కథ కంచు అయినా కలెక్షన్స్ బంగారమే

అయితేమరో ప్రక్క విపరీతమైన పబ్లిసిటీ,మిగతా సినిమాలకు ఈ మాత్రం సీన్ కూడా లేకపోవటం ప్లస్ అయ్యాయి. దాంతో మంచిగానే డబ్బులు దండుకున్నాయి. అయితే అష్టాచెమ్మ సినిమాలా జెన్యూన్ గా హిట్టుని నమోదు చేయలేకపోయాయి.ఎంత కాలం ధియోటర్స్ లో కాపురం ఉంటాయో తెలియని స్దితి. అయితే రెండూ పెద్ద బ్యానర్స్ కాబట్టి ఆ సమస్య ఉండకపోవచ్చని విశ్లేషకులు అంటున్నారు.
ఇక కౌసల్యా సుప్రజా రామా...సురేష్ ప్రొడక్షన్స్ వారి మారిన టేస్ట్ ని ముందుకు పెట్టి విమర్శకులకు గురి చేసింది. నేను మీకు తెలుసా ఓపినింగ్స్ బాగానే సంపాదించినా ఎదురు డబ్బిచ్చి...అన్న వ్యవహారమని అంతా తిట్టుకుంటూ బయిటకు వస్తున్నారు. నిన్న నేడు రేపు సినిమా కయితే ఆ ప్లాబ్లమే లేదు. ఎందుకంటే ఎవరన్నా చూస్తేనే కదా తిట్టుకోవటమో మెచ్చుకోవటమో చేసేది. కాబట్టి దానికా సమస్యేలేదు. రెయిన్ బో లక్కీగా మొదటిరోజే ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. తర్వాత టెన్షన్ లేకుండా. అలాగే గోపీచంద్ శౌర్యం హిట్టనిపించుకుని బి,సి సెంటర్స్ కి తరలి పోయింది. రక్ష గురించి దర్శక,నిర్మాతలు తప్ప మాట్లాడే వాళ్ళు కరువయ్యారు. ఇక ఈ రోజు శేఖర్ సూరి త్రి సినిమా రిలీజ్ అయింది. రాత్రి ప్రీమియర్ షో వేయటంతో నెగిటివ్ టాక్ ఇప్పటికే స్ప్రెడ్ అయింది.


Click it and Unblock the Notifications











