Kattalan Day 4 Collections: కాటాలన్‌పై దృశ్యం 3 దెబ్బ.. ఆంటోనీ వర్గీస్ మూవీకి వసూళ్లు ఎంతంటే?

మలయాళ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరో ఆంటోనీ వర్గీస్, దుషారా విజయన్ జంటగా యాక్షన్ మూవీ కాటాలన్. పౌల్ జార్జ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 28వ తేదీన వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. క్యూబ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై షరీఫ్ మొహమ్మద్ ఈ కాటాలన్ సినిమాను నిర్మించారు. సిద్ధిఖీ, జగదీష్, కబీర్ దుహన్ సింగ్, సునీల్, అన్సోన్ పాల్, పార్ధ్ తివారీ, హరీశంకర్ నారాయణన్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. రెనదివ్, చంద్రు సెల్వరాజ్, సుదీప్ ఎల్మాన్‌లు సినిమాటోగ్రాఫర్లుగా పనిచేశారు. అజనీష్ లోకనాథ్, రవి బస్రూర్ సంగీతం అందించారు. సమీర్ మొహమ్మద్ ఎడిటర్‌గా పనిచేశారు. టీజర్, ట్రైలర్లు, ప్రమోషనల్ కార్యక్రమాలతో హైప్ తెచ్చుకుంది కాటాలాన్. ఈ నేపథ్యంలో ఈ సినిమా బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ఈవెన్ టార్గెట్ ఎంత? నాలుగో రోజు కాటాలాన్ మూవీ ఎన్ని కోట్లు రాబట్టింది? ఈ వివరాల్లోకి వెళితే..

కాటాలన్ బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రొడక్షన్ కాస్ట్, పబ్లిసిటీ ఖర్చులు కలిపి కాటాలన్ సినిమాకు 45 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. యాక్షన్ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమా కోసం థాయ్‌లాండ్, వెగమాన్‌లలో చిత్రీకరణ జరిపారు. టెక్నికల్‌ స్టాండర్డ్స్ ఎక్కడా తగ్గకుండా నిర్మాతలు ఖర్చు పెట్టారు. టీజర్, ట్రైలర్, ప్రమోషనల్ కార్యక్రమాలతో కాటాలన్‌పై హైప్ నెలకొంది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే 100 కోట్ల రూపాయలు వసూలు చేయాలని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు.

Kattalan Day 4 Expected Box Office Collections Worldwide Antony Varghese s film saw a surprising drop

కాటాలన్ 3 రోజులు కలెక్షన్స్
ఆంటోనీ వర్గీస్ మూవీకి తొలిరోజున 3.80 కోట్ల రూపాయలు, రెండో రోజున 1.60 కోట్ల రూపాయలు, మూడో రోజున 1.28 కోట్ల రూపాయలు చొప్పున మూడు రోజుల్లో ఇండియా వైడ్‌గా 6.70 కోట్ల రూపాయల నెట్.. 7.70 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది కాటాలన్. ఇప్పటి వరకు మలయాళంలో 5.18 కోట్ల రూపాయలు, తెలుగులో 75 లక్షల రూపాయలు, హిందీలో 61 లక్షల రూపాయలు, కన్నడంలో 4 లక్షల రూపాయలు, తమిళంలో 16 లక్షల రూపాయలు చొప్పున వసూలు చేసింది కాటాలన్.

కాటాలన్ ఓవర్సీస్ కలెక్షన్స్
ఆంటోనీ వర్గీస్ మూవీకి ఓవర్సీస్‌లో తొలిరోజు మంచి కలెక్షన్స్ నమోదయ్యాయి. నార్త్ అమెరికా, గల్ఫ్, సింగపూర్, మలేషియా తదితర దేశాలలో కలిపి కాటాలన్‌కు తొలిరోజున 538కే డాలర్లు (భారత కరెన్సీలో 5.11 కోట్ల రూపాయలు) రాబట్టింది. కానీ రెండో రోజు నుంచి ఓవర్సీస్‌లోనూ ఈ సినిమాకు కలెక్షన్స్ పడిపోయాయి. 3 రోజుల వరకు ఆంటోనీ వర్గీస్ మూవీకి ఓవర్సీస్‌లో 6.21 కోట్ల రూపాయలు మాత్రమే వసూలు చేయగలిగిందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. తద్వారా ఇప్పటి వరకు కాటాలన్ మూవీ వరల్డ్ వైడ్‌గా 14 కోట్ల రూపాయల రేంజ్‌లో రాబట్టినట్లుగా తెలుస్తోంది.

కాటాలన్ 4వ రోజు వసూళ్ల అంచనా
మిక్స్‌డ్ టాక్‌కు తోడు దృశ్యం 3, కరుప్పు వంటి సినిమాల నుంచి కాటాలన్ మూవీకి గట్టి పోటీ ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో ఆంటోనీ వర్గీస్ మూవీకి క్రమేణా వసూళ్లు కోల్పోతోంది. తొలిరోజు దాదాపు 9 కోట్ల రూపాయల ఓపెనింగ్స్ రాబట్టిన కాటాలన్.. రెండో రోజు నుంచి చేతులెత్తేసింది. ఆదివారం కావడంతో ఆంటోనీ వర్గీస్ మూవీకి ఓ మాదిరిగా బుకింగ్స్ జరుగుతున్నట్లుగా నివేదికలు చెబుతున్నాయి. నాలుగో రోజు మధ్యాహ్నం 2 గంటల వరకు ఇండియాలో 592 షోలు ప్రదర్శితమై.. 11 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లు సాక్‌నిక్ పేర్కొంది. నాలుగో రోజు ఇప్పటి వరకు ఈ సినిమాకు ఇండియా వైడ్‌గా 90 లక్షల రూపాయల గ్రాస్ వసూలైనట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆదివారం ఆంటోనీ వర్గీస్ మూవీకి వరల్డ్ వైడ్‌గా 2 కోట్ల రూపాయల రేంజ్‌లో గ్రాస్ లభించే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X