KD: The Devil Day 1 Collections: కేడీ ది డెవిల్ బాక్సాఫీస్ కలెక్షన్స్... కాంట్రవర్సి మూవీకి తొలి రోజు ఎంతంటే?
ఓ పాట కారణంగా వివాదాస్పదం కావడంతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది కన్నడ మూవీ కేడీ: ది డెవిల్. ఇందులోని సర్సే నిన్నా సెరగా సర్సే సాంగ్‌ని కన్నడంతో పాటు ఇతర భాషల్లోనూ డబ్ చేశారు. అయితే ఈ పాటలోని హిందీ వెర్షన్‌పై మహిళా సంఘాలు, సాంప్రదాయవాదుల నుంచి పెద్ద ఎత్తున అభ్యంతరాలు వెల్లువెత్తడంతో పాటు వివాదానికి దారి తీసింది. దాంతో ఏకంగా కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగి ఈ పాటను తొలగించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని ప్లాట్‌ఫామ్స్ నుంచి ఈ పాటను తొలగించారు. విడుదలకు ముందే వివాదం కారణంగా జనం దృష్టిని ఆకర్షించిన కేడీ: ది డెవిల్ మూవీ ఏప్రిల్ 30వ తేదీన ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ఈవెన్ టార్గెట్ ఎంత? తొలిరోజు ఈ సినిమా ఎన్ని కోట్లు రాబట్టింది? ఈ వివరాల్లోకి వెళితే..
కేడీ: ది డెవిల్ తారాగణం
కన్నడ స్థార్ హీరో ధ్రువ సర్జా ఈ సినిమాలో హీరోగా నటించగా.. రీష్మా నానయ్య హీరోయిన్‌గా నటించారు. సంజయ్ దత్, శిల్పాశెట్టి, వీ రవిచంద్రన్, రమేశ్ అరవింద్, జిషుసేన్ గుప్తా, పీ రవిశంకర్‌లు కీలకపాత్రలు పోషించారు. కన్నడ సూపర్‌స్టార్ కిచ్చా సుదీప్ గెస్ట్ రోల్‌లో అలరించనున్నారు. నోరా ఫతేహి ఐటెం సాంగ్‌లో ఆడిపాడారు. జన నాయగన్, టాక్సిక్ వంటి పాన్ ఇండియా సినిమాలను నిర్మిస్తోన్న కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కే నారాయణ ఈ కేడీ: ది డెవిల్ మూవీని భారీ బడ్జెట్‌తో నిర్మించగా.. ప్రేమ్ దర్శకత్వం వహించారు. అర్జున్ జన్యా సంగీతం అందించగా.. విలియమ్ డేవిడ్ సినిమాటోగ్రాఫర్‌గా, సంకేత్ ఆచార్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.

కేడీ: ది డెవిల్ కాంట్రవర్సిపై కిచ్చా స్పందన
పాట వివాదం నేపథ్యంలో కిచ్చా సుదీప్ స్పందించారు. ఒక వ్యక్తి గురించి విమర్శలు చేసేటప్పుడు అతను గతంలో చేసిన మంచిని కూడా గుర్తుంచుకోవాలి. ప్రేమ్ గతంలో ఎన్నో మంచి మాటలు అందించారు. వాటిని మనం విని ఆనందించాం. కర్ణాటక వెలుపల ఉన్నవారికి ఆయన సేవలు తెలియకపోవచ్చు. అందుకే విమర్శిస్తున్నారు. కొన్నిసార్లు తప్పులు జరుగుతుంటాయి. ఇది సహజం.. సోషల్ మీడియా అనేది అభిప్రాయాలను పంచుకోవడానికే అయినా.. ఎదుటి వ్యక్తి మీద ఇంత కఠినంగా ఉండనక్కర్లేదు అని కిచ్చా సుదీప్ అభిప్రాయపడ్డారు.
కేడీ: ది డెవిల్ బడ్జెట్ ఎంత?
ఇకపోతే.. టాక్సిక్, జననాయగన్, కేడీ: ది డెవిల్ సినిమాలకు కలిపి 1000 కోట్ల రూపాయలతో కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మాణంలోకి దిగినట్లు కన్నడ చిత్ర పరిశ్రమ తెలిపింది. టీజర్, ట్రైలర్లు, ప్రమోషనల్ కార్యక్రమాలకు తోడు పాట వివాదం కారణంగా కేడీ ది డెవిల్ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ తొలిరోజు కలెక్షన్స్ పరిశీలిస్తే..
కేడీ: ది డెవిల్ తొలి రోజు వసూళ్లు
అడ్వాన్స్ బుకింగ్‌లో కేడీ: ది డెవిల్ మూవీకి ఇండియాలో 1.25 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. పేట్రియాట్, కర వంటి సినిమాలు రిలీజ్ అవుతున్నప్పటికీ కంటెంట్ మీదున్న నమ్మకంతో ఏప్రిల్ 30వ తేదీన కేడీ: ది డెవిల్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. గురువారం సాయంత్రం 4 గంటల వరకు తొలిరోజు ధ్రువ సర్జా మూవీకి ఇండియాలో 481 షోలు ప్రదర్శితమై.. 44 శాతం ఆక్యూపెన్సీతో 1.25 కోట్ల రూపాయల నికర వసూళ్లు రాబట్టినట్లు సాక్‌నిక్ పేర్కొంది. కేడీ: ది డెవిల్ మూవీ తొలిరోజు వరల్డ్ వైడ్‌గా 4 కోట్ల రూపాయలకు పైగా ఓపెనింగ్స్ రాబడుతుందని అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications