్యాపారపరంగా శాటిలైట్, డిస్ట్రిబ్యూషన్ రైట్స్‌తో కలిపి రూ.100 కోట్లు కాటమరాయుడు వసూలు చేసింది. ఈ సినిమాకు వస్తున్న ఆదరణను బట్టి చూస్తే త్వరలోనే కలెక్షన్ల పరంగా రూ.100 కోట్లు సాధించే అవకాశం కనపడుతున్నది.

ఉత్తర అమెరికాలో కలెక్షన్ల జోరు

ఉత్తర అమెరికాలో కలెక్షన్ల జోరు

ఈ చిత్రం మార్చి 24న దాదాపు 1500 థియేటర్లలో విడుదలైంది. తొలిరోజున ఉత్తర అమెరికాలో రూ.4.4 కోట్లు వసూలు చేసింది. తమిళంలో అజిత్ కుమార్ నటించిన వీరం చిత్రానికి రీమేక్‌గా రూపొందిన కాటమరాయుడులో శృతిహాసన్, ఆలీ, శివబాలాజీ, అజయ్ తదితరులు నటించారు.

English summary
Power Star Pawan Kalyan's Katamarayudu is rocking at the Tollywood box office. Pawan's Katamarayudu has entered into Rs.50 Cr club in India and it is running successfully in theaters, till next weekend complete tickets of Katamarayudu are advance booked in online. Sources predict that Pawan's Katamarayudu would be another super duper hit film in this year 2017 after Chiranjeevi's Khadi No.150.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu