కత్రినాకైఫ్‌కత్తిరించే నైఫ్!
కత్రినాకైఫ్‌పారితోషికం ఎంత? ఆమె ఇప్పుడు కోట్లలోనేతప్ప లక్షల్లో లేదని నిర్మాతలు చెబుతున్నారు. త్వరలో విడుదలకానున్న బాలకృష్ణ సినిమాలో నటించినఆమె 75 లక్షలు తీసుకుందట. ఇకపై లక్షల మాట లేదంటున్నఆమె అంతకుఇష్టమైన వాళ్ళే తననుసంప్రదించాలంటోంది. నిజానికినరసింహుడు నిర్మాత చెంగలవెంకటరావు మొదట ఆమెనేసంప్రదించగా రెండు కోట్లు డిమాండ్ చేసిందనిచెబుతున్నారు. ఆ మాటతోకళ్ళు తిరిగిన వెంకటరావు అమీషాపటేల్‌ను ఎంపిక చేసుకున్నారు. చివరికి ఎవరైనాచెంగలకు చెంగేసుకోక తప్పలేదు. అది వేరేవిషయం. మొదట బాలీవుడ్ భామలవెంటపడిన తమిళ దర్శకనిర్మాతలు ఇటీవల మలయాళమగువలను చౌకగా హైర్ చేసుకుంటున్నారు. అదేట్రెండ్‌నుతెలుగు దర్శక నిర్మాతలు కూడా ఫాలోఅయితే సరిపోతుంది కదా? బాలీవుడ్ భామల కారణంగా ఇంతవరకు ఏతెలుగు సినిమా హిట్ కాలేదు. మరిఎందుకీ క్రేజ్?


Click it and Unblock the Notifications











