Keeda Cola day 2 Collections షాకింగ్‌గా కీడా కోలా కలెక్షన్లు.. లాభాల్లోకి రావాలంటే ఎన్ని కోట్లు కావాలంటే?
తెలుగు సినిమా పరిశ్రమలో చిన్న చిత్రంగా థియేటర్లలోకి వచ్చిన కీడా కోలా సినిమా భారీ వసూళ్లను రాబడుతున్నది. నవంబర్ 3వ తేదీన భారీ అంచనాలతో రిలీజైన ఈ సినిమా అంచనాలు మించి కలెక్షన్లు సాధిస్తున్నది. తరుణ్ భాస్కర్ నటించి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చైతన్య రావు, రాగ్ మయూర్, బ్రహ్మనందం, జీవన్, రఘురామ్ తదితరులు నటించిన ఈ సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
క్రైమ్ కామెడీ సినిమాగా రిలీజైన కీడా కోలా మూవీని 15 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించారు. ఈ సినిమాను సుమారుగా 10 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ జరిగింది. ఇక ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా 20 కోట్ల గ్రాస్, 10 కోట్ల రూపాయల షేర్‌ను డిసైడ్ చేశారు. ఇక ఈ సినిమాకు భారీ క్రేజ్ ఉండటంతో 800 స్క్రీన్లలో రిలీజ్ చేశారు.

ఇక కీడా కోలా సినిమా తొలి రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తెలుగు రాష్ట్రాల్లో భారీగా వసూళ్లను సాధించింది. కర్ణాటకలో ఇతర రాష్ట్రాల్లో కలిపి ఈ సినిమా 2.5 కోట్ల షేర్ వసూలు చేసింది. ఓవర్సీస్‌లో 2 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా తొలి రోజు 4.5 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.
కీడా కోలా సినిమా రెండో రోజు నిలకడగా బాక్సాఫీస్ వద్ద కనిపించింది. ఈ సినిమా మార్నింగ్ షో 25 శాతం, మ్యాట్నీకి 35 శాతం ఆక్యుపెన్సీ నమోదు చేసింది. అలాగే ఫస్ట్ షోకు 35 శాతం, సెకండ్ షోకు 35 శాతం ఆక్యుపెన్సీని రాబట్టింది. ఓవరాల్ ఈ సినిమా 30 శాతం ఆక్యుపెన్సీని రెండో రోజు నమోదు చేసింది.
కీడా కోలా మూవీ రెండో రోజు కూడా బాక్సాఫీస్ వద్ద బలంగా కనిపించింది. ఈ సినిమా రెండో రోజు ఇండియా వైడ్ 2 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 1.5 కోట్లు వసూలు చేసే అవకాశం ఉంది. మొత్తంగా ఆ సినిమా 3.5 కోట్లు వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దాంతో ఈ సినిమా రెండు రోజుల్లో 8 కోట్ల రూపాయలు వసూలు చేసే అవకాశం కనిపిస్తున్నది.
కీడా కోలా సినిమా 20 కోట్ల గ్రాస్ వసూళ్ల బ్రేక్ ఈవెన్ లక్ష్యంతో బాక్సాఫీస్ యాత్రను ప్రారంభించింది. రెండో రోజు అంచనా ప్రకారం 8 కోట్ల రూపాయలు రాబట్టింది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే.. ఇంకా 12 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను రాబట్టాల్సి ఉంది. తొలి వారం ముగిసే సమయానికి ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.


Click it and Unblock the Notifications











