twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘కాటమరాయుడు’ఓవర్ సీస్ ఎంతకు కొన్నారు, కలిసొచ్చే డీల్ యేనా?

    'కాటమరాయుడు' సినిమా ఓవర్ సీస్ బిజినెస్ పూర్తైంది.

    By Srikanya
    |

    హైదరాబాద్‌: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టామినా ఏంటో చూపిస్తోంది కాటమరాయుడు. ఇప్పటికే విడుదల అయిన టీజర్ రికార్డుల మోత మోగిస్తూంటే మరో ప్రక్క చిత్రం ప్రి రిలీజ్ బిజినెస్ సైతం దుమ్ము రేపుతోంది. తాజాగా ఈ చిత్రం ఓవర్ సీస్ రైట్స్ డీల్ క్లోజ్ చేసినట్లు సమాచారం. ఓవర్ సీస్ లోని పెద్ద డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ...11.5 కోట్లకు ఈ చిత్రం రైట్స్ ని తీసుకుంది. అయితే ఓవర్ సీస్ పై ఇంత పెడితే వర్కవుట్ అవుతుందా అనే సందేహం ట్రేడ్ లో చర్చనీయాంశంగా మారింది.

    అయితే పవన్ కు ఇప్పుడున్న క్రేజ్ కు ఖచ్చితంగా ఓ వారంలోనే బ్రేక్ ఈవెన్ వస్తుందని, సినిమా మరీ డిజాస్టర్ అయితే తప్ప నష్టం రాదని అంటున్నారు. అయితే ఇన్ సైడ్ టాక్ ప్రకారం...ఈ చిత్రాన్ని గబ్బర్ సింగ్ స్దాయిలో పవన్ ...అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ మిక్స్ చేసి రెడీ చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా టీజర్ సూపర్ హిట్ అవటం, పవన్ రీసెంట్ గా హార్వర్డ్ యూనివర్శిటికి వచ్చి స్పీచ్ ఇవ్వటం వంటి అంశాలు ప్రి రిలీజ్ బిజినెస్ పై ప్రభావం చూపాయని అభిప్రాయపడుతున్నారు.

    రెండు పాటలు, కొన్ని సన్నివేశాలు మినహా షూటింగ్ పూర్తయింది. ఈ చిత్రం అనుకున్న తేదీ కన్నా ముందే వచ్చేస్తోందని సమాచారం. ముందనుకున్నట్లుగా మార్చి 28న ఉగాది రోజు కాకుండా అంతకు ముందే అంటే... మార్చి 24నే 'కాటమరాయుడు' విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.

    '' 'కాటమరాయుడు' టీజర్‌ ఇటీవలే విడుదలైంది. ప్రచార చిత్రానికి వచ్చిన స్పందన మాలో మరింత ఉత్సాహాన్ని నింపింది. అంతకు పదింతలు 'కాటమరాయుడు' వినోదాన్ని అందిస్తాడు. మార్చిలోనే పాటల్ని విడుదల చేస్తాము. మార్చి 10 నాటికి నిర్మాణానంతర కార్యక్రమాలతో సహా సినిమా పూర్తవుతుంది. 'అని దర్శక నిర్మాతలు తెలిపారు.

    మరో ప్రక్క 'కాటమరాయుడు' సినిమా నైజాం డిస్ట్రిబ్యూషన్‌ హక్కులను హీరో నితిన్‌ సొంతం చేసుకోవటంతో బిజినెస్ సర్కిల్స్ లో సినిమాపై క్రేజ్ రెట్టింపైంది. ఫిల్మ్ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం..ఈ చిత్రం నైజాం హక్కులు ఇరవై కోట్లకి తీసుకున్నారని తెలుస్తోంది. అలాగే ఆ ఇరవై కోట్లలో రెండు కోట్లు రికవరబుల్‌ అని తెలిసింది. అంటే లెక్క ప్రకారం...ఈ సినిమాపై నితిన్‌ ప్లస్‌ ఏషియన్‌ వాళ్ల రిస్క్‌ పద్ధెనిమిది కోట్లు. సగం ఏషియన్ వాళ్లు షేర్ చుసుకంటారు కనుక నితిన్‌ పై తొమ్మిది కోట్లు రికవరీ భాధ్యత ఉంటుంది. అయితే సినిమా ఓ మోస్తరుగా ... యావరేజ్‌ టాక్ తెచ్చుకున్నా ఈ అమౌంట్‌ తిరిగి వచ్చేస్తుంది.

    ఇక 'కాటమరాయుడు' చిత్రం టీజర్‌కు యూట్యూబ్‌లో విశేష స్పందన లభిస్తోంది. 'ఎంత మంది ఉన్నారన్నది ముఖ్యం కాదు.. ఎవడు ఉన్నాడన్నది ముఖ్యం' అంటూ ఫిబ్రవరి 4న విడుదల చేసిన ఈ టీజర్‌ ఇప్పటికీ యూట్యూబ్‌ ట్రెండింగ్‌లో మొదటి స్థానంలో ఉంది. దాంతో ఈ చిత్రం పెద్ద హిట్ అవుతుందనే అంచనాలు అంతటా ఉన్నాయి. ముఖ్యంగా నైజాం ఏరియాలో పవన్ కు ఓ రేంజిలో ఫాలోయింగ్ ఉంది. ఖచ్చితంగా నితిన్ కు ఈ సినిమా లాభాలు తెచ్చి పెడుతుందని ట్రేడ్ లో లెక్కలు వేస్తున్నారు.

    ఇందులో పవన్‌ ఈ పవర్‌ఫుల్‌ డైలాగ్‌ చెబుతూ కనిపించారు. టీజర్‌లో 'రాయుడూ..' అంటూ వస్తున్న నేపథ్య సంగీతం ఆకట్టుకుంటోంది.
    దీంతో అభిమానులు ఈ టీజర్ ను సోషల్ మీడియాలో షేర్ ట్రెండ్ చేస్తూ తెగ సందడి చేస్తున్నారు.


    శ్రుతిహాసన్‌ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం లోని ఇతర ప్రధాన పాత్రలలో ఆలీ, నాజర్, రావు రమేష్, అజయ్, నర్రా శ్రీను, పృథ్వి, శివబాలాజీ, కమల్ కామరాజు, చైతన్య కృష్ణ, తరుణ్ అరోరా, ప్రదీప్ రావత్, పవిత్ర లోకేష్, రజిత, యామిని భాస్కర్, అస్మిత, రమాదేవి, భానుశ్రీ నటిస్తున్నారు. నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకం పై నిర్మిత మవుతున్న ఈ కాటమరాయుడు చిత్రానికి సంగీతం అనూప్ రూబెన్స్, ప్రసాద్ మూరెళ్ళ కెమెరా మన్ గా వర్క్ చేస్తున్నారు. నిర్మాత: శరత్ మరార్ దర్శకత్వం: కిషోర్ పార్ధసాని

    English summary
    The overseas rights deal of Pawan Kalayn’s forthcoming Film ‘Katama Rayudu’ has been closed recently. One of the leading overseas distributors bagged the rights for a whopping price of Rs 11.5 crores which is huge. The film features Pawan Kalyan and Shruti Haasan in lead roles. It is a remake of Ajith’s Tamil Movie Veeram.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X