Kattalan Day 1 Collections: కాటాలన్ బాక్సాఫీస్ కలెక్షన్స్.. ఆంటోనీ వర్గీస్ మూవీకి తొలి రోజు ఎన్ని కోట్లంటే?

మలయాళ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా వెలుగొందుతున్న ఆంటోనీ వర్గీస్ నటించిన తాజా మూవీ కాటాలన్. పౌల్ జార్జ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 28వ తేదీన వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. టీజర్, ట్రైలర్లు, ప్రమోషనల్ కార్యక్రమాలతో హైప్ తెచ్చుకుంది కాటాలాన్. ఈ నేపథ్యంలో ఈ సినిమా బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ఈవెన్ టార్గెట్ ఎంత? తొలిరోజు కాటాలాన్ మూవీ ఎన్ని కోట్లు రాబట్టింది? ఈ వివరాల్లోకి వెళితే..

కాటాలన్ తారాగణం
క్యూబ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై షరీఫ్ మొహమ్మద్ ఈ కాటాలన్ సినిమాను నిర్మించారు. ఆంటోనీ సరసన దుషారా విజయన్ హీరోయిన్‌గా నటించారు. సిద్ధిఖీ, జగదీష్, కబీర్ దుహన్ సింగ్, సునీల్, అన్సోన్ పాల్, పార్ధ్ తివారీ, హరీశంకర్ నారాయణన్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. రెనదివ్, చంద్రు సెల్వరాజ్, సుదీప్ ఎల్మాన్‌లు సినిమాటోగ్రాఫర్లుగా పనిచేశారు. అజనీష్ లోకనాథ్, రవి బస్రూర్ సంగీతం అందించారు. సమీర్ మొహమ్మద్ ఎడిటర్‌గా పనిచేశారు.

Kattalan Day 1 Expected Box Office Collections Worldwide Antony Varghese s film Opening day Report

కాటాలన్ బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రొడక్షన్ కాస్ట్, పబ్లిసిటీ ఖర్చులు కలిపి కాటాలన్ సినిమాకు 45 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. యాక్షన్ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమా కోసం థాయ్‌లాండ్, వెగమాన్‌లలో చిత్రీకరణ జరిపారు. టెక్నికల్‌ స్టాండర్డ్స్ ఎక్కడా తగ్గకుండా నిర్మాతలు ఖర్చు పెట్టారు. టీజర్, ట్రైలర్, ప్రమోషనల్ కార్యక్రమాలతో కాటాలన్‌పై హైప్ నెలకొంది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే 100 కోట్ల రూపాయలు వసూలు చేయాలని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు.

కాటాలన్ అడ్వాన్స్ బుకింగ్
దృశ్యం 3 తదితర సినిమాలు థియేటర్‌లలో ఉన్నప్పటికీ కాటాలన్‌కు అడ్వాన్స్ బుకింగ్‌కు మంచి రెస్పాన్స్ వచ్చినట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఈ మూవీ ప్రీ సేల్స్ విషయానికి వస్తే మే 28వ తేదీ ఉదయం వరకు కేరళలో 1.85 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 16 లక్షల రూపాయలు, తెలుగు రాష్ట్రాలలో 42 లక్షల రూపాయలు, తమిళనాడులో 13 లక్షల రూపాయలు, రెస్టాఫ్ ఇండియాలో 19 లక్షల రూపాయలు చొప్పున ఇండియాలో 2.75 కోట్ల రూపాయలు రాబట్టింది. ఇక ఓవర్సీస్‌లో కాటాలన్ మూవీకి ప్రీ సేల్స్‌లో 148కే డాలర్లు (1.42 కోట్ల రూపాయలు) వసూలు చేసింది. మొత్తంగా కాటాలన్‌కు అడ్వాన్స్ సేల్స్‌లో వరల్డ్ వైడ్‌గా 4.16 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి.

కాటాలన్ తొలిరోజు వసూళ్లు అంచనా
ఆంటోనీ వర్గీస్ మూవీకి తొలిరోజున మధ్యాహ్నం 1 గంట వరకు ఇండియాలో 1210 షోలు ప్రదర్శితమైన 25 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లుగా సాక్‌నిక్ నివేదించింది. ఇప్పటి వరకు బెంగళూరులో 149 షోలు, త్రివేండ్రంలో 108 షోలు, కొచ్చిలో 96 షోలు, త్రిసూర్‌లో 59 షోలు చొప్పున ప్రదర్శితమయ్యాయి. ఇప్పటి వరకు అందుతున్న సమాచారాన్ని బట్టి కాటాలన్ మూవీకి తొలిరోజున ఇండియాలో 76 లక్షల రూపాయల నెట్.. 90 లక్షల రూపాయల గ్రాస్ వసూలు చేసింది.

కాటాలన్‌కు తొలిరోజున మలయాళంలో 6 కోట్ల రూపాయలు, తెలుగులో 50 లక్షల రూపాయలు, తమిళంలో 20 లక్షల రూపాయలు, కన్నడంలో 30 లక్షల రూపాయలు, రెస్టాఫ్ ఇండియాలో 50 లక్షల రూపాయలు, ఓవర్సీస్‌లో 4 కోట్ల రూపాయలు చొప్పున వరల్డ్ వైడ్‌గా ఫస్ట్ డే 12 నుంచి 15 కోట్ల రూపాయల ఓపెనింగ్స్ రాబడుతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X