Keedaa Cola 1st Week Collections: 9 కోట్ల టార్గెట్.. వారంలో షాకింగ్‌గా.. హిట్ కావాలంటే మాత్రం!

కామెడీ బ్యాగ్‌డ్రాప్‌లో వచ్చే సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలు ప్రేక్షకుల హృదయాలను దోచుకుంటాయి. ఇలా ఇప్పటికే ఎన్నో సినిమాలు నిరూపించాయి కూడా. ఈ కోవలోనే రూపొంది ఇటీవలే ఆడియెన్స్ ముందుకు వచ్చిన సినిమానే 'కీడా కోలా'.

విభిన్నమైన చిత్రాలతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న తరుణ్ భాస్కర్ తెరకెక్కించి, నటించిన ఈ మూవీకి మంచి టాక్ వచ్చింది. అందుకు తగ్గట్లుగానే ఆరంభంలోనే వసూళ్లు భారీగా వచ్చాయి. కానీ, తర్వాత ఇది డౌన్ అవుతూనే ఉంది. మరి 'కీడా కోలా' మూవీ 7 రోజుల్లో ఎంత రాబట్టిందో మీరే చూసేయండి మరి!

Keedaa Cola Movie 1st Week Worldwide Official Box Office Collections

క్రేజీ కాన్సెప్టుతో వచ్చిన మూవీ: క్రియేటివ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ నటించి, తెరకెక్కించిన చిత్రమే 'కీడా కోలా'. ఈ చిత్రాన్ని సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్, భరత్ కుమార్, శ్రీపాద్ నందిరాజ్‌లు సంయుక్తంగా నిర్మించారు. ఇందులో తరుణ్ భాస్కర్, బ్రహ్మానందం, హరి కాంత్, చైతన్య రావు, రఘురామ్, విష్ణు, జీవన్ కుమార్ తదితరులు నటించారు. వివేక్ సాగర్ ఈ సినిమాకు సంగీతం ఇచ్చాడు.

Keedaa Cola Movie 1st Week Worldwide Official Box Office Collections

అన్ని కోట్లు బిజినెస్ చేసింది: దర్శకుడు తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన చిత్రం కావడంతో పాటు డిఫరెంట్ కాన్సెప్టుతో రూపొందడంతో 'కీడా కోలా'కు ఆరంభంలోనే మంచి గుర్తింపు దక్కింది. దీనికితోడు ఈ సినిమా ప్రచార చిత్రాలతో రెస్పాన్స్ భారీగా రావడంతో అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా అన్ని ఏరియాలు కలిపి రూ. 8.50 కోట్లు మేర థియేట్రికల్ బిజినెస్ చేసుకుని విడుదలైంది.

Keedaa Cola Movie 1st Week Worldwide Official Box Office Collections

7వ రోజు తెలుగులో ఎంతంటే: సస్పెన్స్‌ జోనర్‌లో ఫన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'కీడా కోలా' సినిమాకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మొదటి రెండు రోజులూ విశేషమైన స్పందన లభించింది. కానీ, ఆ తర్వాత నుంచే ఈ సినిమా ఆశించిన రీతిలో రెస్పాన్స్‌ను అందుకోలేదు. ఈ క్రమంలోనే ఈ చిత్రం ఏడో రోజైన గురువారం కేవలం రూ. 10 లక్షలు షేర్‌తో పాటు రూ. 20 లక్షలు గ్రాస్‌ను మాత్రమే కలెక్ట్ చేసుకుంది.

7 రోజులకూ కలిపి ఎంతంటే: క్రేజీ కాన్సెప్టుతో రూపొందిన 'కీడా కోలా' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో వారం రోజుల్లో తక్కువ రెస్పాన్స్ లభించింది. ఫలితంగా ఈ చిత్రం నైజాం ఏరియాలో రూ. 2.44 కోట్లు, ఆంధ్రాలోని అన్ని ప్రాంతాలనూ కలుపుకుని రూ. 1.39 కోట్లు షేర్‌ను వసూలు చేసింది. ఇలా ఏడు రోజుల్లో ఏపీ, తెలంగాణలో కలిపి ఈ మూవీకి రూ. 3.83 కోట్లు షేర్, రూ. 7.15 కోట్లు గ్రాస్ వచ్చింది.

Keedaa Cola Movie 1st Week Worldwide Official Box Office Collections

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే: కామెడీ జోనర్‌లో రూపొందిన 'కీడా కోలా' మూవీకి ఓవర్సీస్‌లోనూ అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. అక్కడ లిమిటెడ్ స్క్రీన్లలోనే ప్రదర్శితం అయిన ఈ చిత్రం 600K డాలర్లు రాబట్టింది. ఇలా ఓవర్సీస్, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా కలిపి రూ. 3.02 కోట్లు వసూలు చేసింది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఇది రూ. 6.85 కోట్లు షేర్‌, రూ. 13.50 కోట్లు గ్రాస్‌ను కలెక్ట్ చేసింది.

Keedaa Cola Movie 1st Week Worldwide Official Box Office Collections

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?: తరుణ్ భాస్కర్ రూపొందించిన 'కీడా కోలా' చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలనూ కలుపుకుని రూ. 8.50 కోట్లు వరకూ థియేట్రికల్ బిజినెస్ చేసుకున్నట్లు తెలిసింది. అంటే ఈ చిత్రం రూ. 9.00 కోట్లు షేర్ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో వచ్చింది. వారం రోజుల్లో ఇది రూ. 6.85 కోట్లు రాబట్టింది. ఇక, ఇది హిట్ కావాలంటే మరో రూ. 2.15 కోట్లు షేర్ రాబట్టాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X