For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Katrina Kaif: భయపెట్టలేకపోయిన కత్రీనా కైఫ్ 'ఫోన్ భూత్', నిరాశగా ఓపెనింగ్స్, వచ్చింది ఎంతంటే?

  |

  ఈ మధ్య బాలీవుడ్ పరిస్థితి ఏమాత్రం బాగోలేదనే చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతం హిందీలో విడుదలవుతున్న చిత్రాలు సరిగ్గా ప్రేక్షకాదరణకు నోచుకోలేకపోతున్నాయి. సినిమాలో ఎంత పెద్ద స్టార్ క్యాస్టింగ్ ఉన్నప్పటికీ నార్త్ ఆడియెన్స్ కనెక్ట్ కాలేకపోతున్నారు. అందుకు బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చద్దా, అక్షయ్ కుమార్ రక్షా బంధన్, తాప్సీ దొబారా చిత్రాలే ఉదాహరణ. ఈ సినిమాల ప్లాప్ కు బాయ్ కాట్ కూడా ఒక కారణంగా చెప్పవచ్చు.

  అయితే ప్రస్తుతం అగ్ర తారలు ఉండి కంటెంట్ లేని సినిమాలు ప్రేక్షకులకు రుచించట్లేదు. ఇప్పుడు తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రీనా కైఫ్ సినిమాకు షాకింగ్ ఓపెనింగ్స్ వచ్చాయి.

  హార్రర్ కామెడీ చిత్రంగా..

  హార్రర్ కామెడీ చిత్రంగా..

  బాలీవుడ్ స్టార్ హీరోయిన్, హాట్ బ్యూటి కత్రీనా కైఫ్ ఇటీవల యంగ్ హీరో విక్కీ కౌశల్ ను పెళ్లి చేసుకుని వివాహ బంధంలోకి అడుగుపెడుతోంది. మ్యారేజ్ తర్వాత కొద్దిరోజులు వివాహా బంధాన్ని ఆస్వాదించిన ఈ బ్యూటి ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉంది.

  బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్, కత్రీనా కైఫ్ సూపర్ హిట్ సిరీస్ టైగర్ 3లో ఆమె నటిస్తోన్న విషయం తెలిసిందే. దీనికంటే ముందే షూటింగ్ కంప్లీట్ చేసుకుని నవంబర్ 4న ప్రేక్షకులు ముందుకు వచ్చింది కత్రీనా కైఫ్ నటించిన ఫోన్ భూత్. హార్రర్ కామెడీ చిత్రంగా తెరకెక్కిని ఈ మూవీకి ఒక భయానకమైన కామెడీ అని క్యాప్షన్ ఇచ్చారు.

  దెయ్యంగా కత్రీనా కైఫ్..

  దెయ్యంగా కత్రీనా కైఫ్..

  గుర్మీత్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కత్రీనా కైఫ్ తో పాటు యంగ్ హీరోలు సిద్ధాంత్ చతుర్వేది, ఇషాన్ కట్టర్ నటించారు. అలాగే ఇందులో జాకీ ష్రాఫ్ కీ రోల్ ప్లే చేశారు. ఈ నలుగురు ప్రధాన పాత్రదారులుగా కామెడీ అండ్ హార్రర్ జోనర్ లో తెరకెక్కిన చిత్రమే ఫోన్ భూత్.

  ఈ సినిమా విడుదలకు ముందు వచ్చిన పోస్టర్లు, ప్రమోషన్స్, ట్రైలర్ తో ఫోన్ బూత్ పై అంచనాలు నెలకొన్నాయి. ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఇందులో కత్రీనా కైఫ్ దెయ్యంగా కూడా అలరించనుందని ట్రైలర్ లో చూపించారు. అలాగే మనుషులతో ఒక దెయ్యం బిజినెస్ చేస్తే ఎలా ఉంటుందనేది చూపించారు. అయితే అది అంతగా వర్కౌట్ కానట్లుంది.

  తక్కువ ఓపెనింగ్స్..

  తక్కువ ఓపెనింగ్స్..

  కత్రీనా కైఫ్ దెయ్యంగా నటించిన ఫోన్ భూత్ తొలిరోజే నిరాశపరిచింది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అతి తక్కువ వసూళ్లను నమోదు చేసింది ఈ చిత్రం. నవబంర్ 4 అంటే శుక్రవారం థియేటర్లలో విడుదలైన కత్రీనా కైఫ్ ఫోన్ భూత్ చిత్రం తొలిరోజు రూ. 2.05 కోట్లు మాత్రమే రాబట్టగలిగింది. మొదటి షో తక్కువ ఆక్యుపెన్సీతో ప్రారంభమైన సాయంత్రం వరకు ఆక్యుపెన్సీ శాతం పెరిగింది.

  కానీ అనుకున్నంతగా వసూళ్లు మాత్రం సాధించలేకపోయింది. కానీ ఇటీవల ఇదే జోనర్ లో వచ్చిన భూల్ భులయ్యా 2 మాత్రం భారీ వసూళ్లు తీసుకొచ్చింది. ఇక ఫోన్ భూత్ సినిమాకు రూ. 30 కోట్లు బడ్జెట్ అయినట్లు సమాచారం. ఈ సినిమాతో పాటు జాన్వీ కపూర్ సర్వైవల్ థ్రిల్లర్ మిలి, సోనాక్షి సిన్హా, హూమా ఖురేషీ నటించిన డబుల్ ఎక్స్ ఎల్ చిత్రాలు పోటీ పడుతున్నాయి.

  English summary
  Katrina Kaif Ishaan Khattar Siddhant Chaturvedi Phone Bhoot Movie Day 1 Box Office Collection Is Rs. 2.05 Cr.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X