Keedaa Cola 3 Days Collections: సండే షాకింగ్ వసూళ్లు.. 3 రోజుల్లో అన్ని కోట్లు.. ఇంకెంత రావాలంటే!
ఫన్ కాన్సెప్టులతో వచ్చే సినిమాలకు తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరణను అందిస్తూనే ఉంటారు. అందుకే ఆ తరహా సినిమాలు మన దగ్గర ఎక్కువగా వస్తున్నాయి. ఇప్పుడు అలా ప్రేక్షకులను అలరించేందుకు విడుదలైన చిత్రమే 'కీడా కోలా'. డిఫరెంట్ చిత్రాలతో విశేషమైన గుర్తింపును తెచ్చుకున్న తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన, నటించిన ఈ మూవీకి మంచి టాక్ వచ్చింది. అందుకు తగ్గట్లుగానే రెండు రోజులు వసూళ్లు వచ్చాయి. కానీ, ఆదివారం ఇది డౌన్ అయింది. మరి 'కీడా కోలా' మూవీ మూడు రోజుల్లో ఎంత రాబట్టిందో మీరే చూసేయండి మరి!
ఫన్ స్టోరీతో వచ్చిన కీడా కోలా:టాలెంటెడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ నటించి, తీసిన సినిమానే 'కీడా కోలా'. ఈ చిత్రాన్ని సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్, భరత్ కుమార్, శ్రీపాద్ నందిరాజ్‌లు సంయుక్తంగా నిర్మించారు. ఇందులో తరుణ్ భాస్కర్, బ్రహ్మానందం, హరి కాంత్, చైతన్య రావు, రఘురామ్, విష్ణు, జీవన్ కుమార్ తదితరులు నటించారు. వివేక్ సాగర్ ఈ సినిమాకు సంగీతాన్ని సమకూర్చాడు.

అన్ని కోట్లు బిజినెస్ చేసింది:తక్కువ సినిమాలే చేసినా తనకంటూ ప్రత్యేకతను చాటుకున్న దర్శకుడు తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన చిత్రం కావడంతో 'కీడా కోలా'కు ఆరంభంలోనే మంచి గుర్తింపు దక్కింది. దీనికితోడు ఈ సినిమా ప్రచార చిత్రాలతో రెస్పాన్స్ భారీగా రావడంతో అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా అన్ని ఏరియాలు కలిపి రూ. 8.50 కోట్లు మేర థియేట్రికల్ బిజినెస్ అయింది.
మూడో రోజు తెలుగులో ఇలా:డిఫరెంట్ కాన్సెప్టుతో ఫన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'కీడా కోలా' సినిమాకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మొదటి రెండు రోజులూ విశేషమైన స్పందన లభించింది. కానీ, హాలీడే ఉన్నా మూడో రోజు మాత్రం ఇది ఆశించిన రీతిలో రెస్పాన్స్‌ను అందుకోలేదు. ఫలితంగా ఈ చిత్రం ఆదివారం రూ. 60 లక్షలు షేర్‌తో పాటు రూ. 1.05 కోట్లు గ్రాస్‌ను మాత్రమే కలెక్ట్ చేసుకుంది.

3 రోజులకూ కలిపి ఎంతంటే:క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన 'కీడా కోలా' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల్లో డీసెంట్ రెస్పాన్స్ లభించింది. ఫలితంగా ఈ చిత్రం నైజాం ఏరియాలో రూ. 2.00 కోట్లు, ఆంధ్రాలోని అన్ని ప్రాంతాలనూ కలుపుకుని రూ. 1.05 కోట్లు షేర్‌ను వసూలు చేసింది. ఇలా మూడు రోజుల్లో ఏపీ, తెలంగాణలో కలిపి ఈ మూవీ రూ. 3.05 కోట్లు షేర్, రూ. 5.70 కోట్లు గ్రాస్ వచ్చింది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే:కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'కీడా కోలా' మూవీకి ఓవర్సీస్‌లోనూ అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. అక్కడ లిమిటెడ్ స్క్రీన్లలోనే ప్రదర్శితం అయిన ఈ చిత్రం 500K డాలర్లు రాబట్టింది. ఇలా ఓవర్సీస్, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా కలిపి రూ. 2.50 కోట్లు వసూలు చేసింది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఇది రూ. 5.55 కోట్లు షేర్, రూ. 10.75 కోట్లు గ్రాస్‌ను కలెక్ట్ చేసింది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?:భిన్నమైన కథాంశంతో రూపొందిన 'కీడా కోలా' చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలనూ కలుపుకుని రూ. 8.50 కోట్లు వరకూ థియేట్రికల్ బిజినెస్ చేసుకున్నట్లు తెలిసింది. అంటే ఈ చిత్రం రూ. 9.00 కోట్లు షేర్ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో వచ్చింది. మూడు రోజుల్లో ఇది రూ. 5.55 కోట్లు రాబట్టింది. ఇక, ఇది హిట్ కావాలంటే మరో రూ. 3.45 కోట్లు షేర్ రాబట్టాలి.


Click it and Unblock the Notifications











