Keedaa Cola Day 1 Collections: కీడా కోలాకు షాకింగ్ కలెక్షన్లు.. తొలి రోజు ఎన్ని కోట్లో తెలిస్తే!
తెలుగు చిత్ర పరిశ్రమలో ఫన్ ఎంటర్‌టైనర్ మూవీలు చాలానే వస్తున్నాయి. అందులో డిఫరెంట్ కాన్సెప్టుతో వచ్చేవి మాత్రం చాలా తక్కువగానే ఉంటున్నాయి. ఈ పరిస్థితుల్లో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన క్రేజీ సినిమానే 'కీడా కోలా'.
తనదైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తోన్న తరుణ్ భాస్కర్ నటించి, తెరకెక్కించిన ఈ సినిమాకు ఆరంభంలోనే మంచి టాక్ వచ్చింది. దీంతో ఆడియెన్స్ నుంచి మొదటి రోజే మంచి స్పందన కూడా లభించింది. మరి 'కీడా కోలా' మూవీ మొదటి రోజు ఎంత రాబట్టిందో మీరే చూసేయండి మరి!

కీడా కోలా అంటూ వచ్చేశారు: ప్రముఖ దర్శకుడు స్వీయ డైరెక్షన్‌లో వచ్చిన సినిమానే 'కీడా కోలా'. ఈ చిత్రాన్ని సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్, భరత్ కుమార్, శ్రీపాద్ నందిరాజ్‌లు సంయుక్తంగా నిర్మించారు. ఇందులో తరుణ్ భాస్కర్, బ్రహ్మానందం, హరి కాంత్, చైతన్య రావు, రఘురామ్, విష్ణు, జీవన్ కుమార్ తదితరులు నటించారు. వివేక్ సాగర్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించాడు.

అన్ని కోట్లు బిజినెస్ చేసింది: డైరెక్టర్‌గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన చిత్రం కావడంతో 'కీడా కోలా'కు ఆరంభంలోనే మంచి గుర్తింపు దక్కింది. దీనికితోడు ఈ సినిమా ప్రచార చిత్రాలతో రెస్పాన్స్ భారీగా రావడంతో అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా అన్ని ఏరియాలు కలిపి రూ. 8.50 కోట్లు మేర థియేట్రికల్ బిజినెస్ చేసుకుంది.
అలాంటి టాక్.. భారీ రెస్పాన్స్: భిన్నమైన కాన్సెప్టుతో రూపొందిన 'కీడా కోలా' మూవీకి అమెరికాలో వేసిన ప్రీమియర్ షోల నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లోనూ అదే సీన్ కనిపించింది. ఫలితంగా ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి స్పందన ఆశించిన దానికంటే ఎక్కువే దక్కింది. ముఖ్యంగా ఈవినింగ్ షోలు హౌస్‌ఫుల్ అయ్యాయి. దీంతో ఈ సినిమాకు మంచి కలెక్షన్లు వస్తాయని విశ్లేషకులు తెలిపారు.

తెలుగు రాష్ట్రాలో ఎంతంటే: డిఫరెంట్ జోనర్‌లో రూపొందిన 'కీడా కోలా' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు అనుకున్న దానికంటే తక్కువ రెస్పాన్స్ లభించింది. ఫలితంగా ఈ చిత్రం నైజాం ఏరియాలో రూ. 90 లక్షలు, ఆంధ్రాలోని అన్ని ప్రాంతాలనూ కలుపుకుని రూ. 50 లక్షలు వరకూ షేర్‌ను వసూలు చేసింది. ఇలా తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 1.40 కోట్లు షేర్, రూ. 2.65 కోట్లు గ్రాస్ వచ్చింది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే: కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'కీడా కోలా' మూవీకి ఓవర్సీస్‌లోనూ అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. అక్కడ లిమిటెడ్ స్క్రీన్లలోనే ప్రదర్శితం అయిన ఈ చిత్రం 200K డాలర్లు రాబట్టింది. ఇలా ఓవర్సీస్, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా కలిపి రూ. 1.45 కోట్లు వసూలు చేసింది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఇది రూ. 2.85 కోట్లు షేర్, రూ. 5.65 కోట్లు గ్రాస్‌ను కలెక్ట్ చేసింది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?: విభిన్నమైన కథాంశంతో రూపొందిన 'కీడా కోలా' చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలనూ కలుపుకుని రూ. 8.50 కోట్లు వరకూ థియేట్రికల్ బిజినెస్ చేసుకున్నట్లు తెలిసింది. అంటే ఈ చిత్రం రూ. 9.00 కోట్లు షేర్ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో వచ్చింది. మొదటి రోజు ఇది రూ. 2.85 లక్షలు రాబట్టింది. ఇక, ఇది హిట్ కావాలంటే మరో రూ. 6.15 కోట్లు షేర్ రాబట్టాలి.


Click it and Unblock the Notifications











