Keeeda Cola Collections కీడా కోలా బాక్సాఫీస్ మ్యాజిక్.. తరుణ్ భాస్కర్ మూవీకి ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?

హాస్య బ్రహ్మ బ్రహ్మనందం, చైతన్య రావు మదాడి, తరుణ్ భాస్కర్, రఘురామ్, రాగ్ మయూర్, జీవన్, విష్ణు తదితరులు నటించిన కీడా కోలా చిత్రం బాక్సాఫీస్ వద్ద డీసెంట్‌గా కలెక్షన్లు ప్రారంభించింది. తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు తొలి ఆట నుంచి పాజిటివ్ టాక్‌ రావడంతో ట్రేడ్ వర్గాల్లో జోష్ కనిపిస్తున్నది. ఈ క్రమంలో ఈ మూవీ బడ్జెట్, ప్రీ రిలీజ్ బిజినెస్, బ్రేక్ ఈవెన్ టార్గెట్, కలెక్షన్ల వివరాల్లోకి వెళితే...

కీడా కోలా మూవీ బడ్జెట్ విషయానికి వస్తే.. ఈ సినిమాలో నటీనటులు భారీగా ఉండటంతో రెమ్యురేషన్లతో కలిపి భారీగానే ఖర్చు చేశారు. ఈ సినిమాను 15 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. ఈ చిత్రానికి సంబంధించిన బిజినెస్ 10 కోట్లుగా నమోదైంది. దాంతో ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే 10 కోట్ల షేర్, 20 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

Keeeda Cola day 1 Expected Collections: Tarun Bhascker movie decent start at box office

కీడా కోలా సినిమా టీజర్, ట్రైలర్లు, ప్రమోషనల్ కార్యక్రమాలు ఊపందుకోవడంతో మూవీకి మంచి డిమాండ్ ఏర్పడింది. దాంతో ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా 800 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఈ సినిమాను ఓవర్సీస్‌లో 400 స్క్రీన్లలో రిలీజ్ చేయగా, ఇండియాలో 400 స్క్రీన్లలో విడుదల చేశారు.

ఇక కీడా కోలాకు సంబంధించిన ప్రీమియర్లు, పెయిడ్ షోల తర్వాత క్రిటిక్స్, కామన్ ఆడియెన్స్ నుంచి భారీ స్పందన లభించింది. రెండు రోజులుగా హైదరాబాద్, ఇతర ప్రాంతాల్లో ప్రదర్శించిన పెయిడ్ షోలకు వచ్చిన పాజిటివ్‌ టాక్‌తో సినిమాకు తొలి రోజు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి.

Keeeda Cola day 1 Expected Collections: Tarun Bhascker movie decent start at box office

కీడా కోలా సినిమాకు ఏపీ తెలంగాణలో ఓ మాదిరి ఆక్యుపెన్సీ కనిపించింది. ఉదయం షోకు 40 శాతం, మ్యాట్నీకి 45 శాతం, ఫస్ట్ షోకు 45 శాతం, సెకండ్ షోకు 50 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. హైదరాబాద్‌లో 35 శాతం, వరంగల్‌లో 40 శాతం, వైజాగ్‌లో 35 శాతం, కాకినాడ, మహబూబ్ నగర్‌లో 30 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది.

ఇక కీడా కోలా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తొలి రోజు ఈ మూవీ డీసెంట్ కలెక్షన్లను ప్రారంభించింది. బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ నోట్‌తో జర్నీని మొదలుపెట్టింది. ఇండియాలో 1.5 కోట్ల షేర్, ప్రపంచవ్యాప్తంగా 4 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అది కాకుండా ఈ సినిమా మౌత్ టాక్ పెరిగితే.. కలెక్షన్లు కూడా పెరిగే అవకాశం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X